Tuesday, July 27, 2021
Home State Affairs బడ్జెట్:తెలంగాణా రైతులకు స్వీట్ న్యూస్

బడ్జెట్:తెలంగాణా రైతులకు స్వీట్ న్యూస్

తెలంగాణా బడ్జెట్ ను ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్లు, రైతు బంధు కోసం 14,800 కోట్లు కేటాయించారు. రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేసింది. వ్యవసాయానికి 25 వేల కోట్లు కేటాయించింది. అలాగే పశు సంవర్ధక శాఖకు 1730 కోట్లు కేటాయించారు.

సాగునీటి రంగానికి 16,931 కోట్లు కేటాయించారు. సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కంటె 48వేల కోట్ల అధిక అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 2021-22 తెలంగాణ బడ్జెట్ 2,30,825.96కోట్లతో ప్రవేశ పెడుతున్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments