Wednesday, July 28, 2021
Home Prime Politics టీటీడీ ఆస్తులు ఎన్నో లెక్క చెప్పారు

టీటీడీ ఆస్తులు ఎన్నో లెక్క చెప్పారు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆస్తుల పరిరక్షణ కై కమిటీని వేసామని టీటీడీ తరఫు న్యాయవాది వెల్లడించారు. 1128 ఆస్తులను నివేదికలో టిటిడి పేర్కొంది. కమిటీ నియామకాన్ని న్యాయవాది యలమంజుల బాలాజీ తీవ్రంగా తప్పుబట్టారు. కమిటీ కి ఎవరు నేతృత్వం వహిస్తున్నారో తెలియదు అని అన్నారు. శృంగేరి పీఠం సీఈఓను ముందు పెట్టే రెండు మూడు స్థానాల్లో రిటైర్డ్ జడ్జీలను పెట్టడం ప్రోటోకాల్ కి విరుద్ధం అని ఆరోపించారు.

కమిటీలో ఉన్న శ్రీధరరావు చీఫ్ జస్టిస్ కాదన్న ధర్మాసనం… రిటైర్డ్ న్యాయమూర్తులను ప్రోటోకాల్ ప్రకారం కమిటీలో ఉంచాలని స్పష్టం చేసింది. పిటిషనర్ న్యాయవాది బాలాజీతో వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కమిటిని సరిచేసి మళ్లీ అఫిడవిట్ వేయాలని ఆదేశం ఇచ్చింది. కేసు విచారణ ఈనెల 12కి వాయిదా వేసింది.

- Advertisment -

Most Popular

Recent Comments