Categories
ENTERTAINMENT FEATURED

రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్‌ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. బాలీవుడ్ సీనియర్ హీరో, ప్రస్తుత స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. కేన్సర్‌తో పాటు తాజాగా శ్వాస కోస సమస్య కూడా బాధించడంతో రిషి కపూర్‌ను ఆయన సోదరుడు రణ్‌ధీర్ కపూర్ బుధవారం ఉదయం ఆస్పత్రికి తరలించారు.
ఆమెరికాలో కేన్సర్ చికిత్స పూర్తి చేసుకుని గతేడాది సెప్టెంబర్‌లోనే రిషి భారత్‌కు తిరిగి వచ్చారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రిషి ఈ నెల రెండో తేదీ నుంచి సైలెంట్ అయిపోయారు. ది ఇంటెర్న్ హాలీవుడ్ రీమేక్‌లో దీపికతో కలిసి నటించబోతున్నట్టు ఇటీవల రిషి వెల్లడించిన సంగతి తెలిసిందే. Rishi Kapoor and Irfan Khan https://youtube.com/vijethatv

బుధవారం బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం నుండి పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. 2018లో రిషీకి క్యాన్సర్ బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.ఈ రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు.ఆయ‌న మృతికి సంబంధించిన విష‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్ లో తెలిపారు. అంతేకాదు ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరారు. 1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన రిషీ కపూర్ .. లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండవ కుమారుడు.

1970లో మేరా నామ్ జోక‌ర్ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌య‌మైన రిషి క‌పూర్ ఈ చిత్రానికి గాను నేష‌నల్ అవార్డ్ అందుకున్నారు. ఇక 1973లో బాబీ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించిన ఆయ‌న డింపుల్ క‌పాడియా స‌ర‌స‌న న‌టించాడు. ఈ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డ్ కూడా ద‌క్కింది . 1973-2000 మ‌ధ్య 92 సినిమాలు లీడింగ్ రోల్ చేశాడు. అందులో చాలా చిత్రాలు బాక్సాఫీస్ హిట్ కొట్టాయి. ఇటీవ‌ల 102 నాటౌట్ అనే చిత్రంలో అమితాబ్‌తో క‌లిసి న‌టించారు రిషి. ఇందులో చిన్న‌పిల్ల‌లా న‌టించి అల‌రించారు. చివ‌రిగా ది బాడీ అనే చిత్రంలో న‌టించగా, శ‌ర్మాజీ న‌మ్‌కీన్ చిత్రం సెట్స్ పై ఉంది.

రిషి కూపూర్ 1952 సెప్టెంబ‌ర్ 4న మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించారు. న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అత‌నికి భార్య నీతూ సింగ్‌, పిల్ల‌లు రిద్దిమా క‌పూర్, ర‌ణ్‌భీర్ క‌పూర్ ఉన్నారు. ఇటీవ‌లి కాలంలో రిషీ క‌పూర్ ఎక్కువ‌గా సంచ‌ల‌న ట్వీట్స్‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతూ వ‌చ్చారు. ముక్కు సూటిగా మాట్లాడే ఆయ‌న ధోర‌ణి చాలా మందికి న‌చ్చుతుంది. ఎన్నో అవార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకున్న రిషి క‌పూర్ అభిమానుల ప్రేమ‌ని అంత‌క‌న్నా ఎక్కువ‌గా పొందాడు. రిషి క‌పూర్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో బాలీవుడ్ సినీ పరిశ్ర‌మ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు శోక సంద్రంలో మునిగారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధిస్తున్నారు.