Categories
ANDHRA PRADESH FEATURED NATIONAL

అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై!

వినియోగదారులకు ఊరట, అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై – కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అర్ధరాత్రి ఉత్తర్వులు

★ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

★ దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని తెలిపింది.

★ ఐతే… కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని కేంద్రం తెలిపింది.

★ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి మార్గదర్శనం చేసింది.

★ ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి… తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు.

★ అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు.

★ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు.

★ మరో ముఖ్య విషయమేంటంటే, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు.

★ ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది.

★ ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది.

★ ప్రజలు సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి.

★ లేకపోతే కరోనావైరస్ సామాజిక వ్యాప్తికి దోహదం అవుతుందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కో‌రుతున్నారు.

★ అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు.

★ ఐతే… రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే… ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు.

★ సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి.

★ అలాగే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి.

★ అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

Categories
ANDHRA PRADESH FEATURED LOCAL

మీరు ఈ ఏరియాలో ఉన్నారా? అయితే జాగ్రత్త.

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వివరిస్తూ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం, గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్, బుచ్చయ్య నగర్, జిల్లా పరిధిలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన, కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

కరోనా అంతం ఎప్పుడు? క్లిక్ చేయండి.

వీటితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లా వడమాలపేట, శ్రీకాళహస్తి, ఈ ప్రాంతాలతో పాటు మద్దూరు పరిధిలోని పాణ్యం గ్రామం, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం, నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట, చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం, అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు వచ్చాయని, ఇక్కడి వారంతా తగు జాగ్రత్తల్లో ఉండాలని సూచించింది.

Categories
FEATURED NATIONAL WORLD

WHO : స్వైన్‌ ఫ్లూ కంటే పదిరెట్లు ప్రమాదకారి!


డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ స్వైన్‌ ఫ్లూ కంటే పది రెట్లు ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కరోనా వైరస్ ఎంతో ప్రమాదకారి అని, వేగంగా వ్యాప్తి చెందుతుందని మనందరికీ తెలుసు. అయితే, ఇది స్వైన్‌ ఫ్లూ కంటే పదిరెట్లు వేగంగా వ్యాపిస్తుందని, జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ వైరస్‌ సోకిన వారిని నిర్భందంలో ఉంచడం ఎంతో ముఖ్యమని సూచించింది. వైరస్‌ బాధితులకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించడం సవాలుతో కూడుకున్న పని అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్ అధానోమ్‌ తెలిపారు.

https://youtu.be/tEWiO6fzK44

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించాలని ప్రపంచ దేశాలను యునైటెడ్ నేషన్స్‌ ఆరోగ్య సంస్థ కోరిన నేపథ్యంలో తాజాగా డబ్ల్యూహెచ్‌వో చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది. ‘‘మనకు ఏం తెలుసో అది మాత్రమే చెప్తాం. మనకు తెలిసిన దాని గురించే పని చేయగలం. వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది, దాని తీవ్రత ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కొవాలనే అనేదానికి ఇప్పటికే పలు దేశాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. అలానే కొన్ని దేశాల్లో ప్రతి మూడు నాలుగు రోజులకు కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. అయితే, వైరస్‌ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంత నెమ్మదిగా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.’’ అని టెడ్రస్ అన్నారు.

Categories
FEATURED

హై అలర్ట్ : విశాఖలో కరోనా పాజిటివ్ కేస్

నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో తొలి పాజిటివ్ కేసు బయటపడడంతో ఏపీ వైద్యశాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్దుడికి వైరస్ సోకిందని తేలడంతో సిబ్బంది ఆయన నివాసం ఉన్న ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మక్కా వెళ్లిన ఈ వృద్ధుడు వారం క్రితమే తిరిగి వచ్చాడు. మూడు రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో ఛాతి ఆసుపత్రిలో చేరాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా అటువంటి లక్షణాలతోనే రావడంతో వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కి పంపించారు.
నిన్న అక్కడి నుంచి నివేదిక రాగా వృద్దుడికి పాజిటివ్ అని తేలింది. దీంతో వృద్ధుడిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించడంతోపాటు అతను నివాసం ఉన్నప్రాంతంలో వైద్యబృందాలు సర్వే చేస్తున్నాయి. ఈ వృద్ధుడు ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లాడు తదితర అంశాలపై ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వృద్దుడి నివాసిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఆశవర్కర్లు, వలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మొత్తం 7,800 ఇళ్లను జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. స్పేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.

Categories
FEATURED NATIONAL

అలర్ట్ : ఇండియాలో తొలి కరోనా మరణం

ఇండియాలో తొలి కరోనా మరణం నమోదు.

కర్ణాటక లో కలబుర్గిలో 76 సంవత్సరాలు వృద్ధుడు మృతి

నిర్దారించిన కర్ణాటక వైద్యశాఖ

Categories
ANDHRA PRADESH

కరోనాపై అస్సలు ఆందోళన అక్కర్లేదు!

• కరోనా వైరస్ పై కలవర పడొద్దు

• 24 గంటలూ అందుబాటులో రాష్ట్ర స్థాయి కంట్రోల్ సెంటర్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, ఎటువంటి కలవరం చెందాల్సిన అవసరం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విదేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై గట్టి నిఘాతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ సెంటర్ ను ఇప్పటికే ఏర్పాటు చేశామని, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 50 మంది ప్రయాణికులు పరిశీలనలో ఉన్నారని, వీరిలో 49 మంది ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఒకరిని ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచామని వెల్లడించారు. ఐదుగురి నమూనాలు నిర్ధారణ కోసం ఎన్ఐవీ పూణెకు పంపించామని, ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డులో ఉన్న వ్యక్తికి తీవ్రమైన లక్షణాలేవీ లేవని, ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు ధృవీకరించారని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. వైద్యాధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకోగానే 28 రోజుల పాటు తమ తమ ఇళ్లల్లోనే ఉండాలని, బయటికి రావొద్దని సూచించారు. కుటుంబ సభ్యులకు గానీ, ఇతరులకు గానీ దూరంగా ఉండాలని, ఒకవేళ దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే మాస్క్ ల కోసం సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని, ఇంకేమైనా సహాయం కావాలంటే 24 గంటలూ అందుబాటులో ఉంటే స్టేట్ కంట్రోల్ సెంటర్( 0866 2410978) నంబరుకు గానీ, 1100, 1902 టోల్ ఫ్రీ నంబరుకు గానీ ఫోన్ చేయాలని సూచించారు.

జారీచేసిన వారు : పీఆర్వో, వైద్య ఆరోగ్య శాఖ

……..

Categories
FEATURED WORLD

విజృంభించిన కరోనా, చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ.

చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా వ్యాధిగ్రస్తులై మృతి చెందిన వారి సంఖ్య 106కు పెరిగింది.

సుమారు 4 వేల మందికిపైగా జనంలో కరోనా లక్షణాలను కనుగొన్నట్లు‌ వైద్యు‌లు పేర్కొ‌న్నా‌రు. దీంతో చైనాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. పలు నగరాలకు రవాణా వ్యవస్థ నిలిపివేశారు.

చైనాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్సనందిస్తున్నారు. భారత్‌కు కూడా కరోనా వైరస్‌ వ్యాపించినట్లు భావిస్తున్నారు.

ఇండో-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్

కరోనావైరస్ కారణంగా ఇండో-నేపాల్ సరిహద్దులోని బీహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద వైద్య బృందాలను మోహరించాయి. నేపాల్‌తో సరిహద్దులు పంచుకునే అన్ని జిల్లాలు అప్రమత్తమయ్యాయి. డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు తొందరగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. నేపాల్‌లో ఇప్పటికే 1-2 కేసులు నమోదయ్యాయి. వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నేపాల్లో ఈ కరోనావైరస్ ఎక్కువగా వ్యాపిస్తే అది మనందరికీ హెచ్చరిక అని డాక్టర్లు అంటున్నారు.

Categories
FEATURED WORLD

కరోనా వైరస్ సోకితే అంతేనా?

కరొనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

చైనాలో వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కరొనా వైరస్ గురించి వైద్య నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. కరొనా అనే క్రిమి ద్వారా వ్యాపిస్తున్న ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రతి ఒక్కరికి కచ్చితమైన అవగాహన ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

​కరొనా వైరస్ గురించి..

కరొనా వైరస్ అనేది కొన్ని వైరస్‌ల సమూహం అని చెప్పొచ్చు. దీని గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే.. కొన్ని కరొనా వైరస్‌లు జంతువులకు మాత్రమే వ్యాపిస్తాయి.. కానీ, ఇందులోనే కొన్ని వైరస్‌లు మానవులను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది వ్యాపించిందంటే చాలు.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇదే ప్రభావం తీవ్రమైతే న్యూమోనియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. అనేక ఇందులో ప్రాణాంతక అనేక క్రిములు ఉన్నాయి.

​ఎలా వ్యాపిస్తుందంటే..

కరొనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 • సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది.
 • ఇది దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.
 • శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
 • వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.. అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.
 • మలం ద్వారా తక్కువనే చెప్పాలి.

​వైరస్ లక్షణాలు..

దీని లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయి. ఒక్కో సమయంలో మీకు వ్యాధి తీవ్రత ఎలా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండడమే కాకుండా మరి కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.

 • జలుబు
  *తలనొప్పి
 • దగ్గు
 • మోకాలి నొప్పులు
 • జ్వరం
 • పూర్తిగా అనారోగ్యం

​ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది..

కరొనా వైరస్‌లు శరీరంలో ప్రవేశించిన అనంతరం అనేక తీవ్ర లక్షణాలను చూపుతుంది. ఇది కొన్ని సార్లు మిగతా సమస్యలకు కూడా కారణం అవుతుంది. న్యూమోనియా వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.
దీంతో పాటు.. కఫంతో కూడిన దగ్గు ఉంటుంది..
ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది.
ఛాతీ దగ్గర నొప్పిగా ఉంటుంది.
గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.

​కరొనా వైరస్‌ని ఎలా గుర్తించాలి..

ఈ వైరస్‌ని గుర్తించడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు..
శారీరక పరీక్ష ద్వారా..
రక్త పరీక్ష ద్వారా ఈ వైరస్‌ని గుర్తించొచ్చు.
కఫం, గొంతు శుభ్రపరుచు, ఇతర శ్వాస పరీక్షల ద్వారా వీటి ఆధారంగా వైరస్‌ని గుర్తించొచ్చు..

​చికిత్స విధానం ఏంటి..?

కరొనా వైరస్ వ్యాపించిందింటే కొన్ని రకాల ట్రీట్‌మెంట్ ద్వారా దీనికి చికిత్స చేయొచ్చు.

 • నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు. అయితే, పిల్లలకు మాత్రం, ముఖ్యంగా నాలుగేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు, ఆస్పిరిన్ ఇవ్వకూడదు.
  ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
  నీరు ఎక్కువగా తాగుతుండాలి.

​వైరస్‌ని నివారించవచ్చా..

మానవులలో ప్రవేశించిన కరొనా వైరస్‌కి ప్రజెంట్ చికిత్స విధానమంటూ ఏం లేదు. కానీ, ఇది వ్యాప్తి చెందకుండా మాత్రం నిరోధించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించొచ్చు. అందుకోసం ఇలా చేయండి.

 • ఎప్పటికప్పుడూ చేతులను సబ్బునీటితో కడగాలి.
 • చేతలను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు..
 • అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
 • మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి..