Categories
ANDHRA PRADESH FEATURED NATIONAL

అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై!

వినియోగదారులకు ఊరట, అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై – కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అర్ధరాత్రి ఉత్తర్వులు

★ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

★ దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని తెలిపింది.

★ ఐతే… కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని కేంద్రం తెలిపింది.

★ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి మార్గదర్శనం చేసింది.

★ ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి… తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు.

★ అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు.

★ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు.

★ మరో ముఖ్య విషయమేంటంటే, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు.

★ ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది.

★ ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది.

★ ప్రజలు సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి.

★ లేకపోతే కరోనావైరస్ సామాజిక వ్యాప్తికి దోహదం అవుతుందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కో‌రుతున్నారు.

★ అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు.

★ ఐతే… రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే… ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు.

★ సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి.

★ అలాగే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి.

★ అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

Categories
FEATURED TELANGANA

మే7 వరకు లాక్ డౌన్, కఠిన నియమాలు – కేసీఆర్

తెలంగాణలో మే 7వరకు లాక్ డౌన్-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య -858
ఈ రోజు కొత్తగా నమోదైన కేసులు-18
కరోనా మరణాలు-21
కోలుకుని డిశ్చార్జ్ అయినవారు-186
చికిత్స పొందుతున్నవారు -651
…………….
నాలుగు జిల్లాల్లో కరోనా ప్రభావం లేదు..
వరంగల్ రూరల్,సిద్దిపేట,యాదాద్రి-భువనగిరి,వనపర్తి లలో కరోనా కేసులు నమోదు కాలేదు..
….
దేశంలో 8రోజులకు ఒకసారి కేసులు డబుల్ అవుతున్నాయి..
అదే తెలంగాణలో 10రోజులకు ఒకసారి కేసులు డబుల్ అవుతున్నాయి..

దేశంలో 10లక్షల మందిలో 275మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు..
తెలంగాణలో 10లక్షల మందిలో 375మందికి కరోనా పరీక్షలు చేస్తున్నం..
……
దేశంలో కేంద్రం కొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది.
తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఉండవు.
…..
వ్యవసాయ సంబంధిత ,మెడికల్ సంబంధిత వాటికి సడలింపులు ఇస్తున్నాము..
మిగతావాటికి ఎలాంటి సడలింపులు ఉండవు..
……
మే 1తారీఖు వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గొచ్చు..
ఈ రోజు 458మందిని పరీక్షిస్తే మొత్తం 18మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది..
జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద దెబ్బ తినే అవకాశం ఉంది..
……
విదేశాల నుండి వచ్చినవారంతా డిశ్చార్జ్ అయ్యారు..
ఢిల్లీ నుండి వచ్చినవాళ్ల వలనే కేసులు పెరిగాయి
4ఢిల్లీ కరోనా కేసుల కాంటాక్టులు తెలియాల్సి ఉంది
….
మే 7వరకు లాక్ డౌన్ అమలుల్లో ఉంటుంది.
లాక్ డౌన్ గురించి అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించాం
అత్యధిక శాతం మంది చాలా కఠినంగా ఉండాలని చెప్పారు
మీడియా సంస్థలు చేసిన సర్వేలో కూడా ఇదే వెల్లడి అయింది
అవసరమైతే మే నెలాఖరు వరకు పొడిగించమని చెప్పారు
గతంలో ఉన్న నియమాలే అన్ని ఉంటాయి
అత్యవసర వాటికి మినహాయింపు ఉంటుంది.
లాక్ డౌన్ నియమాలను కఠినంగా అమలు చేస్తాం
….. మే 29 వరకు కరోనా కష్టాలు తప్పవా?
తెలంగాణలో జోమాటా ,స్విగ్గీ సర్వీసులన్నీ రేపటి నుండి బంద్
ఈ రోజు ఆర్డర్ చేసుకున్నవారికి మినహయింపు
డెలివరీ చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఫుడ్ డోర్ డెలివరీ వల్ల ప్రమాదం ఉంటుంది
….
విమాన ప్రయాణికులు దయచేసి తెలంగాణకు రావొద్దు
మే 7వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది
క్యాబ్ సర్వీసులు ఏమి అందుబాటులో ఉండవు
….
పండుగలు,ప్రార్థనలు ఇండ్లల్లోనే జరుపుకోవాలి
అన్ని ఆలయాలు మూసివేశారు.
సామూహిక ప్రార్థనలు,మతపరమైన సమావేశాలకు అనుమతించబడవు
ఇప్పటికే చాలా ఆలయాల్లో దర్శనాలు ఆగాయి
……
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండటం మంచిది కాదు.మనకు గౌరవప్రదం ఉండకూడదు..
స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఈ సమస్య రాకుండా చూడాలి
……
మార్చి నెల వేతనమే ఏప్రిల్ నెలలో ఇస్తాం
వైద్య సిబ్బంది,పారిశుధ్య సిబ్బందికి పదిశాతం ప్రోత్సాహం ఈ నెల కూడా ఇస్తాం
పోలీసు సిబ్బందికి కూడా పది శాతం ప్రోత్సహం ఈ నెల నుండి ఇస్తాం
……
మూడు నెలలు అద్దె చెల్లింపులు వాయిదా
మార్చి,ఏప్రిల్,మే నెల అద్దెలు వసూలు చేయవద్దు
ఇది విజ్ఞప్తి కాదు…ప్రభుత్వం ఆదేశం
వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
వాయిదాలపై వడ్డీలు వసూలు చేయవద్దు
ఎవరైన బలవంతంగా వసూలు చేస్తే 100కి డయల్ చేయండి

ప్రయివేట్ విద్యాసంస్థలు 2020-21ఏడాదికి ఎలాంటి ఫీజులు పెంచకూడదు
ట్యూషన్ ఫీజుల కంటే ఎక్కువగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దు
నెలవారీగా ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి
మరో ఇతర ఫీజులు వసూలు చేయవద్దు
ఇతర ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు
వసూలు చేస్తే ప్రయివేట్ విద్యాసంస్థల అనుమతులు రద్దు చేస్తాం
…..
మే నెలలోనూ ఫ్రీ రేషన్
మే నెల మొదటివారంలోనే రేషన్
మే నెలలో కూడా ఒక్కొక్కరికి 12కేజీల బియ్యం
ఈ నెల మాదిరిగానే మే నెల కూడా 1500ఇస్తాం
……
వలస కార్మికుల కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 12కేజీల బియ్యం
మే నెలలో ఒక్కొక్క వలస కార్మిక కుటుంబానికి 1500ఇస్తాం
……
ఆసరా పెన్షన్లకు ఎలాంటి కోత లేదు..
40లక్షల మందికి ఆసరా పెన్షన్లు యధావిధిగా అందజేస్తాం
ప్రజాప్రతినిధులకు,ఉద్యోగులకు మాత్రం మార్చి మాదిరిగా కోత ఉంటుంది.
పెన్షనర్లకు మాత్రం 75%జీతం అందుతుంది
….మీడియాతో సీఎం కేసీఆర్

Categories
ADHYATMIKA SAKTHI

శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?

తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారంలో ఉంది.ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?

Categories
ENTERTAINMENT TECHNOLOGY

కేబుల్ / డిటిహెచ్ కనెక్షన్ విషయంలో మీకు ఈ అవగాహన ఉందా?

 • ఎమ్మెస్వో లేదా డిటిహెచ్/హిట్స్ ఆపరేటర్ ఒక వెబ్ సైట్ నడపాలి. తన సేవల సమాచారం అందులో పొందుపరచి చందాదారులో అవగాహన పెంచాలి.
 • నిబంధనలు పాటించే బాధ్యత స్వయంగా తీసుకుంటూ ఏదైనా ఏజెన్సీకి వెబ్ సైట్ బాధ్యత అప్పగించవచ్చు
 • వెబ్ సైట్ తెరవగానే హోమ్ పేజ్ లో స్పష్టంగా కనబడేలా Consumer Corner కి హైపర్ లింక్ కనబడాలి.
 • అందులో చానల్స్ వివరాలు, ఉచిత చానల్స్, పే చానల్స్, బొకేల వివరాలు, నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు, సెట్ టాప్ బాక్స్ ధర, అద్దె వివరాలు, గ్యారెంటీ/వారంటీ, కొత్త కనెక్షన్ తీసుకునే విధానం, ఫిర్యాదుల పరిష్కార విధానం, టోల్ ఫ్రీ నెంబర్, మాన్యువల్ ఆఫ్ ప్రాక్టీస్ తదితర వివరాలన్నీ ఉండాలి
 • ప్రతి ఎమ్మెస్వో లేదా డిటిహెచ్/హిట్స్ ఆపరేటర్ ఒక చానల్ ను ప్రత్యేకంగా వినియోగదారుల సమాచారం, అవగాహన కోసమే కేటాయించి నడుపుతూ ఉండాలి. దానికి అందరూ ఒకే రకంగా 999వ చానల్ కేటాయించాలి
 • చందాదారుల అవగాహనకు చేపట్టిన కార్యక్రమాలమీద ట్రాయ్ కి నివేదించాలి
 • చందాదారులకు తెలియాల్సిన సమాచారాన్ని టీవీ చానల్స్ తెరమీద ప్రసారం చేయకూడదు

ఇతర అంశాలు

 • ఎమ్మెస్వో లేదా డిటిహెచ్ ఆపరేటర్ ఆచరణకు సంబంధించిన విధివిధానాలతో మాన్యువల్ రూపొందించి వెబ్ సైట్ లో పెట్టాలి. దీన్నే హిందీ, ఇంగ్లీష్ తోబాటు ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా స్థానిక భాషలో ముద్రించాలి.
 • ఆ పంపిణీ వేదికలో అందుబాటులో ఉన్న చానల్ జాబితాను ధరలతో సహా ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ లో ఇవ్వాలి.
 • ఒక విభాగానికి చెందినవి, ఒక భాషకు చెందినవి ఒకేచోట ఉండాలి. ఒక చానల్ ఒకచోట మాత్రమే రావాలి
 • ఉచిత చానల్ అయితే ఫ్రీ అనేమాట ఆ చానల్ ఎదురుగా రాయాలి. పే చానల్ అయితే గరిష్ఠ చిల్లర ధర పేర్కొనాలి.
 • ఉచిత చానల్స్ 100 మించి కావాలనుకుంటే ప్రతి 25 చానల్స్ కూ రూ.20 వంతున అదనంగా చెల్లించాలి
 • ట్రాయ్ నిబంధనలన్నిటినీ పాటించేలా చూస్తూ ట్రాయ్ కి నివేదించటానికి ఒక అధికారిని నియమించుకోవాలి.
 • పంపిణీ సంస్థల ఉద్యోగులు, ప్రతినిధులు చందాదారుల ఇంటికి కచ్చితంగా ఫొటోగుర్తింపుకార్డు ధరించి వెళ్ళాలి.
 • చందాదారుల సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధంగా వాడకూడదు.
 • ఇంట్లో రెండు టీవీలు ఉంటే రెండు సెట్ టాప్ బాక్సులు కొనాల్సిందే. అయితే, ఇంటివరకూ వాడుతున్న నెట్ వర్క్ ఒకటే కాబట్టి పంపిణీదారుడు రాయితీ ఇవ్వదలచుకుంటే రెండో కనెక్షన్ కు వసూలుచేసే రూ.130 నెట్ వర్క్ కెపాసిటీ ఫీజులో మినహాయింపు/రాయితీ ఇవ్వవచ్చు.
 • సర్వీస్ ప్రొవైడర్ మారితే సెట్ టాప్ బాక్స్ పనికిరాదు. మళ్ళీ కొత్తది కొనాల్సిందే. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ఒకే రకంగా ఉండే అవకాశం లేకపోవటమే అందుకు కారణం. పరోక్షంగా బాక్స్ యజమాని పంపిణీదారుడే అవుతాడు.
 • ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం చందాదారుకు లేదు. సర్వీస్ ప్రొవైడర్ కే అది నిర్ణయించే స్వేచ్చ ఉంది.
 • పంపిణీ సంస్థలు స్వయంగా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. చందాదారులను ఆకట్టుకోవటానికి అలా ఇవ్వవచ్చు. డిటిహెచ్ సంస్థలు ఆపరేటర్లకు వాటా ఇచ్చే అవసరం లేదు కాబట్టి చందాదారుకు రాయితీ ఇవ్వవచ్చు.

డిజిటైజేషన్ వలన ధరలు పెరగటం అనేది ఒక పార్శ్వం మాత్రమే. అదే సమయంలో చందాదారుల ప్రయోజనాలు కాపాడటానికి, హక్కులు కల్పించటానికి, ఫిర్యాదుల పరిష్కారానికి ట్రాయ్ అనేక చర్యలు తీసుకోవటం రెండో పార్శ్వం. ట్రాయ్ కల్పించిన హక్కుల గురించి, సేవల పరంగా చందాదారు డిమాండ్ చేయదగిన అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే డిజిటైజేషన్ ఫలితం చందాదారునికి దక్కినట్టవుతుంది. అందుకే, పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు తమ చందాదారులకు అందించాల్సిన సేవల గురించి స్థూలంగా తెలియజెప్పటం దీని లక్ష్యం. దీని మీద ఏవైనా సూచనలున్నా, అనుమానాలున్నా bhavanarayana@yahoo.comఅనే ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

Categories
ANDHRA PRADESH FEATURED MOVIES POLITICS TELANGANA

ప్రభాస్ తో నాకు సంబంధం ఉంటే నిరూపించండి!

సినీ హీరో ప్రభాస్ తో తనకు సంబంధం అంటగడుతూ.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల ముందు నుంచి హీరో ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ తరహా ప్రచారం చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ఆమె సీపీని కోరారు.

పిల్లలపై ప్రమాణం చేసి చెప్తున్నా..నాకెవరితో సంబంధం లేదన్నారు వైఎస్ షర్మిల. మళ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రభాస్ తో వ్యవహారం అంటూ ప్రచారం ప్రారంభించారని..ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేకనే హైదరాబాద్ సీపీని ఆశ్రయించినట్లు ఆమె పేర్కొన్నారు. తనకు ప్రభాస్ కి మధ్య సంబంధం ఉందంటూ చేస్తున్న ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని షర్మిల ఆరోపించారు. స్త్రీలపై ఇంత శాడిజం, చులకన భావంతో రాస్తున్న వార్తల్ని ఖండించకపోతే..ఇదే నిజమని భావించే అవకాశం ఉన్నందున పోలీసుల్ని ఆశ్రయించినట్లు షర్మిల తెలిపారు.

వైఎస్ షర్మిల ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. పూర్తి వీడియో మీకోసం..

Categories
ENTERTAINMENT FEATURED TECHNOLOGY

కేబుల్/DTH రావడంలేదా? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి!

 • ఎమ్మెస్వో లేదా డిటిహెచ్ ఆపరేటర్ చందాదారులకు ప్రసార సేవలు అందించటానికి ముందే కస్టమర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
 • సేవలకు సంబంధించిన అభ్యర్థనలు, ఫిర్యాదులు తెలియజేయటానికి వీలుగా టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వాలి
 • వెబ్ సైట్ ను, వెబ్ సైట్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రచారం చెయ్యాలి. సొంత చానల్స్ లో స్క్రోల్ కూడా వెయ్యాలి. బిల్లులు, రసీదుల మీద కూడా నెంబర్ ముద్రించి ప్రాచుర్యం కల్పించాలి.
 • చందాదారుల ఫిర్యాదుల రద్దీకి తగినట్టుగా లైన్లు, సిబ్బంది ఉండేలా చూసుకోవాలి.
 • ప్రతిరోజూ కనీస ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటలవరకు అందుబాటులో ఉండాలి.
 • హిందీ, ఇంగ్లీషుతోబాటు ప్రాంతీయ భాషలో సేవలందించాలి
 • ఫిర్యాదుల నమోదుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవిఆర్ ఎస్) ఏర్పాటు చేయాలి. ముందుగా భాష ఎంచుకోమనాలి. తరువాత ఫిర్యాదు స్వభావం తెలుసుకోవాలి. అవసరాన్నిబట్టి కస్టమర్ కేర్ ఎగ్జిక్యుటివ్ కి ఇవ్వాలి.
 • సగటున ఒక నెలలో వచ్చిన 80% కాల్స్ కి 60 సెకెన్లలోపే ఎలక్ట్రానిక్ పద్ధతిలో జవాబివ్వాలి. 90% కాల్స్ కి 90 సెకెన్లలోపే ఎగ్జిక్యుటివ్ మాట్లాడాలి.
 • వెబ్ సైట్ లోనూ ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు జరగాలి.
 • పంపిణీదారుడు తన సొంత బాధ్యతమీద కస్టమర్ కేర్ సెంటర్ ను ఏదైనా ఏజెన్సీకి కూడా అప్పగించవచ్చు.
 • కస్టమర్ కేర్ ఫిర్యాదు అందుకున్న వెంటనే రిజిస్టర్ చేసుకొని డాకెట్ నెంబర్ కేటాయించాలి.
 • ఆ డాకెట్ నెంబర్ ని ఫిర్యాదు చేసిన చందాదారుకు చెప్పాలి.
 • పరిష్కారం కాగానే, తీసుకున్న చర్యల గురించి చందాదారుకు చెప్పాలి. ఒకవేళ చందాదారు సంతృప్తి చెందకపోతే నోడల్ అధికారి పేరు, నెంబర్ చెప్పి సంప్రదించాల్సిందిగా సూచించాలి.
 • ఫిర్యాదులన్నీ 8 గంటల్లో పరిష్కరించాలి. పనిగంటల తరువాత వచ్చిన ఫిర్యాదులు మరునాడు పరిష్కరించాలి.
 • ప్రసారాలకు సంబంధించిన ఫిర్యాదులలో కనీసం 90% అయినా 24 గంటల్లో పరిష్కరించాలి.
 • బిల్లింగ్ ఫిర్యాదులు వారంలోగా, రిఫండ్ చేయాల్సి ఉంటే 30 రోజుల్లోగా పూర్తిచెయ్యాలి.
 • ఇవేవీ కాని ఫిర్యాదులైతే 48 గంటల్లోపు పరిష్కారం కావాలి.
 • బిల్లింగ్ కి సంబంధించింది కాకపోతే ఏదీ 72 గంటలకు మించి అపరిష్కృతంగా ఉండకూడదు.
 • డిజిటైజేషన్ నిబంధనలు అమలులోకి వచ్చిన నెలలోగా పంపిణీ సంస్థలు రాష్ట్రానికి ఒకరు చొప్పున నోడల్ అధికారిని నియమించాలి.
 • నోడల్ అధికారి పేరు, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్, ఫాక్స్ నెంబర్ లాంటి సమాచారానికి ప్రచారం కల్పించాలి. వెబ్ సైట్ లో పెట్టాలి.
 • ఒకవేళ నోడల్ అధికారి మారితే ఆ వివరాలు చందాదారులకు, ట్రాయ్ కి 10 రోజుల్లోగా తెలియజేయాలి.
 • కస్టమర్ కేర్ నుంచి సంతృప్తికరమైన పరిష్కారం దొరక్కపోతే చందాదారుడు నోడల్ అధికారిని సంప్రదించవచ్చు.
 • ఫిర్యాదు అందుకున్న నోడల్ అధికారి దానికొక నెంబర్ ఇస్తూ రెండ్రోజుల్లో రసీదు ఇవ్వాలి. పదిరోజుల్లోగా ఏం చర్య తీసుకున్నదీ చెప్పాలి.
 • పంపిణీదారుడు (ఎమ్మెస్వో లేదా డిటిహెచ్ ఆపరేటర్) గాని, స్థానిక కేబుల్ ఆపరేటర్ గాని చందాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నట్టు ట్రాయ్ కి ఫిర్యాదులు అందితే వాటిమీద వేగంగా దర్యాప్తు జరపాలని పంపిణీదారుణ్ణి ట్రాయ్ ఆదేశించవచ్చు. 30 రోజుల్లోగా పరిష్కరించి ట్రాయ్ కి, చందాదారుకూ తెలియజేయాలి.
 • అన్ని ఫిర్యాదుల పూర్తి సమాచారం నమోదు చేసి పరిష్కారమైన తేదీనుంచి 3 నెలలు వాటి రికార్డులను నిల్వచేయాలి. ట్రాయ్ అడిగినప్పుడు చూపించాలి.


డిజిటైజేషన్ వలన ధరలు పెరగటం అనేది ఒక పార్శ్వం మాత్రమే. అదే సమయంలో చందాదారుల ప్రయోజనాలు కాపాడటానికి, హక్కులు కల్పించటానికి, ఫిర్యాదుల పరిష్కారానికి ట్రాయ్ అనేక చర్యలు తీసుకోవటం రెండో పార్శ్వం. ట్రాయ్ కల్పించిన హక్కుల గురించి, సేవల పరంగా చందాదారు డిమాండ్ చేయదగిన అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే డిజిటైజేషన్ ఫలితం చందాదారునికి దక్కినట్టవుతుంది. అందుకే, పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు తమ చందాదారులకు అందించాల్సిన సేవల గురించి స్థూలంగా తెలియజెప్పటం దీని లక్ష్యం. దీని మీద ఏవైనా సూచనలున్నా, అనుమానాలున్నా bhavanarayana@yahoo.com అనే ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

Categories
FEATURED TECHNOLOGY

ఏది ఫ్రీ చానల్? టీవీ చానల్ ఎంపిక ఎలా?

 • నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద రూ. 130 అందరూ కట్టాల్సిందే. అందులో భాగంగా వచ్చే 100 ఉచిత చానల్స్ తీసుకోకపోయినా సరే.
 • పే చానల్స్ తీసుకోకపోయినా ఇది తప్పదు. పే చానల్స్ తీసుకుంటే బిల్లు అదనం.
 • ఉచిత చానల్స్ లో అందుబాటులో ఉన్న హెచ్ డి చానల్ ఒకటి తీసుకుంటే అది రెండు ఎస్ డి చానల్స్ కు సమానం. అంటే, నాలుగు హెచ్ డి చానల్స్ తీసుకుంటే వందలో ఇంకా ఎంచుకునే అవకాశమున్నవి 92 (100 – 4×2) మాత్రమే.

మీదగ్గర సెట్ టాప్ బాక్స్ ఉందా? అయితే ఈ ముఖ్యమైన సమాచారం తెలుసా?http://www.vijethatv.in/featured/information-that-you-should-know-about-settop-boxes/

 • ఈ వందలోనే పంపిణీదారుడు తప్పనిసరిగా ఇవ్వాల్సిన 26 దూరదర్శన్ చానల్స్ కలిసి ఉంటాయి. తెలుగు ఉచిత చానల్స్ లో 20 కి పైగా న్యూస్ చానల్స్, ఐదు ఎంటర్టైన్మెంట్ చానల్స్ , పదికి పైగా ఆధ్యాత్మిక చానల్స్ ఉన్నాయి కాబట్టి సహజంగానే వాటన్నిటినీ కోరుకుంటారు.
 • ఉచిత చానల్స్ ఎంచుకునే హక్కు చందాదారుడిదే తప్ప పంపిణీదారుడిది కాదు. అందువలన సగటున కనీసం 150 చానల్స్ ఇచ్చి అందులో ఎంచుకోమని అడుగుతారు. హిట్స్ ఆపరేటర్ ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఇవ్వగలుగుతున్నారు.
 • పే చానల్స్ ను బొకే గా లేదా విడివిడిగా (అ లా కార్టే పద్ధతిలో) ఎంచుకోవచ్చు.
 • పంపిణీదారుడు సొంత చానల్స్ కూడా ప్రసారం చేసుకోవచ్చు.
 • ఎంచుకోవటం పూర్తయితే బిల్లు, జీఎస్టీ కలిసి మొత్తం బిల్లు లెక్కగట్టుకోవచ్చు.
 • సులభంగా లెక్కతేల్చుకోవటానికి ఒక యాప్ కూడా సిద్ధమైంది.

https://play.google.com/store/apps/details?id=trai.mrp&hl=en

చానల్స్ జాబితా మొత్తం చూడటానికి, ధరలు తెలుసుకోవటానికి, ఎంచుకొని ధర సరిచూసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చందాదారులతోబాటు వాళ్ళదగ్గరికి వెళ్ళే ఆపరేటర్ కూ బాగా ఉపయోగపడుతుంది.

డిజిటైజేషన్ వలన ధరలు పెరగటం అనేది ఒక పార్శ్వం మాత్రమే. అదే సమయంలో చందాదారుల ప్రయోజనాలు కాపాడటానికి, హక్కులు కల్పించటానికి, ఫిర్యాదుల పరిష్కారానికి ట్రాయ్ అనేక చర్యలు తీసుకోవటం రెండో పార్శ్వం. ట్రాయ్ కల్పించిన హక్కుల గురించి, సేవల పరంగా చందాదారు డిమాండ్ చేయదగిన అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే డిజిటైజేషన్ ఫలితం చందాదారునికి దక్కినట్టవుతుంది. అందుకే, పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు తమ చందాదారులకు అందించాల్సిన సేవల గురించి స్థూలంగా తెలియజెప్పటం దీని లక్ష్యం. దీని మీద ఏవైనా సూచనలున్నా, అనుమానాలున్నా bhavanarayana@yahoo.comఅనే ఈ- మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

Categories
LIVE TV

VIJETHA TV LIVE

[yotuwp type=”channel” id=”UCydxFV9n2dKG9RfFbdq9rjQ” ]