Tuesday, July 27, 2021
Home Uncategorized బ్రేకింగ్: ప్రధానికి పదవీ గండం

బ్రేకింగ్: ప్రధానికి పదవీ గండం

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పదవి నుంచి దిగిపోయే అవకాశాలు ఉన్నాయని టాక్. ఆ దేశ పార్లమెంట్‌ లో శనివారం ఆయన విశ్వాస పరీక్ష ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఛీప్ కూడా ఉన్నారని తెలుస్తుంది. నేడు సాయంత్రం 7.30 గంటలకు ఆయన ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది.

ఇమ్రాన్ క్యాబినెట్ లోని ఆర్థిక శాఖ మంత్రి సెనెట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఇప్పటికే ఆయన ఆ దేశంలో ఉద్యమాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆయన రాజీనామా చేయాలి అనే డిమాండ్ లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఇక ఆయన విశ్వాస పరిక్షపై భారత ప్రభుత్వ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

- Advertisment -

Most Popular

Recent Comments