Wednesday, July 28, 2021
Home Prime Politics ఫాంలోకి వచ్చిన కొడాలి నానీ

ఫాంలోకి వచ్చిన కొడాలి నానీ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఐడి నోటీసులపై మంత్రి కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాం లు చేశారు అని అన్నారు. సి ఆర్ డి ఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జిఓ లతో, దళిత వర్గాలను మోసం చేశారు అని ఆరోపించారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారు అని ఆయన చెప్పుకొచ్చారు.

దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలి అని డిమాండ్ చేసారు. ఆంబోతుల అచ్చెన్నాయుడు అరుస్తున్న, కుక్కల బుద్ధ వెంకన్న మొరుగుతున్నా తాము అదిరేది లేదు బెదిరేది లేదు అని, అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సి నోటీసులు జారీ చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు.

- Advertisment -

Most Popular

Recent Comments