Wednesday, July 28, 2021
Home Prime Politics పరిస్థితి చాలా దారుణంగా ఉంది... కేంద్రం వార్నింగ్

పరిస్థితి చాలా దారుణంగా ఉంది… కేంద్రం వార్నింగ్

భారత్ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అవుతుంది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆగడం లేదు. ఆ రాష్ట్రంలో రెండు రోజుల్లో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక కేంద్రం కూడా దేశ ప్రజలకు కొన్ని హెచ్చరికలు చేసింది. మహమ్మారి ఇంకా అంతం కానందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఎన్ఐటిఐ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… పరిస్థితిని ఆందోళన కలిగించేది గా అభివర్ణించారు. మార్చి 15 నుండి 21 వరకు నాగ్‌పూర్‌లో విధించిన లాక్ డౌన్ మళ్ళీ దేశంలో విధించే వరకు తెచ్చుకోవద్దు అని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగడాన్ని గమనించామని చెప్పారు. వైరస్ ను తేలికగా తీసుకోవద్దని ఇది ఊహించని విధంగా వస్తుందని హెచ్చరించారు.

- Advertisment -

Most Popular

Recent Comments