Categories
FEATURED NATIONAL WORLD

WHO : స్వైన్‌ ఫ్లూ కంటే పదిరెట్లు ప్రమాదకారి!


డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ స్వైన్‌ ఫ్లూ కంటే పది రెట్లు ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కరోనా వైరస్ ఎంతో ప్రమాదకారి అని, వేగంగా వ్యాప్తి చెందుతుందని మనందరికీ తెలుసు. అయితే, ఇది స్వైన్‌ ఫ్లూ కంటే పదిరెట్లు వేగంగా వ్యాపిస్తుందని, జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ వైరస్‌ సోకిన వారిని నిర్భందంలో ఉంచడం ఎంతో ముఖ్యమని సూచించింది. వైరస్‌ బాధితులకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించడం సవాలుతో కూడుకున్న పని అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్ అధానోమ్‌ తెలిపారు.

https://youtu.be/tEWiO6fzK44

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించాలని ప్రపంచ దేశాలను యునైటెడ్ నేషన్స్‌ ఆరోగ్య సంస్థ కోరిన నేపథ్యంలో తాజాగా డబ్ల్యూహెచ్‌వో చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది. ‘‘మనకు ఏం తెలుసో అది మాత్రమే చెప్తాం. మనకు తెలిసిన దాని గురించే పని చేయగలం. వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది, దాని తీవ్రత ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కొవాలనే అనేదానికి ఇప్పటికే పలు దేశాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. అలానే కొన్ని దేశాల్లో ప్రతి మూడు నాలుగు రోజులకు కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. అయితే, వైరస్‌ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంత నెమ్మదిగా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.’’ అని టెడ్రస్ అన్నారు.

Categories
NATIONAL WORLD

కరోనా లేని రహస్య ప్రాంతమొకటి ఉంది!

ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టేసింది. ఇప్పటికే 192 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాపించింది. ఈ వైరస్ ధాటికి వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నేలచూపు చూస్తోంది. ఈ వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రతి దేశం చేయని కృషంటూ లేదు. అయినప్పటికీ ఈ మహమ్మారి వైరస్‌ వ్యాప్తిని నియంత్రించలేక తలలు పట్టుకుంటున్నాయి. 

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ కరోనా వైరస్ బారినపడకుండా ఉండే దేశాలు ఈ భూమిపై కొన్నివున్నాయి. అలాంటి దేశాల్లో పలావు ద్వీపం కూడా ఒకటి. ఇది ఉత్తర పసిఫిక్‌లో ఉంది. ఇక్కడి జనాభా సుమారు 18,000. కానీ, ఇప్పటికీ ఒక్క కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసు కూడా పలావు ద్వీపంలో నమోదు కాలేదు. 

విస్తారమైన పసిఫిక్‌ మహాసముద్రంలో ఒక్క బిందువుగా కనిపించే ఈ ద్వీపానికి సమీప పొరుగు ప్రాంతాలు కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. వైరస్‌కు వ్యతిరేకంగా బఫర్‌గా ఈ ద్వీపం పనిచేసింది. టోంగా, సోలమన్‌ దీవులు, మార్షల్‌ దీవులు, మైక్రోనేషియాతో సహా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమకు కరోనా విస్తరించకుండా విధించుకున్న కఠినమైన ప్రయాణ ఆంక్షలు ఆయా దేశాల్లో కరోనా కాలుమోపకుండా చేసిందని చెప్పొచ్చు. 

Categories
FEATURED WORLD

లీప్ ఇయర్ : 29వ తేదీ ..ఎక్స్‌ట్రా డే ఎందుకు? ఫిబ్రవరిలోనే ఎందుకు?

Leap Year : ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది. ఇందుకు సైంటిఫిక్ కారణాలున్నాయి. ఐతే… ఈ అదనపు రోజు ఎందుకు కలుస్తోంది? ఫిబ్రవరిలోనే ఎందుకు అన్నది తెలుసుకుందాం.

Leap Year : ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి. అందువల్ల ఉద్యోగులు ఫిబ్రవరిలో తమకు 28 రోజులకే శాలరీ వస్తుందని, త్వరగా వస్తుందని అనుకుంటారు. అదే లీప్ ఇయర్ వస్తే… ఫిబ్రవరిలో 29వ తేదీ కూడా ఉంటుంది. అందువల్ల శాలరీపొందేందుకు మరో రోజు ఆలస్యమవుతుంది. దీనిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. నిజానికి ఫిబ్రవరిలో 29వ తేదీ ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఏడాది ఆయుష్షులో…. అదనంగా మరో రోజు జీవించినట్లే అంటున్నారు. అసలు ఈ ఎక్స్‌ట్రా డే ఎందుకుంటుందో సింపుల్‌గా తెలుసుకుందాం. మీకు తెలుసు… భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని. ఇలా ఓ రౌండ్ తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. ఈజీగా చెప్పాలంటే… 365 రోజులకు తోడు మరో పావు రోజు పడుతుంది. ఆ పావు రోజును ఒక రోజుగా తీసుకోలేం కాబట్టి… ప్రతీ నాలుగేళ్లలో నాలుగు పావు రోజుల్ని కలిపి… ఒక రోజుగా మార్చి… లీప్ ఇయర్‌లో ఫిబ్రవరి నెలలో అదనపు రోజును చేర్చుతున్నారు.

ఫిబ్రవరిలోనే అదనపు రోజు ఎందుకు కలుపుతున్నారు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయి కాబట్టి కలుపుతున్నారని అనుకోవచ్చు కూడా. అది నిజమే కానీ… ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకున్నాయన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఉంది. క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్‌లు… కేలండర్‌లో రోజుల్నీ, నెలలనూ ఇష్టమొచ్చినట్లు మార్చేసేవాళ్లు. ఉదాహరణకు రోం చక్రవర్తిగా జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికి రోమన్ క్యాలెండర్‌‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి. ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఆయన ఎంటరయ్యాక… కేలండర్‌లో చాలా మార్పులు చేశారు. తద్వారా 365 రోజుల కేలండర్ వచ్చింది. అలాగే… ప్రతీ నాలుగేళ్లకూ అదనపు రోజును… ఆగస్టు నెలలో కలిపారు. ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు, జులైకి 31 రోజులు, ఆగస్టుకు 29 రోజులు వచ్చాయి.

జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్టస్… చక్రవర్తి అయ్యాడు. ఆయన పుట్టింది ఆగస్టులో. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండటాన్ని ఇష్టపడలేదు. ఆగస్టు నెలకు 2 రోజులు పెంచుకున్నాడు. జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి… ఫిబ్రవరిలో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులూ వచ్చాయి. అప్పటి నుంచీ లీపు సంవత్సరంలో 1 రోజును ఆగస్టుకి కాకుండా… ఫిబ్రవరికి కలపడం మొదలుపెట్టారు. అదీ విషయం. ఇప్పట్లో ఈ కేలండర్‌ను మార్చే ఉద్దేశాలు ప్రపంచ దేశాలకు లేవు. అందువల్ల ప్రతిసారీ లీప్ ఇయర్‌లో ఫిబ్రవరికి 1 రోజు యాడ్ అవుతుంది.

Categories
WORLD

చైనా కరోనాకి ఉత్తరకొరియా విరుగుడు!

చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయకంపితులను చేస్తోంది. ముఖ్యంగా, చైనాలో ఈ వైరస్ ధాటికి మృత్యుకేళి కొనసాగుతోంది. అలాగే, పలుదేశాల్లో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో అయితే ప్రతి రోజూ ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్యకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. 

ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉత్తర కొరియా కఠినంగా ఆంక్షలను అమలు చేస్తోంది. ఇందుకోస సైనిక చట్టాలను సైతం అమలు చేస్తోంది. గతంలో చైనాలో మొదలైన సార్స్ వైరస్‌ను నిరోధించడానికి ఉత్తర కొరియా కఠిన నిబంధనలు అమలు చేసిన విషయం తెలిసిందే. ఇపుడు అలాంటి కఠిన చట్టాలనే అమలు చేస్తోంది. 

ఇటీవల చైనాకు వెళ్లి వచ్చిన ఓ అధికారికి కరోనా వైరస్ సోకిందన్న కారణంగా కాల్చివేసిందని.. పొరుగుదేశమైన దక్షిణ కోరియా మీడియా గురువారం ఓ వార్తను ప్రచురించింది. అ అధికారి విధి నిర్వహణలో భాగంగా ఇటీవల చైనాకు వెళ్లి రావడంతో ఉత్తర కొరియా అధికారులు ఆ అధికారిని తొలుత నిర్బంధించారు. అయితే ఆ అధికారి ఓ పబ్లిక్ బాత్ రూంలో స్నానం చేయడానికి వెళుతున్న సమయంలో అధికారులు గుర్తించి కాల్చి వేశారని దక్షిణ కొరియా మీడియా కథనం.

అలాగే, చైనా నుంచి వచ్చిన వారిని, చైనా ప్రజలను నిర్బంధించాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీచేశారు. చైనాతో సరిహద్దులను మూసివేశారు. రోడ్డు మార్గాలు మూసివేయడమో లేక కఠిన నిషేధాలు అమలు చేయడమో అమలు చేస్తోంది. పర్యాటకులను నిషేధించింది. కరోనా వైరస్ చాయలు తమదేశంలోకి రాకుడదన్న సంకల్పంతో దేశలో సైనిక చట్టాలను అమలు చేస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. చర్యలు ఎలా ఉంటాయన్నది తాజా ఘటనతో ప్రపంచానికి చాటింది. 

Categories
NATIONAL WORLD

ట్రంప్ ఇండియా వచ్చి ఏం చేస్తాడట!?

ఢిల్లీ, విజేత టీవీ : భారత పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తన పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు జరగబోతున్నాయనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో మాత్రమే పర్యటన కొనసాగాలని తొలుత భావించినప్పటికీ. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కూడా పర్యటించాలని ట్రంప్ నిర్ణయించారు.
ఈ సందర్భంగా వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ గొప్ప జంటిల్మన్ అని కితాబిచ్చారు. అమెరికాతో కలసి ఎంతో చేయాలని భారత్ భావిస్తోందని. అవసరమైన అన్ని ఒప్పందాలు చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని… భారత్ లో కలిసి ముందుకు సాగుతామని చెప్పరు.
గత ఏడాది అమెరికాలో మోడీ పర్యటించినప్పుడు హ్యూస్టన్ స్టేడియంలో భారీ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 50 వేల మంది ఇండో-అమెరికన్లు వచ్చిన ఆ సభకు ట్రంప్ కూడా హాజరయ్యారు. దీనిపై ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు. 50 వేల మంది మాత్రమే రావడం తనకు తృప్తిని కలిగించలేదని. అందుకే, అహ్మదాబాద్ లో ఎయిర్ పోర్ట్ నుంచి స్టేడియం వరకు తనకు, మోడీకి కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల మంది స్వాగతం పలుకుతారని చెప్పారు. మీకు తెలుసు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అహ్మదాబాద్ స్టేడియం. మోడీ దాన్ని నిర్మిస్తున్నారు. దాని నిర్మాణం ఇప్పటికే దాదాపుగా పూర్తైంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అది అని వ్యాఖ్యానించారు.
నిన్ననే మోడీతో తాను మాట్లాడానని. తన ఇండియా పర్యటనపై ఇరువురం చర్చించుకున్నామని ట్రంప్ తెలిపారు. అహ్మదాబాద్ లో తనకు స్వాగతం పలికేందుకు వేలాది మంది ఆతృతగా ఉన్నారని మోడీ తనతో చెప్పారని అన్నారు.
మరోవైపు, అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంను 100 బిలియన్ అమెరికన్ డాలర్లతో నిర్మిస్తున్నారు. ఈ స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలోని బెల్బోర్న్ క్రికెట్ స్టేడియం కంటే ఈ మొతేరా క్రికెట్ స్టేడియం పెద్దది కావడం గమనార్హం…

Categories
ANDHRA PRADESH WORLD

చైనా టు వైజాగ్ షిప్ లో కరోనా కూడా వచ్చిందా?

విశాఖ పోర్టు ట్రస్ట్ లో అధికారుల నిర్లక్ష్యం.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై జాగ్రత్తలు వహిస్తుంటే… విశాఖ పోర్టు ట్రస్టులో పట్టించుకోని పోర్ట్ యంత్రాంగం.

అల్యూమినియం లోడ్ తో విశాఖ పోర్టుకు చేరుకున్న చైనా నౌక యం.వి. ఫార్చ్యూన్ సన్.

నౌకతో పాటు విశాఖకు వచ్చిన చైనాకు చెందిన 20 మంది సిబ్బంది.

చైనా కు చెందిన 20 మందిలో కరోనా వ్యాధి లక్షణాలపై పరిక్షలు చేసేందుకు కూడా… కనీసం స్క్రీనింగ్, వైద్యపరీక్షలు కూడా ఏర్పాట్లు చేయని పోర్టు యాజమాన్యం.

పోర్టుకు నౌక చేరిన 12 గంటల తర్వాత అప్రమత్తమైన పోర్టు హెల్త్ ఆఫీసర్.

కనీసం ఫోనులకు కూడా స్పందించని పోర్టు అధికారులు.

Categories
FEATURED WORLD

విజృంభించిన కరోనా, చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ.

చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా వ్యాధిగ్రస్తులై మృతి చెందిన వారి సంఖ్య 106కు పెరిగింది.

సుమారు 4 వేల మందికిపైగా జనంలో కరోనా లక్షణాలను కనుగొన్నట్లు‌ వైద్యు‌లు పేర్కొ‌న్నా‌రు. దీంతో చైనాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. పలు నగరాలకు రవాణా వ్యవస్థ నిలిపివేశారు.

చైనాలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్సనందిస్తున్నారు. భారత్‌కు కూడా కరోనా వైరస్‌ వ్యాపించినట్లు భావిస్తున్నారు.

ఇండో-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్

కరోనావైరస్ కారణంగా ఇండో-నేపాల్ సరిహద్దులోని బీహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద వైద్య బృందాలను మోహరించాయి. నేపాల్‌తో సరిహద్దులు పంచుకునే అన్ని జిల్లాలు అప్రమత్తమయ్యాయి. డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు తొందరగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. నేపాల్‌లో ఇప్పటికే 1-2 కేసులు నమోదయ్యాయి. వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నేపాల్లో ఈ కరోనావైరస్ ఎక్కువగా వ్యాపిస్తే అది మనందరికీ హెచ్చరిక అని డాక్టర్లు అంటున్నారు.

Categories
FEATURED WORLD

కరోనా వైరస్ సోకితే అంతేనా?

కరొనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

చైనాలో వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కరొనా వైరస్ గురించి వైద్య నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. కరొనా అనే క్రిమి ద్వారా వ్యాపిస్తున్న ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రతి ఒక్కరికి కచ్చితమైన అవగాహన ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

​కరొనా వైరస్ గురించి..

కరొనా వైరస్ అనేది కొన్ని వైరస్‌ల సమూహం అని చెప్పొచ్చు. దీని గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే.. కొన్ని కరొనా వైరస్‌లు జంతువులకు మాత్రమే వ్యాపిస్తాయి.. కానీ, ఇందులోనే కొన్ని వైరస్‌లు మానవులను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది వ్యాపించిందంటే చాలు.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇదే ప్రభావం తీవ్రమైతే న్యూమోనియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. అనేక ఇందులో ప్రాణాంతక అనేక క్రిములు ఉన్నాయి.

​ఎలా వ్యాపిస్తుందంటే..

కరొనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 • సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది.
 • ఇది దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.
 • శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
 • వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.. అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.
 • మలం ద్వారా తక్కువనే చెప్పాలి.

​వైరస్ లక్షణాలు..

దీని లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయి. ఒక్కో సమయంలో మీకు వ్యాధి తీవ్రత ఎలా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండడమే కాకుండా మరి కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.

 • జలుబు
  *తలనొప్పి
 • దగ్గు
 • మోకాలి నొప్పులు
 • జ్వరం
 • పూర్తిగా అనారోగ్యం

​ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది..

కరొనా వైరస్‌లు శరీరంలో ప్రవేశించిన అనంతరం అనేక తీవ్ర లక్షణాలను చూపుతుంది. ఇది కొన్ని సార్లు మిగతా సమస్యలకు కూడా కారణం అవుతుంది. న్యూమోనియా వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.
దీంతో పాటు.. కఫంతో కూడిన దగ్గు ఉంటుంది..
ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది.
ఛాతీ దగ్గర నొప్పిగా ఉంటుంది.
గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.

​కరొనా వైరస్‌ని ఎలా గుర్తించాలి..

ఈ వైరస్‌ని గుర్తించడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు..
శారీరక పరీక్ష ద్వారా..
రక్త పరీక్ష ద్వారా ఈ వైరస్‌ని గుర్తించొచ్చు.
కఫం, గొంతు శుభ్రపరుచు, ఇతర శ్వాస పరీక్షల ద్వారా వీటి ఆధారంగా వైరస్‌ని గుర్తించొచ్చు..

​చికిత్స విధానం ఏంటి..?

కరొనా వైరస్ వ్యాపించిందింటే కొన్ని రకాల ట్రీట్‌మెంట్ ద్వారా దీనికి చికిత్స చేయొచ్చు.

 • నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు. అయితే, పిల్లలకు మాత్రం, ముఖ్యంగా నాలుగేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు, ఆస్పిరిన్ ఇవ్వకూడదు.
  ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
  నీరు ఎక్కువగా తాగుతుండాలి.

​వైరస్‌ని నివారించవచ్చా..

మానవులలో ప్రవేశించిన కరొనా వైరస్‌కి ప్రజెంట్ చికిత్స విధానమంటూ ఏం లేదు. కానీ, ఇది వ్యాప్తి చెందకుండా మాత్రం నిరోధించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించొచ్చు. అందుకోసం ఇలా చేయండి.

 • ఎప్పటికప్పుడూ చేతులను సబ్బునీటితో కడగాలి.
 • చేతలను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు..
 • అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
 • మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి..