Tuesday, July 27, 2021
Home Crime Corner ఓ మర్డర్ రేటు 6వేల కోట్లా?

ఓ మర్డర్ రేటు 6వేల కోట్లా?

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య వెనుక
దాచేస్తే దాగని నిజాలు:

6 వేల కోట్ల భూముల కుంభకోణంపై హైకోర్టులో PIL వేసినందుకు ఈ ఇద్దరిని నిర్మూలించినట్టు అనుమానాలు కలుగుతున్నవి.

పోలీసులు ఈ దిశగా దర్యాప్తు జరిపే అవకాశం ఉందా?

పుట్ట మధు పాత్రపై బలపడుతున్న అనుమానాలు?

  1. న్యాయవాద దంపతుల హత్యకు ముందు, తర్వాత కూడా తన మేనమామ,ZP చైర్మన్ పుట్ట మధు వెంటే బిట్టు శ్రీను ఉన్నాడు.
  2. హత్యలు జరగడానికి కొద్ది సేపటి ముందు కుంటా శ్రీనివాస్, పుట్ట మధు కార్యక్రమాల నుంచి వెళ్లిపోయాడు.
  3. “పనైపోయిందా ? ఫినిషా ? “అని హత్యానంతరం నిముషం వ్యవధిలోనే బిట్టు శ్రీను, కుంటా శ్రీనివాస్ కు కాల్ చేసి అడిగాడు.ఫోన్ కాల్స్ ను పోలీసులు ట్రేస్ చేసినట్టు సమాచారం అందుతున్నది.
  4. వామన్ రావు దంపతుల హత్యపై బిట్టు శ్రీను ఆరా తీస్తున్నప్పుడు, అతని పక్కనే పుట్ట మధు ఉన్నట్టు తెలియవచ్చింది.
  5. ‘ఫినిష్ చేశారా’ అని బిట్టు శ్రీను, కుంటా శ్రీనివాస్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు పుట్ట మధు వినలేదా?
  6. బిట్టు శ్రీనుతో, హత్యల సమాచారం పుట్టమధే ధృవీకరించుకున్నారా ??
  7. ఈ కేసులో పుట్ట మధు, ఆయన భార్య పుట్ట శైలజను పోలీసులు ప్రశ్నించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు?
  8. హత్యకేసులో ప్రధాన నిందితుడు కుంటా శ్రీనివాస్, పుట్ట ప్రధాన అనుచరుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో కుంటాకు,పుట్ట కేకు తినిపించిన దృశ్యాలు చెబుతూ ఉన్న సాక్ష్యం ఏమిటి?
  9. పుట్టమధు మేనల్లుడు బిట్టు శ్రీను తన మేన మామ భరోసా లేకుండానే నిందితులకు కార్లు, కత్తులు, కొడవళ్ళు సరఫరా చేసి ఉంటాడా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments