Categories
ANDHRA PRADESH FEATURED

కరోనా ఎఫెక్ట్ : ఏపీ బంద్

అమరావతి, విజేత టీవీ: సినిమా హాళ్లు, మాల్స్‌ ఈ నెల 31 వరకు మూసివేయాలని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. జాగ్రత్తలు తీసుకోవాలని రెస్టారెంట్లు, బార్లకు సూచించామని, పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఐటీ ఉద్యోగులు సాధ్యమైనంత వరకు వర్క్‌ఫ్రమ్‌ హోం చేయాలని సూచించారు. వ్యాపార సంస్థలు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో కేవలం రెండు కరోనా కేసులే ఉన్నాయని, కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. విజయవాడలో నోడల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని ఆళ్లనాని తెలిపారు.

విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. త్వరలో అనంతపురంలోనూ కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం. 85 వెంటిలేటర్లు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. మరో వంద వెంటిలేటర్లు కూడా తెప్పిస్తున్నాం. ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేయొద్దు. ప్రజారోగ్యంపై ప్రతిపక్షాలది నిర్లక్ష్య వైఖరి. వైద్యరంగం భ్రష్టుపట్టిపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణం. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక రూ.500 కోట్ల బకాయిలు చెల్లించారు. ప్రజల ప్రాణాలపై ప్రతిపక్షానికి శ్రద్ధ లేదు అని ఆళ్లనాని మండిపడ్డారు.