Tuesday, July 27, 2021
Home State Affairs జగన్ కు షర్మిల కంటే ఆవిడే ఎక్కువ... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జగన్ కు షర్మిల కంటే ఆవిడే ఎక్కువ… టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అగ్ర నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ సిఎం వైఎస్ జగన్ కు తన సోదరి షర్మిల కంటే… ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అంటే ఎక్కువ అభిమానం అంటూ వ్యాఖ్యలు చేసారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం ఎమ్.శామ్యూల్ వైపు మొగ్గుచూపుతోందని తెలిసింది అని, గవర్నర్ పరిశీలనకు పంపిన మూడుపేర్లలో ప్రభుత్వం శామ్యూల్ వైపు ఉన్నట్లు తమకు పత్రికలద్వారా తెలిసింది అని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

గతంలో రమేశ్ కుమార్ ను బలవంతంగా సాగనంపి, ఆయనస్థానంలో కనగరాజ్ ను నియమించాలని చూసిన ప్రభుత్వం, ఇప్పుడు శామ్యూల్ పై ఎందుకు ఆసక్తి చూపుతోంది? అని ఆరోపించారు. ఆనాడు కనగరాజ్ నియమాకం చంద్రబాబునాయుడికి ఇష్టంలేదని మొసలికన్నీరు కార్చిన జగన్, ఇప్పడేం సమాధానం చెబుతాడు? అని నిలదీశారు. రిటైర్జ్ జస్టిస్, దళితుడు, న్యాయకోవిదుడు కనగరాజ్ ను ప్రభుత్వం వాడుకొని వదిలేసినట్టేనా? అని నిలదీశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ముఖ్యమంత్రి తోటి ముద్దాయనా? అని అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతికోసం, దోపిడీకోసం గతంలో శామ్యూల్ సహకరించాడని, ప్రభుత్వం ఆయనపై ఆసక్తిచూపుతోందా? అని నిలదీశారు.

- Advertisment -

Most Popular

Recent Comments