Tuesday, July 27, 2021
Home State Affairs అసలు గెలుపు టీడీపీదే - నారా లోకేశ్

అసలు గెలుపు టీడీపీదే – నారా లోకేశ్

డెమోక్ర‌సీకి, జ‌గ‌న్ రెడ్డి మోనోక్ర‌సీకి మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొంత తేడాతో సంఖ్యా విజ‌యం వైసీపీ‌దైనా అస‌లు సిస‌లు గెలుపు టిడిపిదే. అంబేద్క‌ర్ రాజ్యాంగం ప్ర‌కారం జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లను జ‌గ‌న్‌రెడ్డి త‌న‌ రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు. మ‌న‌దేశానికి అర్ధ‌రాత్రి స్వాతంత్ర్యం వ‌స్తే, నాలుగు విడ‌త‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అర్థ‌రాత్రి జ‌గ‌న్‌రెడ్డి ఫ్యాక్ష‌న్ పాలిటిక్స్‌కి స్వాతంత్ర్యం వ‌చ్చింది. టిడిపి మ‌ద్ద‌తుతో పోటీ చేసే అభ్య‌ర్థుల్ని చంపేశారు.. నామినేష‌న్ వేయ‌కుండా కిడ్నాప్ చేశారు… బెదిరించారు.. భ‌య‌పెట్టారు.. క‌ట్టేసి కొట్టారు.. అయినా వెన‌క్కిత‌గ్గ‌ని టిడిపి అభ్య‌ర్థులు లెక్కింపులో ముందంజ‌లో వుంటే.. క‌రెంట్ నిలిపేశారు. కౌంటింగ్ కేంద్రాల‌కు తాళాలేసారు. పోలీసుల‌తో బెదిరించారు. దాడులు చేశారు. టిడిపి మ‌ద్ద‌తుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్ర‌క‌టించుకున్నారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోనే ఎన్న‌డూ లేని విధంగా జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌కు పాల్ప‌డినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన‌ టిడిపి కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, అభిమానులంద‌రికీ శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.

— నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments