Tuesday, July 27, 2021
Home State Affairs ఆ జిల్లా తెరాసలో నిప్పు అంటుకుంది...!

ఆ జిల్లా తెరాసలో నిప్పు అంటుకుంది…!

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజయ్య. నాకు నియోజకవర్గంలో వస్తున్న ప్రజాధారననణ చూసి కడియం ఓర్వలేక నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇదంతా పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది.. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందిఅని అన్నారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలి అని కోరారు.

నాపై ఎన్ని అభియోగాలు చేస్తే నాకు అంత దీవెనలుగా మారి ప్రతిసారి మెజార్టీ పెరుగుతుంది అన్నారు. స్టేషన్ ఘనపూర్ వినూత్న రాజకీయ ఉద్యమాలకు వేదిక అని, అధిష్టానం దృష్టికి నేను తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు అని తెలిపారు. పార్టీ అధినేత దగ్గర పూర్తి సమాచారం ఉంది అని తెలిపారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించ వద్దు అన్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments