Categories
ANDHRA PRADESH FEATURED NATIONAL

అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై!

వినియోగదారులకు ఊరట, అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై – కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అర్ధరాత్రి ఉత్తర్వులు

★ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

★ దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని తెలిపింది.

★ ఐతే… కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని కేంద్రం తెలిపింది.

★ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి మార్గదర్శనం చేసింది.

★ ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి… తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు.

★ అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు.

★ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు.

★ మరో ముఖ్య విషయమేంటంటే, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు.

★ ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది.

★ ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది.

★ ప్రజలు సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి.

★ లేకపోతే కరోనావైరస్ సామాజిక వ్యాప్తికి దోహదం అవుతుందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కో‌రుతున్నారు.

★ అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు.

★ ఐతే… రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే… ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు.

★ సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి.

★ అలాగే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి.

★ అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

Categories
ANDHRA PRADESH FEATURED NATIONAL TELANGANA

సంచలన నిర్ణయం : అగ్రవర్ణ పేదలకు మోదీ కానుక !

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మోడీ సర్కారు నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి 10శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తారని తెలుస్తోంది. దీంతో మొత్తం రిజర్వేషన్ల శాతం 60కి చేరుకుంటుంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును రేపు కేంద్రం పార్లమెంట్ ముందు ప్రవేశపెడుతుంది. నిజానికి ఈ డిమాండ్ ఇప్పటిది కాదు..కాని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీ సర్కారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు తీసుకువచ్చే తరుణంలో మరో వారం రోజులపాటు పార్లమెంట్ సమావేశాలు పొడిగించే అవకాశం ఉంది.

Categories
ANDHRA PRADESH ENTERTAINMENT FEATURED NATIONAL POLITICS TELANGANA VIDEOS

యంగ్ న్యూస్ టెలివిజన్ విజేత టీవీకి సబ్ స్క్రైబ్ అవ్వండి!

అధునాతన సాంకేతిక ప్రపంచంలో విజేత టీవీ ఓ సంచలనం
. తొలి మొబైల్ జనరేషన్ టెలివిజన్ గా ఇప్పటికే పేరుగాంచిన విజేత టీవీ ఎప్పుడూ సామాన్యుడి పక్షమే అని సగర్వంగా ప్రకటిస్తోంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్న అంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అరచేతిలో అన్ని వార్తాంశాలు..అడుగడుగునా సామాన్యుడి గొంతుక..వెరసి విజేత టీవీ. వార్తని ఓ సామాజిక బాధ్యతగా తీసుకొని కొత్త తరానికి దిక్సూచిగా మారనుంది విజేత టీవీ. యువతరానికి ఓ నవనిర్మాణ దీపిక. అన్యాయం, వివక్షతో అన్నింటా నష్టపోతున్న బలహీన ప్రజానీకానికి బలమైన వేదిక నిర్మిస్తోంది విజేత టీవీ.

► VIJETHA TV

A Next Gen News TV delivers accurate and young news without colors and drama from every corner of the Globe. As Breaking News is meant for sensation, VIJETHA TV breaks the silence and stands for the broken hearts.

No Manipulation..No Manufacturing Consent
No Hidden Agendas..No Conspiracy theories
Simply News at fingertips

For More Updates
► VIJETHA WEB : http://vijethatv.in
► FACEBOOK : https://www.facebook.com/vijethanews/
► YOUTUBE : https://www.youtube.com/channel/UCydxFV9n2dKG9RfFbdq9rjQ
► TWITTER : https://twitter.com/vijethanews
► PINTEREST : https://in.pinterest.com/vijethanews/
► INSTAGRAM : https://www.instagram.com/vijethanews/

Categories
FEATURED NATIONAL

ప్రమాదంలో ప్రధాన మీడియా – ఆర్కే!

ప్రస్తుత మీడియా పరిస్థితులపై ఆంధ్రజ్యోతి ఎం.డి. రాధాకృష్ణ వేమూరి కొత్తపలుకు కాలమ్ లో చక్కటి విశ్లేషణ అందించారు.. కాలమ్ లో మిగిలిన రాజకీయ అంశాలు ఉన్నప్పటికీ మీడియాపై రాసిన భాగం ఉన్నది ఉన్నట్లుగా మీకోసం..

మారిన ఈ పరిస్థితుల్లో మీడియా కూడా విశ్వసనీయత కోల్పోతున్న వ్యవస్థల జాబితాలో చేరిపోతోంది. అధికారంలో ఉన్నవారిని ఎదిరించి బతికి బట్టకట్టలేని దుస్థితి ఉండటం వల్ల ప్రింట్‌ మీడియా గానీ, ఎలక్ట్రానిక్‌ మీడియా గానీ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నాయి. దేశంలోనరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాకు ఉన్న స్వేచ్ఛ ఏపాటిదో తేలిపోయింది. ఏ ఒక్క మీడియా సంస్థ కూడా కేంద్ర పెద్దలను ఎదిరించి నిలబడలేని పరిస్థితి! జాతీయ మీడియాను అదుపులోకి తెచ్చుకున్న పాలక పెద్దలు ప్రాంతీయ మీడియాపై కూడా దృష్టిసారించారు. దీంతో ఒకటీ అరా మీడియా సంస్థలు మినహా మిగతావన్నీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాయి. మీడియా ఈ దుస్థితికి చేరుకోవడానికి నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడం ప్రధాన కారణం. ప్రభుత్వాల సహకారం లేనిదే మనుగడ సాగించడం దుర్లభం కావడంతో మీడియా సంస్థలు రాజీ ధోరణిని అలవరచుకుంటున్నాయి. దీనికితోడు రాజకీయ, స్వీయ ప్రయోజనాలు ఉన్నవారు మీడియాలోకి జొరబడటంతో స్వతంత్రంగా పనిచేస్తూ వచ్చిన మీడియా సంస్థలు ఆటుపోట్లను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ పరిణామాలతో ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలు వెలుగుచూడటం లేదు.

విజేత టీవీ..అరచేతిలో వార్తా ప్రపంచంమరిన్ని తాజా వార్తల కోసం.. విజేత టీవీకి సబ్ స్క్రైబ్ అవ్వండి  https://www.youtube.com/channel/UCydxFV9n2dKG9RfFbdq9rjQ

 ఉదాహరణకు రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణాన్ని తీసుకుందాం. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎంత గొంతు చించుకున్నా ఈ అంశాన్ని హైలైట్‌ చేయడానికి జాతీయ మీడియా ఆసక్తి చూపలేదు. ప్రాంతీయ మీడియాలోనూ, వెబ్‌సైట్లలోనూ ఈ వ్యవహారానికి సంబంధించి విస్తృతంగా కథనాలు వచ్చిన తర్వాత జాతీయ మీడియా ఇప్పుడిప్పుడే కొంచెం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ లేదా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు భయపడటం వల్లనే ఇలా జరుగుతోందా? అంటే అవుననే చెప్పాలి. భారతీయ వార్తాపత్రికలన్నింటికీ ప్రాతినిధ్యంవహించే సంస్థను ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ అంటారు. ఈ సంస్థ పాలకమండలి సభ్యులు గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిని కలుసుకుని వార్తాపత్రికల సమస్యలను వివరిస్తుండేవారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ సంస్థ పాలకమండలికి ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. మీడియా సంస్థల హూంకరింపుల వెనుక ఎంతటి బేలతనం ఉందో నరేంద్ర మోదీకి తెలుసు కనుకే ఆయన ఐఎన్‌ఎస్‌ పాలకమండలిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థల మాదిరిగానే మీడియా సంస్థలు కూడా బెదిరిస్తే బెదిరిపోతారని మోదీ– షా ద్వయం గుర్తించి అమలుచేస్తోంది. అయితే ప్రతిదానికీ ఒక విరుగుడు ఉంటుంది. ప్రధాన మీడియా సంస్థలు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగిపోయి నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోతున్నాయి కనుక వెబ్‌సైట్లు పురుడుపోసుకుంటున్నాయి. పరిశోధనాత్మక కథనాలు కావాలంటే వెబ్‌సైట్లను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ వెబ్‌సైట్లకు ఆదరణ కూడా పెరుగుతోంది.

 రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోళ్ల వ్యవహారం నుంచి ప్రధానమైన వ్యవహారాలన్నీ వెబ్‌సైట్ల ద్వారానే ముందుగా వెలుగుచూస్తున్నాయి. గతంలో జాతీయ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా ప్రాంతీయ మీడియా కథనాలు ప్రచురించేది. ఇప్పుడు జాతీయ మీడియా ప్రేక్షక పాత్ర పోషిస్తూ మౌనంగా ఉండిపోవడంతో వెబ్‌సైట్ల ఆధారంగా స్వతంత్రంగా పనిచేయాలనుకుంటున్న ప్రాంతీయ మీడియా సంస్థలు కొన్ని కథనాలు రూపొందించుకుంటున్నాయి. జాతీయ స్థాయి తరహాలోనే ఇప్పుడు తెలంగాణలో కూడా మీడియా సంస్థలు బిక్కుబిక్కుమంటూ పనిచేయవలసిన పరిస్థితి. ప్రభుత్వంలోని తప్పొప్పులను ఎత్తిచూపితే పాలకుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయం మీడియా సంస్థలను వెంటాడుతోంది

 జాతీయ మీడియా తరహాలోనే తెలంగాణలో కూడా దాదాపు అన్ని మీడియా సంస్థలూ తలవంచుకునే పనిచేస్తున్నాయి. ‘అధికారంలో ఉన్నవారితో గొడవెందుకు?’ అన్న రాజీ ధోరణిని అలవరుచుకున్నాయి. ప్రతిపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో మీడియా ఉంది. మీడియాను కట్టడిచేయడం వల్ల అధికారంలో ఉన్నవారు శాశ్వతంగా అధికారంలోనే కొనసాగుతారా? అంటే గ్యారెంటీ లేదు. మీడియాలో వ్యతిరేక వార్తలు రాకపోవడం వల్ల అంతా సవ్యంగానే ఉందన్న భ్రమల్లో పాలకులు బతికేస్తున్నారు. ప్రధాన మీడియా రాజీ ధోరణికి అలవాటుపడటం వల్ల సోషల్‌ మీడియా విజృంభిస్తోంది. ఫలితంగా ప్రధాన మీడియాకు విశ్వసనీయత సన్నగిల్లి వెబ్‌సైట్లకు, సోషల్‌ మీడియాకు ఆదరణ పెరగడంతో పాటు విశ్వసనీయత పెరుగుతోంది.

 ప్రగతి నివేదన సభ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంగరకలాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభ విఫలమైనప్పటికీ ప్రధాన మీడియా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో సోషల్‌ మీడియా విజృంభించింది. ప్రధాన పత్రికలు, చానళ్లలో ఈ వార్త రాకపోయినా ఇవ్వాళ తెలంగాణ ప్రజలందరికీ ఏమి జరిగిందో తెలిసిపోయింది. లోపాలను కప్పిపుచ్చుకోవాలనుకోవడం రోగాన్ని దాచిపెట్టుకోవడమే అవుతుంది. వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోకపోతే వచ్చిన రోగం మనల్ని ఎలా కమ్మేస్తుందో, ప్రభుత్వాలు కూడా లోపాలను తెలుసుకోకుండా అంతా పచ్చగానే ఉందనుకుంటే ఏదో ఒకరోజు భంగపాటుకు గురికాక తప్పదు. ప్రధాన మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా కథనాలు, విశ్లేషణలు వెలువరించవలసిన సోషల్‌ మీడియా ఇవ్వాళ ప్రధాన మీడియాకు మార్గదర్శకం కావడం ఒక విషాదకర సందర్భం.

 సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలను ప్రధాన మీడియా అనుసరించవలసిన దుస్థితి! కేంద్రంలోని పెద్దలు గత నాలుగున్నరేళ్లుగా మీడియాను ఎంతగా అదుపాజ్ఞలలో ఉంచుకున్నా ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత ఏర్పడకుండా నిలువరించలేకపోతున్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీకి పాపులారిటీ రోజురోజుకీ క్షీణించడం వాస్తవమే కదా! మీడియాను అణచిపెట్టినా తమపై వ్యతిరేకత ఏర్పడకుండా ఆపలేకపోతున్నారంటే అందుకు ప్రత్యామ్నాయ మీడియాగా జనం ముందుకు వచ్చిన వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియానే కారణం. సెమీఫైనల్స్‌గా భావిస్తున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో భారతీయ జనతా పార్టీ ఎదురీదుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మాయాజాలం అక్కడ పనిచేయడం లేదు. మిడతల దండులా వాలిపోయే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ప్రజల మనసు మార్చలేకపోతున్నారు. ఇవ్వాళ దేశంలో కాయ కష్టం చేసే వారివద్ద కూడా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

 సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు, వ్యాఖ్యానాలు వారికి నిముషాల్లో చేరిపోతున్నాయి. ఈ కారణంగా ప్రధాన మీడియా దాచిపెట్టినా ఏదీ దాగడం లేదు. తెలంగాణలో కూడా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి వాతావరణం అనుకున్నంత అనుకూలంగా లేదంటే అందుకు సోషల్‌ మీడియానే కారణం. ప్రధాన మీడియా ఇస్తున్న సహకారం, ప్రచురించే, ప్రసారం చేసే కథనాలే ప్రాతిపదికగా ఉండి ఉంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎదురుండకూడదు. వంద సీట్లు ఏమి ఖర్మ.. అన్ని సీట్లూ దక్కాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని వార్తలు వస్తున్నాయంటే పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రధాన మీడియా వంత పాడుతోంది కదా అని భరోసాతో ఉండిపోతే ఎప్పుడో ఒకప్పుడు కొంప మునుగుతుంది. ఇవ్వాళ తెలంగాణలో సాధారణ ప్రజలలో ప్రధాన మీడియా పట్ల చులకనభావం ఉంది. అధికార పార్టీ పల్లకీ మోస్తున్నారన్న అభిప్రాయం ఉంది.

 అయినా పల్లకీ ఎక్కినవాడికి గానీ, మోస్తున్నవాడికి గానీ ప్రయోజనం కలగని పరిస్థితి. మీడియాను లొంగదీసుకున్నా ప్రజల్లో సానుకూలతను పెంచుకోలేని స్థితిలో పాలకులు ఉంటున్నారు. పాలకులకు భయపడి అణకువగా ఉండటం వల్ల ప్రధాన మీడియా తన విశ్వసనీయతను కోల్పోవలసిన దుస్థితి మరోవైపు ఏర్పడుతోంది. అంటే ప్రస్తుత పరిణామాల వల్ల ఉభయపక్షాలకూ నష్టం జరుగుతోంది. మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇష్టంతో చేయడం వేరు– భయంతో చేయడం వేరు. భయపెట్టడం వల్ల తాత్కాలిక ప్రయోజనం పొందవచ్చునేమో గానీ శాశ్వత ప్రయోజనం దక్కదు. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా ఎదురుతిరుగుతుంది. ఆత్మరక్షణ కోసం పిల్లి పులి అవుతుంది. ఇప్పుడు మీడియా కూడా తన మనుగడ, విశ్వసనీయత కోసం స్వతంత్రంగా పనిచేయవలసిన అవసరం ఏర్పడుతోంది. లేని పక్షంలో సోషల్‌ మీడియా ధాటికి ప్రధాన మీడియా కుప్పకూలే రోజులు ఎంతో దూరంలో లేవు

 వేమూరి రాధాకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రజ్యోతి

Courtesy : Andhra Jyothy, Source : Kothapaluku by Vemuri Radhakrishna