యావత్ భారత్ లాక్ డౌన్, లక్ష్మణ రేఖ గీయండి – ప్రధాని మోడీ

27

ప్రధానమంత్రి దేశం ఉద్దేశించి ప్రసంగం

ఇప్పటి నుండి 21 రోజులు దేశవ్యాప్తంగా లాక్ డౌన్

ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, మొత్తం లాక్ డౌన్

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారు

ప్రజలు దయచేసి ఒకే ఒక పని చేయాలి ,ఆ పని మాత్రం ఇంట్లో ఉండడం అంతే….

ఇది ఒక రకంగా కర్ఫ్యూ అలాంటిదే ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ అర్ధరాత్రి నుండే భారతదేశం మొత్తం లాక్ డౌన్ చేయబడుతుంది.

లాక్ డౌన్ ఒక రకంగా మన దేశానికి లక్ష్మణరేఖ లాంటిది.

రానున్న 21 రోజులు చాలా కీలకం దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి.

ఈ ఇరవై ఒక్క రోజులు మనము జాగ్రత్త తీసుకోకుండా ఉంటే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు.

కరోనా సోకిన వాళ్ళు తొలుత సాధారణ గానే ఉంటారు, కాబట్టి ఇతరులు కలిసే ప్రయత్నం చేయవద్దు. కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది.

కొద్దిరోజులు ఇంటినుండి బయటికి వెళ్ళాలి అనుకునే ఆలోచన దయచేసి మానుకోండి. ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం. బయటికి వచ్చిన వాళ్ళ పైన కేసులు పెట్టడం నిజం.

ఇది కర్ఫ్యూ తరహా వాతావరణం.

జనతా కర్ఫ్యూ కు మించి అమలు చేస్తాము.

లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రమాదం ,కానీ ప్రజల ప్రాణాలు మన దేశానికి ముఖ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here