Tuesday, July 27, 2021
Home Prime Politics మరోసారి దొరికిపోయిన ఏపీ మంత్రి గారు... జనసేనకే

మరోసారి దొరికిపోయిన ఏపీ మంత్రి గారు… జనసేనకే

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కార్యాలయంలో జనసేన అధికారప్రతినిధి పోతిన మహేష్ ఫిర్యాదు చేసారు. గతంలో 2014 కార్పొరేషన్ ఎన్నికలలో 32వ డివిజన్ లో ఓసి అభ్యర్ధినిగా అత్తులూరి ఆదిలక్ష్మి పోటీ చేసారు. ప్రస్తుతం డివిజన్ 48లో బీసీ కార్పొరేట్ అభ్యర్ధినిగా పోటీ చేస్తున్నారు. తప్పుడు కులదృవీకరణ పత్రాలతో బీసీ అభ్యర్ధినిగా పోటీ చేస్తోందని ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసారు.

Jana Sena Party Logo Animation - Pawan Kalyan's New Political Party - Jana  Sena Party Emblem - YouTube

బీసీ అభ్యర్ధినిగా ఎలా మారిందో అత్తులూరి ఆదిలక్ష్మి సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. బీసీ రిజర్వ్ స్థానం లో ఓసీ అభ్యర్థి కి ఎలా అవకాశం ఇచ్చారో అధికార వైస్సార్ కాంగ్రెస్ సమాధానం చెప్పాలి అని సవాల్ చేసారు. దొంగ కులదృవీకరణ పత్రాలు సృష్టించి బీసీ సీట్ లో ఓసి అభ్యర్థితో ఎలా పోటీ చేయిస్తారో మంత్రి వెల్లంపల్లి సమాధానం చెప్పాలి అని నిలదీశారు. 2014 లో అత్తులూరి ఆదిలక్ష్మి ఎన్నికల అఫిడవిట్ లో ఓసీ అని డిక్లేర్ చేశారు అని అన్నారు. అదే అఫిడవిట్ లో బీసీ కాదని కూడా ఒప్పుకున్నారు అని, అయితే ఇప్పుడు బీసీ గా పోటీకి దిగుతున్నారు అని తెలిపారు.

- Advertisment -

Most Popular

Recent Comments