Tuesday, July 27, 2021
Home Prime Politics బద్మాష్ గాళ్ళకే తెరాసలో పదవులు... ఛీఛీ...!

బద్మాష్ గాళ్ళకే తెరాసలో పదవులు… ఛీఛీ…!

టిఆర్ఎస్ పై కళాకారుడు సాయిచంద్ తిరుగుబాటు స్వరం వినిపించారు. గులాబీ పార్టీ నాయకత్వ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. 18ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను అని అన్నారు. అయినా నీకు పదవి ఎందుకు రావడం లేదని చాలామంది అడుగుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నాకు తెలివి ఎక్కువుందనే పదవి ఇవ్వడం లేదు అన్నారు. బట్టేబాజ్, బద్మాష్ గాళ్ల కు రెండు సార్లు పదవులొచ్చినయ్ అని మండిపడ్డారు.

ఇక ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడుస్తానని ప్రకటన చేసారు. స్వేరో సభలో సాయిచంద్ హాట్ కామెంట్స్ చేసారు. ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం టిఆర్ఎస్ లో కొనసాగుతున్న సాయిచంద్ పేరు పెద్దగా మీడియా వర్గాల్లో కూడా వినపడదు. కొన్నేళ్లుగా టిఆర్ఎస్ సభలు, సమావేశాల్లో తన ఆట పాటలతో అలరిస్తున్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments