Wednesday, July 28, 2021
Home Prime Politics అక్రమ నిర్మాణాలు కడుతుంటే మీరేం చేస్తున్నారు...? తలంటిన హైకోర్ట్

అక్రమ నిర్మాణాలు కడుతుంటే మీరేం చేస్తున్నారు…? తలంటిన హైకోర్ట్

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు మండిపడింది. నేడు అక్రమ నిర్మాణాలకు సంబంధించి తెలంగాణా హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీసింది. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది.

అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అనేకమంది కోర్టులకు వస్తున్నారన్న ధర్మాసనం… అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడాల్సిందేనని స్పష్టత ఇచ్చింది. అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2019లో అక్రమ నిర్మాణాలు ఎన్ని గుర్తించారు? ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలి అని, స్టేలు తొలగించాలని కోర్టుల్లో పిటిషన్లు ఎన్ని వేశారో తెలపాలి అని ఆదేశించింది.

- Advertisment -

Most Popular

Recent Comments