Categories
ANDHRA PRADESH

రెడ్ జోన్ జిల్లాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ప్రకటించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను ప్రభుత్వం ప్రకటించింది.

రెడ్‌జోన్‌ జిల్లాలు: కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ

గ్రీన్‌జోన్ జిల్లా : విజయనగరం జిల్లా

Categories
ANDHRA PRADESH FEATURED LOCAL

మీరు ఈ ఏరియాలో ఉన్నారా? అయితే జాగ్రత్త.

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వివరిస్తూ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం, గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్, బుచ్చయ్య నగర్, జిల్లా పరిధిలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన, కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

కరోనా అంతం ఎప్పుడు? క్లిక్ చేయండి.

వీటితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లా వడమాలపేట, శ్రీకాళహస్తి, ఈ ప్రాంతాలతో పాటు మద్దూరు పరిధిలోని పాణ్యం గ్రామం, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం, నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట, చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం, అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు వచ్చాయని, ఇక్కడి వారంతా తగు జాగ్రత్తల్లో ఉండాలని సూచించింది.

Categories
ANDHRA PRADESH FEATURED

జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ!

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సచివాయంలో ఉన్న రాష్ట్ర విజిలెన్స్‌ కార్యాయాన్ని కర్నూలు తరలించాన్న ప్రభుత్వ ఉత్తర్వుల‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులు చెల్ల‌వ‌ని తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘జగన్‌’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు రాజధానుల‌ను ఏర్పాటు చేస్తున్నామని, అధికారాన్ని వికేంద్రీకృత చేస్తున్నామని, రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని తెలిపింది. అమరావతిలో ‘శాసనరాజధాని, ‘కర్నూలు’లో న్యాయరాజధాని, విశాఖపట్నంలో ‘కార్యనిర్వహకరాజధాని’ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానాన్ని ఆమోదించారు. తరువాత దీన్ని శాసనమండలి అడ్డుకుంది. మూడు రాజధానులు, వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి అడ్డుకుంటూ దాన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపింది. అయితే అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని శాసనమండలి అడ్డుకున్నదని భావిస్తూ శాసనమండలి అవసరం లేదని దాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇది ఇలా ఉంటే మూడు రాజధానుల‌ వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర విజిలెన్స్‌ కమీషన్‌, కమీషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాయాల‌ను కర్నూలుకు తరలించాని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై హైకోర్టులో వివిధ వర్గాలు కేసు వేశాయి. దీనిపై విచారణ జరగగా, ప్రభుత్వం సమాధానం ఇస్తూ…రాష్ట్ర సచివాయంలో విజిలెన్స్‌ కమీషన్‌, కమీషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ కార్యాయాల‌కు వసతి లేదని, అందుకే పాల‌నాపరమైన కారణాల‌తో వీటిని కర్నూలుకు తరలిస్తున్నామని హైకోర్టులో ప్రభుత్వం చెప్పింది. అయితే దీనిపై హైకోర్టు స్పందిస్తూ సచివాల‌యంలో వసతి లేకపోతే దాని పక్కనో..లేక గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలి కానీ, కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించి కేసును వాయిదా వేసింది. ఈ రోజు కేసు విచారణలో భాగంగా విజిలెన్స్‌, కమీషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాయాను కర్నూలుకు తరలిస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేసింది.

Categories
ANDHRA PRADESH

కరోనాపై అస్సలు ఆందోళన అక్కర్లేదు!

• కరోనా వైరస్ పై కలవర పడొద్దు

• 24 గంటలూ అందుబాటులో రాష్ట్ర స్థాయి కంట్రోల్ సెంటర్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, ఎటువంటి కలవరం చెందాల్సిన అవసరం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విదేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై గట్టి నిఘాతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ సెంటర్ ను ఇప్పటికే ఏర్పాటు చేశామని, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 50 మంది ప్రయాణికులు పరిశీలనలో ఉన్నారని, వీరిలో 49 మంది ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఒకరిని ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచామని వెల్లడించారు. ఐదుగురి నమూనాలు నిర్ధారణ కోసం ఎన్ఐవీ పూణెకు పంపించామని, ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డులో ఉన్న వ్యక్తికి తీవ్రమైన లక్షణాలేవీ లేవని, ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు ధృవీకరించారని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. వైద్యాధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకోగానే 28 రోజుల పాటు తమ తమ ఇళ్లల్లోనే ఉండాలని, బయటికి రావొద్దని సూచించారు. కుటుంబ సభ్యులకు గానీ, ఇతరులకు గానీ దూరంగా ఉండాలని, ఒకవేళ దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే మాస్క్ ల కోసం సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని, ఇంకేమైనా సహాయం కావాలంటే 24 గంటలూ అందుబాటులో ఉంటే స్టేట్ కంట్రోల్ సెంటర్( 0866 2410978) నంబరుకు గానీ, 1100, 1902 టోల్ ఫ్రీ నంబరుకు గానీ ఫోన్ చేయాలని సూచించారు.

జారీచేసిన వారు : పీఆర్వో, వైద్య ఆరోగ్య శాఖ

……..