Wednesday, July 28, 2021
Home Crime Corner హైదరాబాద్ లో భారీ మోసం...!

హైదరాబాద్ లో భారీ మోసం…!

ఉద్యోగాల పేరుతో సైబర్ మోసం జరిగిందని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్ ని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలిపారు. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ కి చెందిన శివ కుమార్..ఆన్లైన్ యాడ్ చూసి ఉద్యోగం కోసం యత్నించాడు అని వివరించారు. ఉద్యోగం కోసం ఆన్లైన్ లో 50 వేల రూపాయలు బాధితుడు ట్రాన్స్ఫర్ చేసాడు అని పేర్కొన్నారు.

అనంతరం మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు…. వెస్ట్ బెంగాల్ కలకత్తాకి చెందిన హర్షవర్ధన్ మిశ్రా… కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసారు. నిందితుడు దేశవ్యాప్తంగా సుమారు 3 వేల మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisment -

Most Popular

Recent Comments