Tuesday, July 27, 2021
Home Crime Corner ఆస్తి కోసం అన్ననే అడ్డంగా నరికారు

ఆస్తి కోసం అన్ననే అడ్డంగా నరికారు

రంగారెడ్డి శంక‌ర్ ప‌ల్లిలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం అన్నను అతి దారుణంగా త‌మ్ముళ్లు చంపేశారు. భూవివాదంలో సొంత అన్నని తమ్ముళ్లు హతమార్చారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని టంగుటూరు గ్రామం లో భూమి విష‌యంలో అన్న‌ద‌మ్ముళ్ల మ‌ద్య వివాదం చోటు చేసుకుంది. సంఘటన స్థ‌లానికి చేరుకున్న శంకర్ పల్లి పోలీసులు ఈ మేరకు విచారణ చేస్తున్నారు.

టంగుటూరు గ్రామానికి చెందిన సురగళ్ల యాదయ్య(50)కు, ఇద్ద‌రు తమ్ముళ్లు పాండు, రాజుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది అని పోలీసులు వివరించారు. ఈరోజు ఉదయం భూమి వద్ద గొడవ జరుగుతుండగా యాదయ్య పై పాండు.. శ్రీనివాస్ లు కత్తితో దాడి చేసి హతమార్చారు అని పోలీసులు వివరించారు. అనంతరం శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో నిందితులు లొంగిపోయారు అని పేర్కొన్నారు. శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

- Advertisment -

Most Popular

Recent Comments