Tuesday, July 27, 2021
Home State Affairs దేశంలో ఇక రిజర్వేషన్ ఉండదా...?

దేశంలో ఇక రిజర్వేషన్ ఉండదా…?

మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. జైలులో పేద వాళ్ళు మాత్రమే మగ్గుతున్నారు అని ఆయన మండిపడ్డారు. కొలిజీయం వ్యవస్థ వల్ల దళితులు న్యాయమూర్తులు కావటం లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కొలిజీయం వల్ల అగ్రవర్ణాల వారు శిక్షలు పడకుండా, జైలుకి వెళ్ళకుండా తప్పించుకుంటున్నారు అని మండిపడ్డారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ లో కొలిజీయం వ్యవస్థ లోపభూయిష్టం అని ఆరోపించారు.

న్యాయమూర్తులు రిజర్వేషన్ల పై మాట్లాడేముందు కొలిజీయం వ్యవస్థ ను చక్కదిద్దండి అని సూచించారు. అంటరానితనం నిర్మూలన కోసమే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని అన్నారు. కులపరంగా అసమానతలు తగ్గించేందుకు రిజర్వేషన్లు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయటం లేదు అని నిలదీశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది అని మండిపడ్డారు.

- Advertisment -

Most Popular

Recent Comments