Wednesday, July 28, 2021
Home State Affairs ఇచ్చిన మాట మర్చిపోతే ఎలా...? షర్మిల ఫైర్

ఇచ్చిన మాట మర్చిపోతే ఎలా…? షర్మిల ఫైర్

పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న వైఎస్ షర్మిల తెలంగాణాలో వరుసగా అన్ని జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా ఆమె ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. నిజామాబాద్ ,ఆదిలాబాద్ జిల్లా అభిమానుల‌తో ష‌ర్మిల ఆత్మియ స‌మ్మెళ‌నం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ప‌సుపు బోర్డ్ తెస్తాన‌ని ఎవ‌రో బాండ్ పేప‌రో ఇచ్చారంట‌ అంటూ… బాండ్ పేప‌ర్ ఇచ్చి రైతుల‌ను ద‌గా చేశాడు అని మండిపడ్డారు.

ఇచ్చిన మాట మీద క‌ట్టుబ‌డి ఉండ‌టం తెలియ‌దా అని ఆమె నిలదీశారు. ప‌సుపు రైతుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఎక్స్ టెన్ష‌న్ సెంట‌ర్ ఇచ్చే ప‌సుపు రైతుల క‌ష్టాలు తీరుతాయా అని ప్రశ్నించారు. ప్ర‌తి గ‌డ‌ప‌కు పూసే ప‌సుపు పండించే రైతుకు క‌ష్టాలు క‌న‌ప‌డ‌టం లేదా అని నిలదీశారు. బైంసా లో మత‌క‌ల్లోలాలు సృష్టించ‌డంపై ఉన్న ఆస‌క్తి రైతుల క‌ష్టాల‌పై ఉండ‌టం లేదు అన్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments