Wednesday, July 28, 2021
Home State Affairs నిమ్మగడ్డపై హైకోర్ట్ కి జనసేన... ఎందుకు...?

నిమ్మగడ్డపై హైకోర్ట్ కి జనసేన… ఎందుకు…?

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని జనసేన వేసిన పిటీషన్‌ పై హైకోర్టులో విచారణ జరిగింది. నాడు బలవంతంగా, దౌర్జన్యంగా నామినేషన్లు ఉపసంహరింపచేశారని పిటీషనర్‌ హైకోర్ట్ కి వివరించారు. ఎస్‌ఈసీ ఈ బలవంతపు ఉపసంహరణలు, ఏకగ్రీవాల పై కేంద్రానికి లేఖ రాసింది అని జనసేన పార్టీ వివరించింది. లేఖ ఆధారంగానే మళ్లీ తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలి అని కోరారు.

కోవిడ్‌ కారణంగా సమాజంలో అనేక మార్పులు వచ్చాయని పిటీషనర్‌ తరపు న్యాయవాది వేణుగోపాలరావు కోరారు. లేఖ ఆధారంగానే బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల ఉపసంహరణ పై విచారణకు ఆదేశించామని ఎస్‌ఈసీ న్యాయవాది అశ్వినీకుమార్‌ వివరించారు. కోర్టు ఉత్తర్వులు వలన ఈ విచారణ నిలిచిపోయింది అని కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేశామని హైకోర్టు దృష్టికి అశ్వినీకుమార్‌ తీసుకెళ్ళారు. ఈ పిటీషన్‌కు విచారణ అర్హత లేదు అని, మిగతా పిటీషన్లతో కలపాలి అని కోర్ట్ పేర్కొంది. మిగతా పిటీషన్లతో కలిపి సోమవారం విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments