విషాదం : ప్రముఖ తెలుగు నిర్మాత కన్నుమూత

ప్రముఖ తెలుగు నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి శివప్రసాద్ రెడ్డి (62) కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ మధ్య బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 6గంటలకు చివరి శ్వాస విడిచారు. శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ అనగానే నాగార్జున సినిమాలే గుర్తుకొస్తాయి. 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్ స్థాపించిన శివప్రసాద్ రెడ్డి విక్కీదాదా, శ్రావణసంధ్య, ఆటో డ్రైవర్, సీతారామ రాజు, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, నేనున్నాను,...

మా తమ్ముడు శ్రీనివాస్ స్వతహాగా జగన్ అభిమాని!

video
ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాం..మా తమ్ముడు శ్రీనివాస్ స్వతహాగా జగన్ అభిమాని - సుబ్బరాజు, శ్రీనివాస్ సోదరుడు

దాడి తర్వాత హాస్పిటల్లో జగన్

వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన తర్వాత..జగన్ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నప్పటి చిత్రాలు  

ఇలాంటి పిరికిపంద చర్యలు నా పోరాటాలను ఆపలేవు- జగన్

తనపై జరిగిన దాడిపట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. భగవంతుడి దయ, కోట్లాదిమంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయన్నారు. ఇటువంటి పిరికిపంద చర్యలు తన ఆత్మ విశ్వాసాన్ని , లక్ష్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. ప్రజల కోసం చేస్తున్న తన పోరాటాలను ఇలాంటి దాడులు ఆపలేవన్నారు జగన్. https://youtu.be/4RnOOZ1HA_w  

వైసీపీ అధినేత జగన్ పై దాడి – VIJETHA TV EXCLUSIVE

video
విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగింది. శ్రీనివాస్ అనే వెయిటర్ సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి..జగన్ పై కత్తితో దాడి చేశాడు. వైసీపీకి ఈసారి 160 సీట్లు వస్తాయంటూ జగన్ కి దగ్గరగా వచ్చిన శ్రీనివాస్ అనే కుర్రాడు జగన్ ని కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయం అయ్యింది. ఎయిర్ పోర్ట్ లో ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ వెళ్లారు . ఎయిర్ పోర్ట్ సిబ్బంది శ్రీనివాస్...

విజేత టీవీ..అరచేతిలో వార్తా ప్రపంచం

video
అధునాతన సాంకేతిక ప్రపంచంలో విజేత టీవీ ఓ సంచలనం. తొలి మొబైల్ జనరేషన్ టెలివిజన్ గా ఇప్పటికే పేరుగాంచిన విజేత టీవీ ఎప్పుడూ సామాన్యుడి పక్షమే అని సగర్వంగా ప్రకటిస్తోంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్న అంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అరచేతిలో అన్ని వార్తాంశాలు..అడుగడుగునా సామాన్యుడి గొంతుక..వెరసి విజేత టీవీ. వార్తని ఓ సామాజిక బాధ్యతగా తీసుకొని కొత్త తరానికి దిక్సూచిగా మారనుంది విజేత టీవీ. యువతరానికి ఓ నవనిర్మాణ దీపిక. అన్యాయం, వివక్షతో అన్నింటా నష్టపోతున్న బలహీన ప్రజానీకానికి...

పరిపూర్ణానంద రాజకీయాల్లోకి ఎందుకొచ్చారంటే..?

బలహీనుల జీవితాలు బాగుపడాలంటే ఆధ్యాత్మక శక్తితో పాటు రాజకీయ వేదిక కావాలన్నారు బిజెపి నేత స్వామి పరిపూర్ణానంద. మత్స్యకార గ్రామాల్లోకి వెళ్లినప్పుడు తాను తీవ్రంగా చలించిపోయానన్నారు. అలాంటి బడుగుల జీవితాలు బాగుపడాలంటే కేవలం ఆధ్యాత్మిక శక్తి ఒక్కటే సరిపోదన్నారు. అలాంటి వారికోసమే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. కేవలం ప్రవచనాలతో వ్యవస్థను మార్చలేమని ..ఇందుకోసం ఉన్నత ప్రమాణాలతో నిర్మించే వ్యవస్థ అవసరం అన్నారు పరిపూర్ణ. రాజకీయాల్లో ఇమడాలంటే గాడ్ ఫాదర్ ఉండాలని.. కాని తనకు కేవలం గాడ్ మాత్రమే ఫాదర్ అన్నారు.తీవ్రంగా ఆలోచించిన...

నేతల డ్రామాలు ఓటుతో తిప్పికొట్టండి – విజేత టీవీ

video
పనికిమాలిన నాయకుడిపై పంజా విసురు. విలువైన ఓటుతో తగిన బుద్ధి చెప్పు
[yotuwp type="channel" id="UCydxFV9n2dKG9RfFbdq9rjQ" ]

TRENDING NEWS

GALLERY

FEATURED