Tuesday, July 27, 2021
Home Prime Politics నోటి తొందర: తెరాస ఎమ్మెల్యే గారు ఇరుక్కున్నారే...!

నోటి తొందర: తెరాస ఎమ్మెల్యే గారు ఇరుక్కున్నారే…!

trs mla sensational comments

ఈ మధ్య కాలంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు రావాలి అంటే కచ్చితంగా అధికార పార్టీలను గెలిపించాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. తాజాగా తెరాస పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఇవే వ్యాఖ్యలు చేసారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి అని ఆయన స్పష్టం చేసారు.

రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లకూ ఇదే వర్తింపు అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏపథకాలు అమలు చేసినా ముందుగా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తాం అని స్పష్టం చేసారు. మొన్న ఇలాగే కామెంట్స్ చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై విపక్షాలు మండిపడ్డాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారని జిల్లాలో చర్చ జరుగుతుంది. సభ్యత్వ నమోదు ఆదరణ కరువు కావడంతో ఇలా మాట్లాడుతున్నారని పలువురు మండిపడుతున్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments