Wednesday, July 28, 2021
Home State Affairs బ్రేకింగ్: షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ

బ్రేకింగ్: షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ

తెలంగాణాలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ విషయంలో ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. షర్మిల పార్టీ నిర్మాణానికి సంబంధించి గత నెల రోజుల నుంచి పార్టీలోకి వచ్చే వాళ్ళతో చర్చలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లా నేతలతో ఆమె సమావేశాలు నిర్వహించారు. ఇక త్వరలోనే మరికొన్ని జిల్లాల నేతలతో ఆమె సమావేశం అయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఆమె పార్టీలోకి పలువురు మాజీ అధికారులు కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మాజీ డీజీపీ కూడా వస్తున్నట్టు సమాచారం. షర్మిల పార్టీ లోకి మాజీ డి జి పి స్వరన్ జీత్ సేన్ ? వస్తున్నట్టు తెలుస్తుంది. షర్మిల ను కలిసిన స్వరన్ జీత్ సేన్ సతీమణి అనితా సేన్… షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తో చర్చించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2006 వరకు డి జి పి గా పని చేసి రిటైర్ అయ్యారు స్వరన్ జీత్ సేన్. షర్మిల పార్టీ కి సలహాదారుడుగా పని చేసే అవకాశం ఉందని అంటున్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments