Tuesday, July 27, 2021
Home Prime Politics కేసీఆర్ బినామీ ఆయనేనా...?

కేసీఆర్ బినామీ ఆయనేనా…?

కేసీఆర్ కుటుంబంలో ఒక్కక్కరు ఒక ఆర్టిస్ట్ గా తయారైయ్యారు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బాత్రూమ్ ల ఓపెనింగ్ కు వస్తున్న హరీష్ రావు ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ధర్నా వద్దకు రావడం లేదు అని ఎద్దేవా చేసారు. తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు బాగుపడుతాయని అనుకున్నారు కానీ వారి జీవితాలు మారలేదు అని మండిపడ్డారు. హరీష్ రావు ,కేటీఆర్ ,కవిత, ఇప్పుడు ఎంపీ సంతోష్ ఒక్కొక్కరు ఒక ఆర్టిస్ట్ లుగా మారారు అని ఆయన ఆరోపించారు.

సంతోష్ గ్రీనరీ అని ఒక కొత్త సినిమా చూపిస్తున్నాడు అని ఆరోపించారు. ఈ భూమి పుట్టినప్పటి నుంచి వీళ్లే చెట్లు నాటినట్లు చూపెడుతున్నారు అని ఆరోపించారు. ఎంపీ సంతోష్.. హీరో ప్రభాస్ ని తీసుకొచ్చి చెట్లు పెట్టిస్తాడు బొంబాయి నుండి హీరోయిన్ లను తెచ్చి మొక్కలు నాటిస్తాడు అని ఎద్దేవా చేసారు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు పోరాటం చేస్తుంటే ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకొని చెట్లు పెట్టించొచ్చు కదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆస్తులకు,రాజకీయాలకు సంతోష్ బినామీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments