Categories
ANDHRA PRADESH FEATURED

ఏప్రిల్ 14 వరకు కోర్టులు క్లోజ్ !

అమరావతి, విజేత టీవీ : కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని కోర్టుల కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు నిర్ణయించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్‌ కోర్టు ఇటీవల కరోనా వ్యాప్తి నియంత్రణపై కూలంకషంగా చర్చించి ఈ నెల 31వ తేదీ వరకూ హైకోర్టుతోపాటు దిగువ న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లు, న్యాయసేవాధికార సంస్థ తదితరాల కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.   

అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ ఈ సెలవులను పొడిగిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ నోటిఫికేషన్‌ వెలువరించారు.

ఆయన ఈ నెల 24వ తేదీన జారీ చేసిన ప్రకటనను సవరిస్తూ గురువారం మరో నోటిఫికేషన్‌ ప్రకటించారు.

చీఫ్‌ జస్టిస్‌ అనుమతి మేరకు అత్యవసర కేసులపై మాత్రం విచారణ జరుపుతారు.

కాగా అత్యంత అవసరం ఉన్న కేసుల  విచారణ జరిపేందుకు ఇటీవల ప్రకటించిన తేదీలను కూడా రద్దు చేశారు. 

Categories
ANDHRA PRADESH FEATURED

జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ!

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సచివాయంలో ఉన్న రాష్ట్ర విజిలెన్స్‌ కార్యాయాన్ని కర్నూలు తరలించాన్న ప్రభుత్వ ఉత్తర్వుల‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులు చెల్ల‌వ‌ని తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘జగన్‌’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు రాజధానుల‌ను ఏర్పాటు చేస్తున్నామని, అధికారాన్ని వికేంద్రీకృత చేస్తున్నామని, రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని తెలిపింది. అమరావతిలో ‘శాసనరాజధాని, ‘కర్నూలు’లో న్యాయరాజధాని, విశాఖపట్నంలో ‘కార్యనిర్వహకరాజధాని’ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానాన్ని ఆమోదించారు. తరువాత దీన్ని శాసనమండలి అడ్డుకుంది. మూడు రాజధానులు, వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి అడ్డుకుంటూ దాన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపింది. అయితే అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని శాసనమండలి అడ్డుకున్నదని భావిస్తూ శాసనమండలి అవసరం లేదని దాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇది ఇలా ఉంటే మూడు రాజధానుల‌ వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర విజిలెన్స్‌ కమీషన్‌, కమీషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాయాల‌ను కర్నూలుకు తరలించాని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై హైకోర్టులో వివిధ వర్గాలు కేసు వేశాయి. దీనిపై విచారణ జరగగా, ప్రభుత్వం సమాధానం ఇస్తూ…రాష్ట్ర సచివాయంలో విజిలెన్స్‌ కమీషన్‌, కమీషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ కార్యాయాల‌కు వసతి లేదని, అందుకే పాల‌నాపరమైన కారణాల‌తో వీటిని కర్నూలుకు తరలిస్తున్నామని హైకోర్టులో ప్రభుత్వం చెప్పింది. అయితే దీనిపై హైకోర్టు స్పందిస్తూ సచివాల‌యంలో వసతి లేకపోతే దాని పక్కనో..లేక గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలి కానీ, కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించి కేసును వాయిదా వేసింది. ఈ రోజు కేసు విచారణలో భాగంగా విజిలెన్స్‌, కమీషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాయాను కర్నూలుకు తరలిస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేసింది.

Categories
ANDHRA PRADESH CRIME

వివేకా హత్యకేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో కూతురు పిటిషన్

వైయస్ వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ, ఏపీ హోంశాఖలను ప్రతివాదులుగా చేర్చారు. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే కేసు విచారణ తుది దశకు చేరుకుందని… ఈ తరుణంలో సీబీఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

2019 మార్చి 14న తన నివాసంలోనే వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును సిట్ విచారిస్తోంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును విచారించింది. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు వైసీపీ, టీడీపీ నేతలను సిట్ అధికారులు విచారించారు.

Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి.. హైకోర్టుకు జగన్​

అక్రమాస్తుల కేసుల వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ముఖ్యమంత్రి జగన్​ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు.

తనకు మినహాయింపు ఇచ్చేందుకు సీబీఐ కోర్టు నిరాకరించడాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్​ చేశారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్న జగన్​.. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని హాజరు మినహాయింపు నిరాకరించడం సరికాదని పిటిషన్​లో పేర్కొన్నారు.

Categories
ANDHRA PRADESH FEATURED

మహనీయుల త్యాగాల ఫలితమే ఈ రోజు : జె.కె. మహేశ్వరి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి


నేలపాడు, 26 జనవరి: భారతదేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి పిలుపునిచ్చారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ముందు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ జి.కె.మహేశ్వరి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 7 దశాబ్ధాలు గడిచాయన్నారు. 71వ గణతంత్ర దినోత్సవంగా నేడు మనం జరుపుకుంటున్న పండగ వెనక ఎందరో మహనీయుల త్యాగాలున్నాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి మూల గ్రంథం లాంటిది మన రాజ్యాంగమని అది అమల్లోకి వచ్చిన రోజు నేడు అని తెలిపారు. భారత ప్రజలు, మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సిద్ధించిందని, ఫలితంగా అందివచ్చినదే సర్వోత్కృష్టమైన భారత రాజ్యాంగమని దానిని గుర్తుచేసుకుంటే నిర్వహించుకునే పండగే గణతంత్ర దినోత్సవమని పేర్కొన్నారు. భారత దేశానికి సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పలువురు కృషి చేశారని కొనియాడారు.

కార్యక్రమంలో ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వైవీ రవిప్రసాద్, ఉపాధ్యక్షులు పోపూరి ఆనంద్ శేషు, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఘంటారామారావు, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తదితరులు ప్రసంగించారు.

చీఫ్ జస్టిస్ టార్చ్ బేరర్ లాంటి వారని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వైవీ రవిప్రసాద్ కొనియాడారు. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. లోక్‌ అదాలత్‌లో 900 కేసులు సత్వరమే పరిష్కారమయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని సూచించారు.

అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం ఆనందంగా జరుపుకోవాల్సిన రోజని తెలిపారు. ఆనాటి మేధావుల కృషి ఫలితంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం, గొప్ప నిర్ణయాల వల్లే స్వాతంత్ర్యం సిద్ధించిందన్న విషయం గుర్తుచేశారు.

కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, బార్ కౌన్సిల్ ఛైర్మన్, సభ్యులు, అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ సొలిసిటర్ జనరల్, అడ్వకేట్ అసోసియేషన్స్, గవర్నమెంట్ ప్లీడర్లు, కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, హైకోర్టు స్టాఫ్ తో పాటు న్యాయమూర్తుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.

….