Tuesday, July 27, 2021
Home State Affairs ఎన్నికల్లో పోటీ చేయను అంటున్న గంటా...!

ఎన్నికల్లో పోటీ చేయను అంటున్న గంటా…!

ఉక్కు పరిరక్షణ కోసం నాన్ పోలిటికల్ జె.ఏ. సి ఏర్పాటు చేస్తాం అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంటు ను కాపాడుకోవడం కోసం రాజీనామా బలమైన అస్త్రం అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర మంత్రులు రాజీనామా చివరి అస్త్రం అంటున్నారు అని, స్టీల్ ప్లాంట్ కోసం మంత్రుల రాజీనామాకు సమయం ఆసన్నమైనది అని వెల్లడించారు. ప్రైవేటీకరణ పై కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పింది అని గుర్తు చేసారు.

సీఎం జగన్ పై బాధ్యత ఎక్కువగా ఉందన్నారు గంటా. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చంద్రబాబు సీనియారిటీని ప్రక్కన పెట్టి జగన్ తో నడుస్తానన్నారు అని, కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖ వస్తారు అని వెల్లడించారు. నా రాజీనామా తో ఖాళీ అయిన చోట మళ్ళీ పోటీ చేయను అని, స్టీల్ ప్లాంట్ నిర్వాసితున్ని నా స్థానంలో నిలబెడతాను అని ప్రకటన చేసారు.

- Advertisment -

Most Popular

Recent Comments