Categories
ANDHRA PRADESH CRIME FEATURED VIDEOS

ముగ్గువేస్తుండగా అమ్మాయి కిడ్నాప్ యత్నం!

గుంటూరు జిల్లా బాపట్లలో ముగ్గు వేస్తున్న అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేయబోయారు. బైక్ పై వచ్చిన ఇద్దరు అమ్మాయి అపహరణకు ప్రయత్నించగా చుట్టుపక్కల వాళ్లు వచ్చి అమ్మాయిని కిందికి లాగేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు బైక్ పై పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Categories
ANDHRA PRADESH CRIME POLITICS VIDEOS

తిరుమలలో బాలుడి కిడ్నాప్ సీసీటీవీ దృశ్యాలు

తిరుమల వెంకన్న సాక్షిగా బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. చిన్నారిని ఎత్తుకొని వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా తిరుమల పోలీసులు కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు.

Categories
ANDHRA PRADESH FEATURED VIDEOS

ఇదేం శిక్ష! బట్టలు లేకుండా నిలబెట్టిన టీచర్లు !

స్కూలుకి లేటుగా వెళ్లారు. అదే ఈ చిన్నారులు చేసిన తప్పు. అందుకు టీచర్లు శిక్ష విధించారు. బట్టలు విప్పించి ఎండలో వరుసగా నిలబెట్టించారు. చిత్తూరు జిల్లాలోని చైతన్య భారతి స్కూలులో జరిగింది ఈ ఘటన.

Categories
ANDHRA PRADESH POLITICS VIDEOS

నీరుకొండలో భారీ ఎన్టీఆర్ విగ్రహం!

నీరుకొండలో నిర్మించనున్న ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం నమూనా ఇదే.

[yotuwp type=”videos” id=”8mqkavXAR9Q” ]

Categories
ENTERTAINMENT FEATURED GALLERY MOVIES VIDEOS

103 ఏళ్ల బామ్మ కలనెరవేర్చిన మహేశ్ బాబు

ప్రిన్స్ మహేశ్ బాబు తన అభిమాని చిరకాల వాంఛ నెరవేర్చాడు. అభిమాని అంటే 16 ఏళ్ల కుర్రాడో కాదు..103 ఏళ్ల వయసున్న బామ్మ. ఎన్నో ఏళ్లనుండి బామ్మకి మహేశ్ బాబుని కలవాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఎన్నిసార్లు ఎంతమందిని అడిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ బాబు..తను మహర్షి సెట్స్ లో ఉండగా..బామ్మని కలిసి ఆప్యాయంగా పలకరించాడు. అంతే బామ్మ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

[yotuwp type=”videos” id=”u6p6D9639vE” ]

Categories
ANDHRA PRADESH ENTERTAINMENT FEATURED GALLERY MOVIES TELANGANA VIDEOS

చిరంజీవిని చూసి ఏడ్చిన పల్లెకోయిల బేబి

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పల్లెకోయిలగా వైరల్ అయిన పేరు పసల బేబి. తూర్పు గోదావరి జిల్లా వడిశలేరు గ్రామం. ఓ చెలియా నా ప్రియ సఖియా అంటూ ఆమె పాడగా మొబైల్ కెమెరాలో చిత్రీకరించి అప్ లోడ్ చేశారు. ఆ చిన్న వీడియోనే ప్రపంచ వ్యాపితమై..ఏఆర్ రెహమన్ ప్రశంసలు అందుకునే స్థాయికి చేరుకుంది.

ఆ టాలెంట్ ఇప్పుడు తెలుగు సినీ ప్రముఖుల్ని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సంగీత దర్శకుడు కోటి ఆమెకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రఘుకుంచె ఓ బేబి చేత ఓ పాటను పాడించారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి అక్కడితో ఆగిపోకుండా..పల్లెకోయిల బేబిని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకుపోయారు.

చిరంజీవిని చూసిన వెంటనే..బేబి ఆయన కాళ్లమీద పడి ఏడ్చిందితన అభిమాన హీరో చిరంజీవిని కలవడంతో భావోద్వేగానికి లోనైంది. చిరంజీవి, ఆయన భార్య సురేఖ ఇద్దరూ బేబితో చాలాసేపు ముచ్చటించారు. ఆమె గానమాధుర్యాన్ని అభినందించారు.

ఆ ముచ్చట్లు..బేబి పాడిన పాటలు మీకోసం

[yotuwp type=”videos” id=”tCUshGy2Inw” ]

వడిశలేరు బేబి తొలిసారిగా మొబైల్ లో పాడిన పాట ..మీకోసం

[yotuwp type=”videos” id=”Ove4UGfP23o” ]

Categories
ANDHRA PRADESH ENTERTAINMENT FEATURED NATIONAL POLITICS TELANGANA VIDEOS

యంగ్ న్యూస్ టెలివిజన్ విజేత టీవీకి సబ్ స్క్రైబ్ అవ్వండి!

అధునాతన సాంకేతిక ప్రపంచంలో విజేత టీవీ ఓ సంచలనం
. తొలి మొబైల్ జనరేషన్ టెలివిజన్ గా ఇప్పటికే పేరుగాంచిన విజేత టీవీ ఎప్పుడూ సామాన్యుడి పక్షమే అని సగర్వంగా ప్రకటిస్తోంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్న అంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అరచేతిలో అన్ని వార్తాంశాలు..అడుగడుగునా సామాన్యుడి గొంతుక..వెరసి విజేత టీవీ. వార్తని ఓ సామాజిక బాధ్యతగా తీసుకొని కొత్త తరానికి దిక్సూచిగా మారనుంది విజేత టీవీ. యువతరానికి ఓ నవనిర్మాణ దీపిక. అన్యాయం, వివక్షతో అన్నింటా నష్టపోతున్న బలహీన ప్రజానీకానికి బలమైన వేదిక నిర్మిస్తోంది విజేత టీవీ.

► VIJETHA TV

A Next Gen News TV delivers accurate and young news without colors and drama from every corner of the Globe. As Breaking News is meant for sensation, VIJETHA TV breaks the silence and stands for the broken hearts.

No Manipulation..No Manufacturing Consent
No Hidden Agendas..No Conspiracy theories
Simply News at fingertips

For More Updates
► VIJETHA WEB : http://vijethatv.in
► FACEBOOK : https://www.facebook.com/vijethanews/
► YOUTUBE : https://www.youtube.com/channel/UCydxFV9n2dKG9RfFbdq9rjQ
► TWITTER : https://twitter.com/vijethanews
► PINTEREST : https://in.pinterest.com/vijethanews/
► INSTAGRAM : https://www.instagram.com/vijethanews/

Categories
ENTERTAINMENT FEATURED MOVIES VIDEOS

చరణ్, తారక్..రెడీ..యాక్షన్

రాజమౌళి, రామ్ చరణ్, తారక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా RRR సెట్స్ పైకి వెళ్లింది. స్టార్ట్ , కెమెరా, యాక్షన్ అంటున్న రాజమౌళి వీడియో ఒకటి యూనిట్ రిలీజ్ చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి రాజమౌళి ట్విట్టర్ లో షేర్ చేశారు.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నవంబర్ 11న ముహూర్తపు షాట్ పడింది. నవంబర్ 19నుంచి అధికారికంగా చిత్రీకరణ ప్రారంభమైంది. RRR సినిమా కోసం హైదరాబాద్ శివారులో భారీ సెట్లు వేస్తున్నారు. అంతేకాదు రాజమౌళి తనకు సౌలభ్యంగా ఉంటుందని తాత్కాలికంగా ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.