Wednesday, July 28, 2021
Home State Affairs ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కి కేబినేట్ ఆమోదం

ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కి కేబినేట్ ఆమోదం

బడ్జెట్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆన్‌లైన్‌లో ఆమోదం తెలిపారు మంత్రులు. 3 నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ తెలిపారు. రూ.80-90 వేల కోట్లతో 3 నెలల బడ్జెట్ రూపొందించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు నిధులతో బడ్జెట్ రూపొందించారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

ఏప్రిల్ 2 లేదా మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులు కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

- Advertisment -

Most Popular

Recent Comments