Tuesday, July 27, 2021
Home Prime Politics ఎమ్మెల్సీకి పేరు మార్చేసిన బండి సంజయ్... ఆ ఫోటో కేసీఆర్ కొంప ముంచింది

ఎమ్మెల్సీకి పేరు మార్చేసిన బండి సంజయ్… ఆ ఫోటో కేసీఆర్ కొంప ముంచింది

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అభ్యర్థి ప్రేమందర్ రెడ్డి పాల్గొన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ… నయీమ్ అక్రమ ఆస్తులు మెక్కిన కేసీఆర్ చేత అన్నీ కక్కిస్తాం అని అన్నారు. లక్ష్మీ నర్సింహా స్వామి పక్కన కేసీఆర్ ఫోటో ఎప్పుడూ పెట్టమన్నాడో,అప్పటి నుంచే ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, న్యాయవాది వామన రావు దంపతుల హత్యలో టిఆర్ఎస్ నాయకుల హస్తం ఉంది, ఇప్పటివరకు సీఎం స్పందించక పోవడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే మెంబెర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరుతో 70 వేలు బాకీ ఉంది అన్నారు. సీఎం పదవిని కేసీఆర్ చెప్పుతో పోల్చారు, టిఆర్ఎస్ కి ఓటు వేస్తే చెప్పుకు ఓటు వేసినట్లే అని ఆయన విమర్శించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం, బీజేపీ, టిఆర్ఎస్ మధ్య ఓ యుద్ధంలా జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలిపిస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం అని అన్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments