Tuesday, July 27, 2021
Home Prime Politics నాకు ఎవరూ పోటీ లేరు రారు కూడా... బైరెడ్డి సిద్దార్థ ధీమా

నాకు ఎవరూ పోటీ లేరు రారు కూడా… బైరెడ్డి సిద్దార్థ ధీమా

కర్నూలులో నందికొట్కూరు నియోజకవర్గం సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జన్మదిన వేడుకలు కాస్త ఘనంగా జరిగాయి. కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నాయకులే నాపై కేసులు పెట్టాలని చూశారు అని ఆయన ఆరోపించారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మంత్రి అనిల్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ సహాయం చేశారు అని ఆయన గుర్తు చేసారు.

సొంత మండలంలో రెవెన్యూ అధికారులు ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వెళ్లి చెప్పాను అని అన్నారు. వెంటనే ఆయన ఇళ్ళ పట్టాలు ఇప్పించాడు అని అన్నారు. నాకు ఎవరూ పోటీ లేరు అన్నారు బైరెడ్డి. ఎన్ని శక్తులు వచ్చినా నన్నేమి చేయలేవు అని ధీమా వ్యక్తం చేసారు. ప్రాణాలు ఇచ్చే రోజులు తీసేసే రోజులు పోయాయి అని, కాలాణుగునంగా అప్ డేట్ కాపోతే నారా లోకేష్, రాహుల్ గాంధీ లా ఉండాల్సి వస్తుంది అని హితవుపలికారు.

- Advertisment -

Most Popular

Recent Comments