Tuesday, July 27, 2021
Home Prime Politics వాళ్ళతో మాట్లాడా... అలా చేస్తే వదలను: నిమ్మగడ్డ

వాళ్ళతో మాట్లాడా… అలా చేస్తే వదలను: నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల్లో ధనప్రభావం పై ప్రత్యేక దృష్టిసారించింది అని రమేష్ కుమార్ అన్నారు. ఇప్పటికే సున్నితమైన అర్భన్ లోకల్‌ బాడీస్‌ ను ఎస్‌ఈసీ గుర్తించింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ జాబితాలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరుతో పాటు పలు ఇతర నగరపాలక సంస్ధలు, మున్సిపాలిటీలు ఉన్నాయి అన్నారు.

ఎన్నికల్లో నగదు అక్రమాలపై రాష్ర్ట ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదాయపన్ను శాఖ అధికారులతో మాట్లాడింది అని, ఎక్కడైనా అనుమానాస్పదంగా నగదు బదిలీలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్‌ఈసీ కోరింది అని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ, మద్యం పంపిణీలను నిరోధించడానికి ఎస్‌ఈసీ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసింది అని వివరించారు.

- Advertisment -

Most Popular

Recent Comments