Categories
ANDHRA PRADESH FEATURED

జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ!

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సచివాయంలో ఉన్న రాష్ట్ర విజిలెన్స్‌ కార్యాయాన్ని కర్నూలు తరలించాన్న ప్రభుత్వ ఉత్తర్వుల‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులు చెల్ల‌వ‌ని తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘జగన్‌’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు రాజధానుల‌ను ఏర్పాటు చేస్తున్నామని, అధికారాన్ని వికేంద్రీకృత చేస్తున్నామని, రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని తెలిపింది. అమరావతిలో ‘శాసనరాజధాని, ‘కర్నూలు’లో న్యాయరాజధాని, విశాఖపట్నంలో ‘కార్యనిర్వహకరాజధాని’ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానాన్ని ఆమోదించారు. తరువాత దీన్ని శాసనమండలి అడ్డుకుంది. మూడు రాజధానులు, వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి అడ్డుకుంటూ దాన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపింది. అయితే అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని శాసనమండలి అడ్డుకున్నదని భావిస్తూ శాసనమండలి అవసరం లేదని దాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇది ఇలా ఉంటే మూడు రాజధానుల‌ వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర విజిలెన్స్‌ కమీషన్‌, కమీషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాయాల‌ను కర్నూలుకు తరలించాని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై హైకోర్టులో వివిధ వర్గాలు కేసు వేశాయి. దీనిపై విచారణ జరగగా, ప్రభుత్వం సమాధానం ఇస్తూ…రాష్ట్ర సచివాయంలో విజిలెన్స్‌ కమీషన్‌, కమీషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ కార్యాయాల‌కు వసతి లేదని, అందుకే పాల‌నాపరమైన కారణాల‌తో వీటిని కర్నూలుకు తరలిస్తున్నామని హైకోర్టులో ప్రభుత్వం చెప్పింది. అయితే దీనిపై హైకోర్టు స్పందిస్తూ సచివాల‌యంలో వసతి లేకపోతే దాని పక్కనో..లేక గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలి కానీ, కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించి కేసును వాయిదా వేసింది. ఈ రోజు కేసు విచారణలో భాగంగా విజిలెన్స్‌, కమీషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాయాను కర్నూలుకు తరలిస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేసింది.

Categories
ANDHRA PRADESH POLITICS

3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకో.. జగన్ పై దర్శక నిర్మాత సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సీని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్…

మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోమనండి అన్నారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. బస్ వేసుకొని తిరిగి తిరిగి చోటల్లా రాజధాని చెప్పమనండి..ఎక్కడి నుండి పాలన జరిగితే అదే రాజధాని అవుతుంది కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన రాజధానులు కావు…

మంచికో , చెడుకో అమరావతి రాజధాని అంటూ సుమారుగా ప్రజాధనం ఏడు వేల కోట్లు పెట్టారు.. మరో రెండు వేల కోట్లు పెడితే అది పూర్తవుతుంది..

ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక సమస్యను తెస్తూనే ఉన్నారు.. గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే ప్రభుత్వం అరెస్టు చేసింది, ప్రతిపక్షంలో ఉండి వాళ్లే ప్రత్యేక హోదా అడగ మంటున్నారు..

రాజధాని విషయం పక్కన పెడితే, అసెంబ్లీలో నేతలు బూతులు తిట్టుకున్నారు, తెలుగు వాడమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోంది..ముందు సంస్కారవంతులుగా మారాలని నేను కోరుకుంటున్నాను…

విశాఖపట్నంలో ఈయన మాట్లాడుతూ జగన్‌కు సెటైర్లు వేసాడు.

Categories
ANDHRA PRADESH FEATURED

సీఎం జగన్ కు మాజీ సీఎస్ ఐ.వై.ఆర్ చురకలు

“ఎక్కడ నుంచి పని చేయాలనేది నా ఇష్టం అని జగన్ చెబుతున్నారు. గతంలో కూడా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారుఇతర వ్యవస్థలు కుప్పకూలడానికి ఇలాంటి నిర్ణయాలు దారి తీస్తాయి”
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడి నుంచి పనిచేయాలన్నది తన ఇష్టం అని ఏపీ సీఎం చెబుతుండటం ఇది రెండో సారని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో ఇవే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇతర వ్యవస్థలు కుప్పకూలడానికి ఇలాంటి నిర్ణయాలు దారి తీస్తాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలోని అన్ని కీలక నిర్ణయాలను చీఫ్ సెక్రటరీ సహకారంతో కేబినెట్ తీసుకుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా సెక్రటేరియట్ కు వచ్చి, అక్కడ గడిపితేనే ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉంటుందని చెప్పారు. పాలన అనేది ముఖ్యమంత్రి వ్యక్తిగత విషయం కాదని ఆయన స్పష్టం చేశారు.

Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

లోకేష్‌ వర్సెస్‌ వల్లభనేని వంశీ

సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫేస్‌బుక్‌ వేదికగా పరస్పర విమర్శలు చేసుకున్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెల మాదిరిగా కొన్నారని.. సీఎం జగన్‌..గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్‌ను కూడా కొన్నారని.. జగన్‌, వల్లభనేని వంశీ ఫోటోలు పెట్టి పోస్ట్ చేసిన లోకేష్‌

దీనిపై స్పందించిన వల్లభనేని వంశీ..

వద్దంటే మంగళగిరి వెళ్లి చిత్తుగా ఓడిపోయారని, శాసనమండలి కూడా రద్దు కావడంతో లోకేష్‌కు పిచ్చి పట్టిందంటు వంశీ కామెంట్స్ చేశారు

గొర్రెలకే కాదు పిచ్చికుక్కలకు కూడా వైద్యం చేస్తానంటూ వంశీ పోస్ట్ చేశారు.

Categories
ANDHRA PRADESH CRIME

వివేకా హత్యకేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో కూతురు పిటిషన్

వైయస్ వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ, ఏపీ హోంశాఖలను ప్రతివాదులుగా చేర్చారు. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే కేసు విచారణ తుది దశకు చేరుకుందని… ఈ తరుణంలో సీబీఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

2019 మార్చి 14న తన నివాసంలోనే వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును సిట్ విచారిస్తోంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును విచారించింది. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు వైసీపీ, టీడీపీ నేతలను సిట్ అధికారులు విచారించారు.

Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం

మండలి రద్దుపై అసెంబ్లీలో ఓటింగ్

మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా 133, వ్యతిరేకంగా 0

మండలి రద్దుకు ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

సీఎం జగన్ కామెంట్స్:

ప్రజా ప్రయోజనాల కోసమే మండలి రద్దు: సీఎం జగన్

ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు ఆలస్యం అవ్వకూడదనే మండలి రద్దు: సీఎం జగన్

శాసనసభకె మండలి రద్దు అధికారం: సీఎం జగన్

మన శాసనసభలోనే మేధావులు ఉన్నారు: సీఎం జగన్

బిల్లులను ఎలా అడ్డుకోవాలో మండలిలో చూస్తున్నారు: సీఎం జగన్

మండలికి ఏడాదికి 60 కోట్లు ఖర్చవుతుంది: సీఎం జగన్

కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసనమండళ్ళు ఉన్నాయి: సీఎం జగన్

Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

మండలి రద్దు..3 రాజధానుల బిల్లు సంగతేంటి?

మండలి రద్దు: సెలెక్ట్ కమిటీ..బిల్లులు ఏమవుతాయి: రూల్స్ ఏం చెబుతున్నాయి..!

కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్నట్లుగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో శాసనమండలి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. శాసనసభ సైతం ఈ మేరకు తీర్మానం ఆమోదించనుంది. మండలిలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను తమ అభ్యంతరాలకు విలువ ఇవ్వకుండా..టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం సెలెక్ట్ కమిటీకి పంపారనేది వైసీపీ నేతల ఆగ్రహం. దీంతో..న్యాయ పరంగా సీఎం జగన్ నిపుణులతో చర్చలు చేసారు. అదే విధంగా మంత్రులు..పార్టీ ప్రముఖులతో చర్చించారు.

రాజకీయంగా వైసీపీకే నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. అనేక మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామనే హామీని ప్రస్తావించారు. అన్నీ తాను చూసుకుంటానని..టీడీపీ ఆధిపత్యం..వాళ్లు బిల్లులకు అడ్డుపడటం మాత్రం ఇక కొనసాగకూడదని జగన్ నిర్ణయించారు. ప్రభుత్వం మండలి రద్దు చేస్తూ తీసుకున్న తాజా నిర్ణయం తో మరి.. సెలెక్ట్ కమిటీ భవిష్యత్ ఏంటి.. ఆ బిల్లులు ఏమవుతాయి..నిబంధనలు ఏం చెబుతున్నాయి..

మండలిలో ఆ నిర్ణయం ఏమవుతుంది..

ప్రభుత్వం ప్రతిపాదించిన ఆ రెండు బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. దీనికి కౌంటర్ గా ప్రభుత్వం మండలినే రద్దు చేయాలని నిర్ణయించింది. గతంలోనూ మండలి ప్రభుత్వం శాసన సభలో ఆమోదించిన ఎస్సీ కమిషన్.. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల బిల్లులను సైతం మండలి సవరణల పేరుతో తిప్పి పంపింది. అప్పుడే ప్రభుత్వం మండలి కొనసాగించటం మంచిది కాదనే అభిప్రాయాని కి వచ్చింది. ఇక, ఇప్పుడు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను తిరస్కరించటం తో ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించింది. ఇప్పుడు మండలి రద్దు తీర్మానం ఆమోదంతో..ఇప్పుడు ఈ తీర్మానం కేంద్రానికి చేరుతుంది. పార్లమెంట్ లో ఆమోదం పొంది..రాష్ట్రపతి ఆమోద ముద్రకు వెళ్లనుంది. అక్కడ ఆమోదం పడగానే చట్టం అవుతుంది. అప్పటి వరకు శాసనమండలి సభ్యులు సాంకేతికంగా ఎమ్మెల్సీలుగా ఉంటారు మండలి సైతం యధావిధిగా కొనసాగుతుందని..సమావేశాలు సైతం ఉంటయాని నిపుణులు చెబుతున్నారు.

సెలెక్ట్ కమిటీ యధాతధం.

మండలిలో ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. కానీ, ఇంకా కమిటీ ఏర్పాటు చేయలేదు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం సభ్యుల పేర్లు ఇవ్వాలని మండలి చైర్మన్ రాసిన లేఖలు ఈ రోజు పార్టీలకు చేరనున్నాయి. మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుండి సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీకి మూడు నెలల నుండి సాద్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు మండలి రద్దు తీర్మానం ఆమోదించటంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందని..మూడు నెలల నుండి సాధ్యమైంత త్వరగా నివేదిక కమిటీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో మండలి సమావేశాలు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు యధాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో..బిల్లుల సైతం కమిటీ తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసి నివేదిక ఇవ్వటంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని యనమల సైతం స్పష్టం చేస్తున్నారు.

ప్రక్రియ పూర్తయ్యేది ఎప్పుడు..

శాసనసభ ఏపీ మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానం ఆమోదానికి దాదాపు ఆరు నెలల నుండి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఇక, శాసనసభలో మెజార్టీ ఉన్నప్పటికీ..మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినా.. తుది ఆమోదం వచ్చే వరకూ ఇప్పుడు అనుసరిస్తున్న ప్రక్రియనే కొనసాగించాల్సి ఉంటుంది. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సంయుక్త సమావేశాల నిర్వహణ…గవర్నర్ ప్రసంగం మామూలుగానే ఉంటుంది. దీంతో..ప్రభుత్వం తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదనే కారణం..అన్నింటీకీ అడ్డుపడుతున్నారనే ఆగ్రహంతో మండలి రద్దు చేసిందని..తుది నోటిఫికేషన్ వచ్చే వరకూ ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ తరువాత నుండి ఇక అధికార ..ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయనేది కీలకంగా మారుతోంది.

Categories
ANDHRA PRADESH FEATURED

విశాఖలో భూసమీకరణ – ప్రభుత్వ ఉత్తర్వులు

పేదలకు ఇళ్ల స్థలాల కోసం విశాఖపట్నంలో భూసమీకరణ చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలోని పది మండలాల్లో భూసమీకరణ ద్వారా 6116.50 ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీముని పట్నం, ఆనందపురం, పెదగంట్యాడ, విశాఖ గ్రామీణ, అనకాపల్లి మండలాల్లో లాండ్ పూలింగ్ చేపట్టనున్నారు. అభివృద్ది చేసిన భూమిని తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజిని కూడా ఫిక్స్ చేసింది.

ఈ భూసమీకరణలో భాగంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములనే సమీకరించనున్నారు. ఆ అసైన్డ్ భూములు ఎవరి వద్ద అయినా ఉంటే వారికి పరిహారం చెల్లిస్తారు. అసైన్డ్ భూమిని ఎకరం అప్పగిస్తే అందుకు 900 గజాలు డెవలప్‌చేసిన భూమిని తిరిగి ఇస్తారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించి పదేళ్లకు పైగా అక్కడ నివాసం ఉంటున్నటయితే వారికి ఎకరానికి 450 గజాల డెవలప్ చేసిన భూమిని అందిస్తారు. ఐదేళ్ల నుంచి పదేళ్లలోపులో ఉంటున్నవారయితే వారికి ఎకరానికి 250 గజాల డెవలప్ చేసిన భూమిని రిటర్న్ ఇస్తారు. ఐదేళ్ల కంటే తక్కువ ఉన్నవారయితే వారికి ఎలాంటి పరిహారం ఉండదు. ఈ భూసమీకరణలో భాగంగా డెవవలప్ చేసిన భూమిలో 15 శాతం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ వద్దే ఉంటుంది.

ఉగాది పర్వదినాన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అందుకు ప్రభుత్వ భూములను కేటాయించడంతో పాటు ఇతర ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు, వ్యక్తులకు పెద్ద ఎత్తున భూములను కేటాయించింది. ఆ భూముల్లో నిరూపయోగంగా ఉన్నవాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కసరత్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను తమ ఆధీనంలో ఉంచుకున్న వారి నుంచి కూడా భూములను స్వాధీనం చేసుకోనున్నారు.