Wednesday, July 28, 2021
Home Prime Politics ఏపీలో కూడా షర్మిల పార్టీ వస్తుందా...?

ఏపీలో కూడా షర్మిల పార్టీ వస్తుందా…?

తెలంగాణాలో వైఎస్ షర్మిల విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు ఉన్నాయి. వైఎస్ షర్మిల పార్టీ పెడితే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే దానిపై చాలా అంచనాలు ఉన్నాయి. షర్మిల పార్టీ పెట్టే అంశం గురించి సిఎం జగన్ కు అసలు ఇష్టం లేదు అంటూ వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

షర్మిల ప్రస్తుతం వామప్ చేస్తోంది అని ఆయన అన్నారు. ఏడాదిన్నరలో ఏపీకి కూడా ఎంటర్ అవుతుంది అని తెలిపారు. విజయమ్మకు షర్మిల మీదనే ప్రేమ ఎక్కువ అని, షర్మిల కు ఏదైనా కీలక పదవిస్తే సమస్య సమసిపోయేది అని అన్నారు. మోడీ కి మా మద్దతు లేకుండా ఏపీలోఒక్క సీటు కూడా రాదు అని స్పష్టం చేసారు.

- Advertisment -

Most Popular

Recent Comments