Tuesday, July 27, 2021
Home Prime Politics జగన్ మాంసం కోసం చూస్తారు... అందుకే మేత వేస్తారు... కాంగ్రెస్ నేత

జగన్ మాంసం కోసం చూస్తారు… అందుకే మేత వేస్తారు… కాంగ్రెస్ నేత

సీఎం జగన్ మీద, ప్రాంతీయ పార్టీలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి నేడు సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసిపి పార్టీ ..రౌడీల పార్టీ అని ఆయన ఆరోపించారు. జగన్ ది వేటగాడు మనస్తత్వమే అన్నారు. పావురాలకి ఆహారాన్ని వేస్తారు,అది పావురాల మీద ప్రేమ కాదు, పావురాల మాంసం మీద..ఇది జగన్ తీరు అని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే అరాచక పాలన వస్తుందని అప్పుడే చెప్పాను అన్నారు.

ఇప్పుడు అదే జరుగుతుంది అని పేర్కొన్నారు. బిజెపికి తోక పార్టీలు.. టిడిపి,వైసిపి,జనసేన అని ఎద్దేవా చేసారు. ఈ మూడు పార్టీలు ఆంధ్రలో కుస్తీ…హస్తినలో దోస్తీ అన్నారు. బిజెపి చంక లో పవన్ కల్యాణ్ ఉన్నారు అని, టీడీపీ దద్దమ్మ పార్టీ..జనం లేని పార్టీ జన సేన…ఈ మూడు పార్టీలు బిజెపికి బినామీలు అని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ పార్టీ..అందరి పార్టీ అన్నారు.

- Advertisment -

Most Popular

Recent Comments