Tuesday, July 27, 2021
Home Prime Politics మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది... ఏపీ మంత్రి వ్యాఖ్యలు

మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది… ఏపీ మంత్రి వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికార పార్టీ టార్గెట్ గా టీడీపీ నేతలు విమర్శలు చేయడం, రాష్ట్రంలో హిందూ దేవాలయలపి దాడులు జరగడం కాస్త సంచలనం అయింది. తాజాగా హిందూ ఆచార్య సభ, సేవ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది, మంత్రి వెల్లంపల్లి, శివస్వామి, గజల్ శ్రీనివాస్ హాజరయ్యారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ దేవాలయ రాజకీయాలతో ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతుంది అన్నారు.

జగన్ ప్రభుత్వంపై కొంతమంది స్వామీజీల తీరు బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. దేవాలయాల పేరిట రాజకీయాల చేస్తున్న వారిని స్వామీజీలు ఉపేక్షిస్తున్నారు అని మండిపడ్డారు. దేవాలయాల రక్షణ ప్రభుత్వానిదే కాదు …ప్రజలది కూడా అని, దేవాలయాలపై దాడుల కేసుల్లో 300 మందిని అదుపులోకి తీసుకున్నాం అని వెల్లడించారు. వైసిపి ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది అన్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments