Categories
FEATURED

చెస్ దిగ్గజంపై కరోనా ఎఫెక్ట్!

ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీలో చిక్కుకుపోయారు. యూరప్ దేశం జర్మనీపై కరోనా వైరస్ పంజా విసిరడంతో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలను వారి ఇళ్లకే పరిమితం చేశారు. మరోవైపు కరోనా భయాలతో అక్కడి నుంచి విమాన సర్వీసులను భారత్ రద్దు చేసింది. విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీలో చిక్కుకుపోయారు.

జర్మనీలోని బుండెస్లిగాలో చెస్ టోర్నమెంటులో పాల్గొనేందుకు విశ్వనాథన్ ఆనంద్ అక్కడకు వెళ్లారు. ఈ రోజు ఆయన తిరిగి రావాల్సి ఉంది. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా ఆనంద్ భార్య అరుణ మాట్లాడుతూ, ఆయన ఎప్పుడు వస్తారా అని తాను కూడా ఎదురు చూస్తున్నానని చెప్పారు. కరోనా మరింత విస్తరించకుండా విమాన సర్వీసులను రద్దు చేయడం మంచిదేనని ఆమె అభిప్రాయపడ్డారు.