Tuesday, July 27, 2021
Home Prime Politics కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం కావడానికి అదే కారణమా...?

కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం కావడానికి అదే కారణమా…?

పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ నోటితో ఎందుకు చెప్పటంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పీఆర్సీ కోసం సీఎంతో కలసి ఎన్నికల సంఘం వద్దకు రావటానికి సిద్ధమని స్పష్టం చేసారు. పోలీసులకు బీజేపీ వ్యతిరేకం కాదు.‌ హోంగార్డులు, కానిస్టేబుల్స్ కోసం బీజేపీ పోరాటం చేస్తోందని అన్నారు. కొందరు పోలీస్ అధికారులు మాత్రమే టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు.

దేశ భక్తుల ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తోంది అని అన్నారు. ముఖ్యమంత్రి మౌనం తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారింది అని తెలిపారు. నాలుగేళ్ళ బాలిక అత్యాచారానికి గురైతే ముఖ్యమంత్రి నోర విప్పకపోవటం అన్యాయం అన్నారు ఆయన. తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించటమే బీజేపీ లక్ష్యంఅని స్పష్టం చేసారు. ఓడిపోతున్నాడు కాబట్టే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం‌ ఓటు అడగలేదు అని అన్నారు. పేదల నాయకులు రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డిలను గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందని అన్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments