Wednesday, July 28, 2021
Home State Affairs జగన్ పై చిరంజీవి ప్రసంశ

జగన్ పై చిరంజీవి ప్రసంశ

కర్నూలులో ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఏపీ సిఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు. రాష్ట్రంలో ఇది ఆరవ విమానాశ్రయం అని ఆయన పేర్కొన్నారు. న్యాయ రాజధాని నుంచి మిగతా రాష్ట్రాల్లకు ఓర్వకల్లు విమానాశ్రయం కలుపుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికలకు నెల రోజుల ముందు.. ఎలక్షన్ లో లబ్ది పొందేందుకు చంద్రబాబు ఓర్వకల్లు ఏయిర్ పోర్టును ప్రారంభించారు అని అన్నారు.

రూ. 110 కోట్లతో అన్ని హంగులతో ఎయిర్ పోర్టును తీర్చిదిద్దాం అని వెల్లడించారు. ఓర్వకల్లు ఏయిర్ పోర్టుకు తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరును నామకరణం చేస్తున్నామని అన్నారు. ఇక ఈ పేరు పెట్టడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేసారు.

- Advertisment -

Most Popular

Recent Comments