Categories
ANDHRA PRADESH

రెడ్ జోన్ జిల్లాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ప్రకటించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను ప్రభుత్వం ప్రకటించింది.

రెడ్‌జోన్‌ జిల్లాలు: కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ

గ్రీన్‌జోన్ జిల్లా : విజయనగరం జిల్లా

Categories
ENTERTAINMENT FEATURED

రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్‌ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. బాలీవుడ్ సీనియర్ హీరో, ప్రస్తుత స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. కేన్సర్‌తో పాటు తాజాగా శ్వాస కోస సమస్య కూడా బాధించడంతో రిషి కపూర్‌ను ఆయన సోదరుడు రణ్‌ధీర్ కపూర్ బుధవారం ఉదయం ఆస్పత్రికి తరలించారు.
ఆమెరికాలో కేన్సర్ చికిత్స పూర్తి చేసుకుని గతేడాది సెప్టెంబర్‌లోనే రిషి భారత్‌కు తిరిగి వచ్చారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రిషి ఈ నెల రెండో తేదీ నుంచి సైలెంట్ అయిపోయారు. ది ఇంటెర్న్ హాలీవుడ్ రీమేక్‌లో దీపికతో కలిసి నటించబోతున్నట్టు ఇటీవల రిషి వెల్లడించిన సంగతి తెలిసిందే. Rishi Kapoor and Irfan Khan https://youtube.com/vijethatv

బుధవారం బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం నుండి పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. 2018లో రిషీకి క్యాన్సర్ బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.ఈ రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు.ఆయ‌న మృతికి సంబంధించిన విష‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్ లో తెలిపారు. అంతేకాదు ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరారు. 1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన రిషీ కపూర్ .. లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండవ కుమారుడు.

1970లో మేరా నామ్ జోక‌ర్ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌య‌మైన రిషి క‌పూర్ ఈ చిత్రానికి గాను నేష‌నల్ అవార్డ్ అందుకున్నారు. ఇక 1973లో బాబీ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించిన ఆయ‌న డింపుల్ క‌పాడియా స‌ర‌స‌న న‌టించాడు. ఈ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డ్ కూడా ద‌క్కింది . 1973-2000 మ‌ధ్య 92 సినిమాలు లీడింగ్ రోల్ చేశాడు. అందులో చాలా చిత్రాలు బాక్సాఫీస్ హిట్ కొట్టాయి. ఇటీవ‌ల 102 నాటౌట్ అనే చిత్రంలో అమితాబ్‌తో క‌లిసి న‌టించారు రిషి. ఇందులో చిన్న‌పిల్ల‌లా న‌టించి అల‌రించారు. చివ‌రిగా ది బాడీ అనే చిత్రంలో న‌టించగా, శ‌ర్మాజీ న‌మ్‌కీన్ చిత్రం సెట్స్ పై ఉంది.

రిషి కూపూర్ 1952 సెప్టెంబ‌ర్ 4న మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించారు. న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అత‌నికి భార్య నీతూ సింగ్‌, పిల్ల‌లు రిద్దిమా క‌పూర్, ర‌ణ్‌భీర్ క‌పూర్ ఉన్నారు. ఇటీవ‌లి కాలంలో రిషీ క‌పూర్ ఎక్కువ‌గా సంచ‌ల‌న ట్వీట్స్‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతూ వ‌చ్చారు. ముక్కు సూటిగా మాట్లాడే ఆయ‌న ధోర‌ణి చాలా మందికి న‌చ్చుతుంది. ఎన్నో అవార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకున్న రిషి క‌పూర్ అభిమానుల ప్రేమ‌ని అంత‌క‌న్నా ఎక్కువ‌గా పొందాడు. రిషి క‌పూర్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో బాలీవుడ్ సినీ పరిశ్ర‌మ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు శోక సంద్రంలో మునిగారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధిస్తున్నారు.

Categories
ANDHRA PRADESH FEATURED NATIONAL

అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై!

వినియోగదారులకు ఊరట, అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై – కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అర్ధరాత్రి ఉత్తర్వులు

★ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

★ దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని తెలిపింది.

★ ఐతే… కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని కేంద్రం తెలిపింది.

★ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి మార్గదర్శనం చేసింది.

★ ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి… తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు.

★ అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు.

★ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు.

★ మరో ముఖ్య విషయమేంటంటే, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు.

★ ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది.

★ ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది.

★ ప్రజలు సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి.

★ లేకపోతే కరోనావైరస్ సామాజిక వ్యాప్తికి దోహదం అవుతుందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కో‌రుతున్నారు.

★ అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు.

★ ఐతే… రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే… ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు.

★ సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి.

★ అలాగే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి.

★ అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

Categories
FEATURED TELANGANA

మే7 వరకు లాక్ డౌన్, కఠిన నియమాలు – కేసీఆర్

తెలంగాణలో మే 7వరకు లాక్ డౌన్-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య -858
ఈ రోజు కొత్తగా నమోదైన కేసులు-18
కరోనా మరణాలు-21
కోలుకుని డిశ్చార్జ్ అయినవారు-186
చికిత్స పొందుతున్నవారు -651
…………….
నాలుగు జిల్లాల్లో కరోనా ప్రభావం లేదు..
వరంగల్ రూరల్,సిద్దిపేట,యాదాద్రి-భువనగిరి,వనపర్తి లలో కరోనా కేసులు నమోదు కాలేదు..
….
దేశంలో 8రోజులకు ఒకసారి కేసులు డబుల్ అవుతున్నాయి..
అదే తెలంగాణలో 10రోజులకు ఒకసారి కేసులు డబుల్ అవుతున్నాయి..

దేశంలో 10లక్షల మందిలో 275మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు..
తెలంగాణలో 10లక్షల మందిలో 375మందికి కరోనా పరీక్షలు చేస్తున్నం..
……
దేశంలో కేంద్రం కొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది.
తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఉండవు.
…..
వ్యవసాయ సంబంధిత ,మెడికల్ సంబంధిత వాటికి సడలింపులు ఇస్తున్నాము..
మిగతావాటికి ఎలాంటి సడలింపులు ఉండవు..
……
మే 1తారీఖు వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గొచ్చు..
ఈ రోజు 458మందిని పరీక్షిస్తే మొత్తం 18మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది..
జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద దెబ్బ తినే అవకాశం ఉంది..
……
విదేశాల నుండి వచ్చినవారంతా డిశ్చార్జ్ అయ్యారు..
ఢిల్లీ నుండి వచ్చినవాళ్ల వలనే కేసులు పెరిగాయి
4ఢిల్లీ కరోనా కేసుల కాంటాక్టులు తెలియాల్సి ఉంది
….
మే 7వరకు లాక్ డౌన్ అమలుల్లో ఉంటుంది.
లాక్ డౌన్ గురించి అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించాం
అత్యధిక శాతం మంది చాలా కఠినంగా ఉండాలని చెప్పారు
మీడియా సంస్థలు చేసిన సర్వేలో కూడా ఇదే వెల్లడి అయింది
అవసరమైతే మే నెలాఖరు వరకు పొడిగించమని చెప్పారు
గతంలో ఉన్న నియమాలే అన్ని ఉంటాయి
అత్యవసర వాటికి మినహాయింపు ఉంటుంది.
లాక్ డౌన్ నియమాలను కఠినంగా అమలు చేస్తాం
….. మే 29 వరకు కరోనా కష్టాలు తప్పవా?
తెలంగాణలో జోమాటా ,స్విగ్గీ సర్వీసులన్నీ రేపటి నుండి బంద్
ఈ రోజు ఆర్డర్ చేసుకున్నవారికి మినహయింపు
డెలివరీ చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఫుడ్ డోర్ డెలివరీ వల్ల ప్రమాదం ఉంటుంది
….
విమాన ప్రయాణికులు దయచేసి తెలంగాణకు రావొద్దు
మే 7వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది
క్యాబ్ సర్వీసులు ఏమి అందుబాటులో ఉండవు
….
పండుగలు,ప్రార్థనలు ఇండ్లల్లోనే జరుపుకోవాలి
అన్ని ఆలయాలు మూసివేశారు.
సామూహిక ప్రార్థనలు,మతపరమైన సమావేశాలకు అనుమతించబడవు
ఇప్పటికే చాలా ఆలయాల్లో దర్శనాలు ఆగాయి
……
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండటం మంచిది కాదు.మనకు గౌరవప్రదం ఉండకూడదు..
స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఈ సమస్య రాకుండా చూడాలి
……
మార్చి నెల వేతనమే ఏప్రిల్ నెలలో ఇస్తాం
వైద్య సిబ్బంది,పారిశుధ్య సిబ్బందికి పదిశాతం ప్రోత్సాహం ఈ నెల కూడా ఇస్తాం
పోలీసు సిబ్బందికి కూడా పది శాతం ప్రోత్సహం ఈ నెల నుండి ఇస్తాం
……
మూడు నెలలు అద్దె చెల్లింపులు వాయిదా
మార్చి,ఏప్రిల్,మే నెల అద్దెలు వసూలు చేయవద్దు
ఇది విజ్ఞప్తి కాదు…ప్రభుత్వం ఆదేశం
వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
వాయిదాలపై వడ్డీలు వసూలు చేయవద్దు
ఎవరైన బలవంతంగా వసూలు చేస్తే 100కి డయల్ చేయండి

ప్రయివేట్ విద్యాసంస్థలు 2020-21ఏడాదికి ఎలాంటి ఫీజులు పెంచకూడదు
ట్యూషన్ ఫీజుల కంటే ఎక్కువగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దు
నెలవారీగా ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి
మరో ఇతర ఫీజులు వసూలు చేయవద్దు
ఇతర ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు
వసూలు చేస్తే ప్రయివేట్ విద్యాసంస్థల అనుమతులు రద్దు చేస్తాం
…..
మే నెలలోనూ ఫ్రీ రేషన్
మే నెల మొదటివారంలోనే రేషన్
మే నెలలో కూడా ఒక్కొక్కరికి 12కేజీల బియ్యం
ఈ నెల మాదిరిగానే మే నెల కూడా 1500ఇస్తాం
……
వలస కార్మికుల కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 12కేజీల బియ్యం
మే నెలలో ఒక్కొక్క వలస కార్మిక కుటుంబానికి 1500ఇస్తాం
……
ఆసరా పెన్షన్లకు ఎలాంటి కోత లేదు..
40లక్షల మందికి ఆసరా పెన్షన్లు యధావిధిగా అందజేస్తాం
ప్రజాప్రతినిధులకు,ఉద్యోగులకు మాత్రం మార్చి మాదిరిగా కోత ఉంటుంది.
పెన్షనర్లకు మాత్రం 75%జీతం అందుతుంది
….మీడియాతో సీఎం కేసీఆర్

Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై ! పోస్ట్ డిలీట్..

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే… వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి కారణం ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన పోస్ట్. ‘పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ వంశీ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

దమ్ముంటే రా తేల్చుకుందాం ..సవాల్

వైసీపీలో కూడా వల్లభనేని వంశీ ఇమడలేకపోతున్నారా? రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వాస్తవానికి వైసీపీలో అధికారికంగా వంశీ చేరపోయినప్పటికీ… ముఖ్యమంత్రి జగన్ కు మద్దతిస్తున్నారు. అసెంబ్లీలో సైతం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీలపై ఆయన చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో వంశీ చేసిన కామెంట్ తో మళ్లీ చర్చ మొదలైంది. వైసీపీ శిబిరంలో వంశీ ఇమడలేకపోతున్నారా? సొంత నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత దక్కలేదా? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు, ఈ పోస్టు వైరల్ అయిన నేపథ్యంలో… దాన్ని వంశీ తొలగించారు.

Categories
FEATURED

2 నెలల్లో కరోనా టీకా! – సీసీఎంబీ డైరెక్టర్

కరోనా మహమ్మారి నివారణకు టీకాను మరో రెండు నెలల్లోనే కనుగొనే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వ్యాఖ్యానించారు. గతంలో పోలియో, రేబిస్ టీకాలను తయారు చేసిన క్రియారహిత (ఇన్ యాక్టివేటెడ్) వైరస్ టీకాపై తాము దృష్టిని సారించామని ఆయన అన్నారు.

కరోనా అంతం ఎప్పుడంటే… క్లిక్ చేసి subscribe చెయ్యండి

టీకా తయారీ విధానాన్ని గురించి వివరించిన ఆయన, తొలుత సజీవ వైరస్ లను ల్యాబ్ లో అధికంగా పెంచుతామని, ఆపైన వాటిపై రసాయనాలు, వేడిని ప్రయోగించడం ద్వారా క్రియారహితం చేసి, ప్రజలకు టీకా రూపంలో వేయాల్సి వుంటుందని అన్నారు. వేడి చేయడం ద్వారా వ్యాధి కారకమైన ప్యాథోజెన్ చనిపోయి, వైరస్ పెరిగే సామర్థ్యం నిలిచిపోతుందని అన్నారు. వీటితో ప్రజలకు ముప్పు ఉండదని, పైగా ఇన్ యాక్టివేటెడ్ వైరస్ టీకా శరీరంలోకి వెళ్లగానే, అది వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని రోగ నిరోధక వ్యవస్థకు అందిస్తుందని అన్నారు.

ఆపై వైరస్ శరీరంపై దాడి చేయగానే, యాండీ బాడీలు భారీగా విడుదలై, వైరస్ పై యుద్ధానికి దిగుతాయని, అనారోగ్యంతో బాధపడేవారు, తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవారు, వృద్ధులకు క్రియా రహిత టీకా ఇవ్వడం సురక్షితమని తెలిపారు. ప్రయోగశాలలో వైరస్ ను పెంచిన తరువాత టీకాల తయారీకి పరిశ్రమలకు కూడా వైరస్ ను ఇస్తామని తెలిపారు.

కాగా, వైరస్ ను వృద్ధి చేయడం ఇక్కడి వాతావరణానికి సవాలేనని, ఆఫ్రికన్ గ్రీన్ కోతి కణాలకు మానవ కణాలకు పోలికలు ఎక్కువగా ఉండటంతో వీటిపై సెల్ వైరస్ కల్చర్ చేస్తున్నామని కణాల్లో వైరస్ వృద్ధి చెందేలా చూస్తున్నామని రాకేశ్ మిశ్రా వెల్లడించారు.

Categories
FEATURED NATIONAL POLITICS

కరోనా ధనవంతుల వ్యాధి.. అంటించారు – సీఎం పళణి స్వామి సంచలన వ్యాఖ్యలు

ప్రపంచాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టేసిన కరోనా వైరస్‌‌ను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ‘ధనవంతుల వ్యాధి’గా అభివర్ణించారు. ధనవంతులే దానిని రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతోందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారానే వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని అన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని సీఎం పేర్కొన్నారు.

దమ్ముంటే ఆపరా , ఎన్నారై సవాల్ – క్లిక్

రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.
కాగా, తమిళనాడులో నిన్న కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

Categories
ANDHRA PRADESH FEATURED LOCAL

మీరు ఈ ఏరియాలో ఉన్నారా? అయితే జాగ్రత్త.

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వివరిస్తూ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం, గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్, బుచ్చయ్య నగర్, జిల్లా పరిధిలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన, కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

కరోనా అంతం ఎప్పుడు? క్లిక్ చేయండి.

వీటితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లా వడమాలపేట, శ్రీకాళహస్తి, ఈ ప్రాంతాలతో పాటు మద్దూరు పరిధిలోని పాణ్యం గ్రామం, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం, నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట, చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం, అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు వచ్చాయని, ఇక్కడి వారంతా తగు జాగ్రత్తల్లో ఉండాలని సూచించింది.