నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా! కాపాడే బాధ్యత మీదే! – వైఎస్ విజయమ్మ

97

రాజశేఖర్ రెడ్డి పోయిన బాధనుంచే ఇంకా తేరుకోలేదు..జగన్ ను మానుంచి దూరం చేయొద్దు. నమ్మినవాళ్లకు ప్రాణం పోయడం మాత్రమే జగన్ కి తెలుసు. మీ కోసం నా కొడుకు వస్తున్నాడు. కాపాడుకునే బాధ్యత మీదే. నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా.” – వైఎస్ విజయమ్మ

జగన్ పై హత్యాయత్నం విషయంలో తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. వైఎస్ జగన్ కు ఇది పునర్జన్మలాంటిదన్నారు విజయమ్మ. ప్రజల ప్రార్థనల వల్లే జగన్ క్షేమంగా ఉన్నాడన్నారు. భుజానికి తగిలిన కత్తి, మెడకు తగిలి ఉంటే ప్రాణం పోయేదన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ రావడంపై కూడా వెకిలిగా మాట్లాడుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష నేతకే భద్రత లేకుంటే ఎలా అని విజయమ్మ ప్రశ్నించారు.

వైఎస్ విజయమ్మ ప్రెస్ మీట్ – విజేత టీవీ లైవ్

నాకుంటుబాన్ని అన్ని విధాలుగా వేధిస్తున్నారు. ప్రతిపక్షం అడిగితే నా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు. వైఎస్ భారతమ్మపై ఈడీ విచారణ పేరుతో ఇరికించాలని చూశారు. కాంగ్రెస్, టిడిపి వికృత చేష్టలతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. అయినా ఎక్కడా తలవంచలేదు . గాయంతో కొడుకు ఉంటే..తల్లి మీద చెల్లి మీద మాట్లాడుతున్నారు ” – – వైఎస్ విజయమ్మ

గుండు సూది కూడా వెళ్లని ఎయిర్ పోర్టులోకి కోడి కత్తి ఎలా వెళ్లింది..ఎలాంటి ముడతలు లేకుండా అబద్ధపు లేఖలు ఎలా సృష్టించారు? రాష్ట్ర పోలీసులపై ఏమాత్రం నమ్మకం లేదు అందుకే జగన్ కి కేంద్ర బలగాల భద్రత కోరుతున్నాం. జగన్ కేసుపై పక్షపాత రహిత విచారణ జరగాలని వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. మూడున్నర సెంటీమీటర్ల లోతున కత్తి దిగింది..అదే మెడమీద తగిలితే పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. జగన్ మళ్లీ పాదయాత్రకు వెళుతున్నారు..ప్రజలే ఆశీర్వదించి జగన్ ని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి అన్నారు విజయమ్మ. 30ఏళ్ల పాటు రాజశేఖర్ రెడ్డికి, 7ఏళ్ల పాటు ప్రజల మధ్యే ఉన్న జగన్ కి అండగా నిలిచిన ప్రజలకు విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles –>జగన్ డాక్టర్ ఆడియో లీక్ http://www.vijethatv.in/politics/jagan-doctor-swathi-audio-leak/

@వైఎస్ జగన్ పై హత్యాయత్నం విజేత Exclusive http://www.vijethatv.in/andhrapradesh/attack-on-ycp-chief-jagan/

@ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే http://www.vijethatv.in/politics/attack-on-jagan-is-govt-failure-roja-blames/

@హాస్పిటల్లో జగన్ http://www.vijethatv.in/andhrapradesh/jagan-is-undergoing-for-treatment/

@పిరికిపంద చర్యలకు భయపడేది లేదు http://www.vijethatv.in/politics/jagan-reaction-on-attack/

@జగన్ పై హత్యాయత్నం కేసు దర్యాప్తు  http://www.vijethatv.in/andhrapradesh/interrogation-is-going-on-say-ap-dgp/