Tuesday, July 27, 2021
Home Prime Politics మా సర్పంచ్ ల లెక్క ఇది... బయటపెట్టిన పవన్

మా సర్పంచ్ ల లెక్క ఇది… బయటపెట్టిన పవన్

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నా… అవి ప్రజలకు చేరుతున్న దాఖలాలు కనిపించడంలేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మాటల్లో చెప్పిన విధంగా.. ఎక్కడా ఆచరణలో కనిపించడంలేదని ఆయన ఆరోపించారు. జనసేన నాయకులు లేకపోయినా… నేడు జనసైనికులు లేని గ్రామం లేదు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. గ్రామాలలో కొత్త నాయకత్వం రావాలి.. అధికార మార్పిడి క్రమక్రమంగా జరగాలి అని ఆయన అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan fans eagerly await 'Vakeel Saab', actor's return to cinema  after 2 years | The News Minute

యువత వల్లే అది సాధ్యమని నమ్మి.. వారిని ప్రోత్సహించాను అన్నారు. ఈ పంచాయతీ ఎన్నికలలో 1209 మంది సర్పంచ్ లు, 1776ఉప సర్పంచ్ లు, 4456 మంది వార్డు సభ్యులు జనసేన మద్దతు కలిగిన వారు గెలుపొందడం సంతోషంగా ఉంది అన్నారు పవన్. రాష్ట్ర వ్యాప్తంగా 65శాతం పంచాయతీలలో ద్వితీయ స్థానంలో నిలిచాం అని, మొత్తం మీద 27శాతం ఓటింగ్ ఈ ఎన్నికలలో జనసేన పొందింది అని ఆయన వివరించారు. పంచాయతీ ఎన్నికలలో నాకు చాలా తృప్తిని ఇచ్చిన విజయం ఇది అన్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments