Categories
NATIONAL TECHNOLOGY

జియో ‘కరోనా’ ఆఫర్

ముంబై, విజేత టీవీ :కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జియో తన కస్టమర్లకు మరో ఆఫర్ ప్రకటించింది.

కొత్త వినియోగదారులకు బ్రాడ్​బ్యాండ్ కనెక్టివిటీని ఎలాంటి రుసుం లేకుండా అందించనున్నట్లు తెలిపింది.

ఇదివరకే కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు రెట్టింపు డేటా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

జియో ఫైబర్ కనెక్షన్​ కోసం ఇన్​స్టాలేషన్​ సమయంలో కస్టమర్లు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది.

ఇందులో రూ.1,500 కనెక్షన్ రద్దు చేసుకున్నప్పుడు తిరిగి చెల్లిస్తారు.

ఇప్పటికే 4జీ డేటా ఓచర్లతో రెట్టింపు డేటా ఆఫర్​ను ప్రకటించింది జియో.

ప్రస్తుత పరిస్థితుల్లో… అన్ని సమయాల్లో సేవలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్​ఎల్ ఉచిత బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు, అదనపు డేటా అందిస్తున్నట్లు వారం క్రితమే ప్రకటించాయి.