Categories
FEATURED TELANGANA

మే7 వరకు లాక్ డౌన్, కఠిన నియమాలు – కేసీఆర్

తెలంగాణలో మే 7వరకు లాక్ డౌన్-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య -858
ఈ రోజు కొత్తగా నమోదైన కేసులు-18
కరోనా మరణాలు-21
కోలుకుని డిశ్చార్జ్ అయినవారు-186
చికిత్స పొందుతున్నవారు -651
…………….
నాలుగు జిల్లాల్లో కరోనా ప్రభావం లేదు..
వరంగల్ రూరల్,సిద్దిపేట,యాదాద్రి-భువనగిరి,వనపర్తి లలో కరోనా కేసులు నమోదు కాలేదు..
….
దేశంలో 8రోజులకు ఒకసారి కేసులు డబుల్ అవుతున్నాయి..
అదే తెలంగాణలో 10రోజులకు ఒకసారి కేసులు డబుల్ అవుతున్నాయి..

దేశంలో 10లక్షల మందిలో 275మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు..
తెలంగాణలో 10లక్షల మందిలో 375మందికి కరోనా పరీక్షలు చేస్తున్నం..
……
దేశంలో కేంద్రం కొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది.
తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఉండవు.
…..
వ్యవసాయ సంబంధిత ,మెడికల్ సంబంధిత వాటికి సడలింపులు ఇస్తున్నాము..
మిగతావాటికి ఎలాంటి సడలింపులు ఉండవు..
……
మే 1తారీఖు వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గొచ్చు..
ఈ రోజు 458మందిని పరీక్షిస్తే మొత్తం 18మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది..
జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద దెబ్బ తినే అవకాశం ఉంది..
……
విదేశాల నుండి వచ్చినవారంతా డిశ్చార్జ్ అయ్యారు..
ఢిల్లీ నుండి వచ్చినవాళ్ల వలనే కేసులు పెరిగాయి
4ఢిల్లీ కరోనా కేసుల కాంటాక్టులు తెలియాల్సి ఉంది
….
మే 7వరకు లాక్ డౌన్ అమలుల్లో ఉంటుంది.
లాక్ డౌన్ గురించి అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించాం
అత్యధిక శాతం మంది చాలా కఠినంగా ఉండాలని చెప్పారు
మీడియా సంస్థలు చేసిన సర్వేలో కూడా ఇదే వెల్లడి అయింది
అవసరమైతే మే నెలాఖరు వరకు పొడిగించమని చెప్పారు
గతంలో ఉన్న నియమాలే అన్ని ఉంటాయి
అత్యవసర వాటికి మినహాయింపు ఉంటుంది.
లాక్ డౌన్ నియమాలను కఠినంగా అమలు చేస్తాం
….. మే 29 వరకు కరోనా కష్టాలు తప్పవా?
తెలంగాణలో జోమాటా ,స్విగ్గీ సర్వీసులన్నీ రేపటి నుండి బంద్
ఈ రోజు ఆర్డర్ చేసుకున్నవారికి మినహయింపు
డెలివరీ చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఫుడ్ డోర్ డెలివరీ వల్ల ప్రమాదం ఉంటుంది
….
విమాన ప్రయాణికులు దయచేసి తెలంగాణకు రావొద్దు
మే 7వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది
క్యాబ్ సర్వీసులు ఏమి అందుబాటులో ఉండవు
….
పండుగలు,ప్రార్థనలు ఇండ్లల్లోనే జరుపుకోవాలి
అన్ని ఆలయాలు మూసివేశారు.
సామూహిక ప్రార్థనలు,మతపరమైన సమావేశాలకు అనుమతించబడవు
ఇప్పటికే చాలా ఆలయాల్లో దర్శనాలు ఆగాయి
……
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండటం మంచిది కాదు.మనకు గౌరవప్రదం ఉండకూడదు..
స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఈ సమస్య రాకుండా చూడాలి
……
మార్చి నెల వేతనమే ఏప్రిల్ నెలలో ఇస్తాం
వైద్య సిబ్బంది,పారిశుధ్య సిబ్బందికి పదిశాతం ప్రోత్సాహం ఈ నెల కూడా ఇస్తాం
పోలీసు సిబ్బందికి కూడా పది శాతం ప్రోత్సహం ఈ నెల నుండి ఇస్తాం
……
మూడు నెలలు అద్దె చెల్లింపులు వాయిదా
మార్చి,ఏప్రిల్,మే నెల అద్దెలు వసూలు చేయవద్దు
ఇది విజ్ఞప్తి కాదు…ప్రభుత్వం ఆదేశం
వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
వాయిదాలపై వడ్డీలు వసూలు చేయవద్దు
ఎవరైన బలవంతంగా వసూలు చేస్తే 100కి డయల్ చేయండి

ప్రయివేట్ విద్యాసంస్థలు 2020-21ఏడాదికి ఎలాంటి ఫీజులు పెంచకూడదు
ట్యూషన్ ఫీజుల కంటే ఎక్కువగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దు
నెలవారీగా ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి
మరో ఇతర ఫీజులు వసూలు చేయవద్దు
ఇతర ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు
వసూలు చేస్తే ప్రయివేట్ విద్యాసంస్థల అనుమతులు రద్దు చేస్తాం
…..
మే నెలలోనూ ఫ్రీ రేషన్
మే నెల మొదటివారంలోనే రేషన్
మే నెలలో కూడా ఒక్కొక్కరికి 12కేజీల బియ్యం
ఈ నెల మాదిరిగానే మే నెల కూడా 1500ఇస్తాం
……
వలస కార్మికుల కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 12కేజీల బియ్యం
మే నెలలో ఒక్కొక్క వలస కార్మిక కుటుంబానికి 1500ఇస్తాం
……
ఆసరా పెన్షన్లకు ఎలాంటి కోత లేదు..
40లక్షల మందికి ఆసరా పెన్షన్లు యధావిధిగా అందజేస్తాం
ప్రజాప్రతినిధులకు,ఉద్యోగులకు మాత్రం మార్చి మాదిరిగా కోత ఉంటుంది.
పెన్షనర్లకు మాత్రం 75%జీతం అందుతుంది
….మీడియాతో సీఎం కేసీఆర్

Categories
ANDHRA PRADESH NATIONAL TELANGANA

తెలుగు రాష్ట్రాల్లో రెడ్ జోన్లు ఇవే!

రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జాబితాను ప్రకటించిన కేంద్రం

రెడ్ జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో

రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువ ఉన్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు https://youtu.be/rAl8PmZe1_A

14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు – ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు

ఏపీలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్

తెలంగాణలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్

తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లాలు: నల్గొండ

తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట

Categories
FEATURED NATIONAL TELANGANA

కరోనా రక్కసి : తెలంగాణలో తొలి మరణం

హైదరాబాద్‌, విజేత టీవీ : తెలంగాణలో కరోనాతో తొలి మరణం నమోదైంది. ఖైరతాబాద్‌లో కరోనాతో వృద్ధుడు(74) మృతి చెందాడు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తి గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోతే అతని రక్త నమూనాలు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. చనిపోయిన వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారు.

ఇవాళ కొత్తగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఈటల రాజేందర్‌ అన్నారు.  తెలంగాణలో 65 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. పాతబస్తీలోని ఒకే కుటుంబంలో ఆరుగురికి, కుత్బుల్లాపూర్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకిందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి కార్మికుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

Categories
ANDHRA PRADESH FEATURED NATIONAL TECHNOLOGY TELANGANA

మీకు కరోనా రిస్క్ ఉందేమో? భారతీయుల కోసం కొత్త ఆవిష్కరణ!

దేశ ప్రజలారా.. మీ కోసం, మీ కుటుంబం కోసం ఒక్క నిమిషం..
ఒకే ఒక్క నిమిషం కేటాయించండి. మొత్తం జాగ్రత్తగా చదవండి.

కరోనా విలయం మానవ జీవితాలను ఛిద్రం చేస్తోంది.
వయసు, ధనిక, పేద, లింగ, కులం, మతం భేేదం లేకుండా విరుచుకు పడుతోంది.

కోటి గ్రూప్.. కొత్త ఆవిష్కరణ : ఈ కోవిడ్ 19 మహమ్మారి ని నియంత్రించడానికి, భారతదేశమనే వసుదైక కుటుంబాన్ని కాపాడుకోవడానికి హైదరాబాద్ కి చెందిన కోటి గ్రూప్ కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. అరచేతిలో మీ ఆరోగ్యాన్ని ఉంచుతూ సంజీవన్ పేరుతో యాప్ రూపొందించింది కోటి గ్రూప్ సంస్థ అయిన భారత్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్.

AI టెక్నాలజీ.. పూర్తిగా ఉచితం : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుతూ ఈ యాప్ రూపొందించినట్లు కోటి గ్రూప్ టెక్నికల్ టీం తెలిపింది. భారత దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంజీవన్ యాప్ ద్వారా కోవిడ్ 19 రిస్క్ అసెస్ మెంట్ రిపోర్ట్ పొందవచ్చు. మీరు, మీ ఫ్యామిలీ, స్నేహితులు ఎవరికి సంబంధించిన రిపోర్ట్ అయినా క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదీ పూర్తి ఉచితంగా..

అర చేతిలో ఆరోగ్యం.. క్లిక్ చేస్తే కరోనా రిపోర్ట్!ఆరోగ్యవంతమైన భారత దేశం కోసం ఈ యాప్ రూపొందించిన కోటి గ్రూప్ సేవ, ప్రేమ సౌరభాలను పంచితే..ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఈ యాప్ ఇలా వినియోగించుకోవచ్చు.

  1. ప్లే స్టోర్ లో NIHWN అని టైప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా ఆండ్రాయిడ్ యాప్ https://tinyurl.com/NIHWNgoogle ఆపిల్ ఫోన్ అయితే https://tinyurl.com/NIHWNapple మీద క్లిక్ చేయండి.
  2. యాప్ ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబర్, ఇతర వివరాలు ఎంటర్ చెయ్యాలి
  3. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వివరాలు కూడా ఎంటర్ చేయవచ్చు.
  4. తర్వాత కరోనా రిస్క్ అసెస్ మెంట్ రిపోర్ట్ కోసం కింది భాగాన ఉన్న Covid 19 మీద క్లిక్ చేయాలి.
  5. సిస్టం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎంచుకోండి.
  6. చివరిగా సబ్ మిట్ చేస్తే ..మీ ఫ్రీ రిపోర్ట్ మీ ఫోన్ కి మెసే జ్ మరియు వాట్సాప్ ద్వారా పంపబడుతుంది.
  7. మీకు 24 గంటలు ఫ్రీ హెల్త్ అసిస్టన్స్ ఉంటుంది.
  8. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే.. అక్కడే ఉన్న ఫోన్ సింబల్ మీద క్లిక్ చేయండి. లేదా 91001 81181 నెంబర్ కి కాల్ చేయండి.

130 కోట్ల భారతీయుల ఆరోగ్యం కోసం ప్రేమ తో సంజీవన్ యాప్ రూపొందించినవారు కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ప్రై. లిమిటెడ్.

Categories
FEATURED TELANGANA

కరోనా నియంత్రణ కోసం మేము సైతం..

కరోనా వైరస్‌  నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 

కరోనా నివారణ చర్యలకు, మహమ్మారిని పూర్తిస్థాయిలో తరిమికొట్టేందుకు   ప్రభుత్వానికి అండ‌గా ప‌లువురు త‌మ‌వంతు స‌హాయాన్ని అంద‌జేస్తున్నారు.   

హీరో నితిన్‌ పది లక్షల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్‌ అందించారు. 

తాజాగా ముఖ్యమంత్రి  కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కలిశారు.

కరోనా నిరోధానికి ఒకరోజు మూల వేతనాన్నిప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు  విరాళంగా అందించారు. కరోనా నియంత్రణకు సీఎం సహాయనిధికి రూ.48కోట్లు విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కలిసి జేఏసీ నాయకులు రవీందర్‌రెడ్డి, మమత చెక్‌ అందించారు.కరోనా నివారణ చర్యలకు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల సతీమణి భారీ విరాళం ప్రకటించారు. 

ముఖ్యమంత్రి సహాయనిధికి సత్యనాదెళ్ల సతీమణి అనుపమ రూ.2కోట్ల విరాళం అందించారు.

ఈ సందర్భంగా అనుపమ తండ్రి, విశ్రాంత ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ సీఎంను కలిసి చెక్‌ అందజేశారు. 

Categories
ANDHRA PRADESH FEATURED TELANGANA

కరోనా నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కరోనా కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా కనెక్షన్లు తీసుకున్నవారికి నెలరోజుల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచిస్తుండగా, ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే అదేబాటలో నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితి కారణంగా తనకు మరిన్ని కొత్త కనెక్షన్లు వస్తాయని బీఎస్ఎన్ఎల్ అంచనా వేస్తోంది. అందుకే కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రీ బ్రాడ్ బ్యాండ్ అంటూ సరికొత్త ప్లాన్ ప్రకటించింది.

ఇప్పటికే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్నవారు కొత్తగా బ్రాండ్ బ్యాండ్ సౌకర్యం కావాలనుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. దీనిపై బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ స్పందిస్తూ, తమ కొత్త ప్లాన్ తో ఉద్యోగులు ఇంటి నుంచి బయటికి రాకుండానే పని చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్నవారికి, కొత్తగా కనెక్షన్ తీసుకున్నవారికి ఉచితంగా ఒక నెల పాటు బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. ఇన్ స్టలేషన్ చార్జీలు కూడా వసూలు చేయబోమని, అయితే వినియోగదారులు ఇంటర్నెట్ మోడెమ్ ను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Categories
FEATURED TELANGANA

కన్నపేగు బంధం..భావోద్వేగం.. అమ్మ చెంతకు అమృత..!

“గిరిజా క్షమించు..అమృత అమ్మ దగ్గరకి వెళ్లు..” ఈ వాక్యం సంచలనం సృష్టించింది. ఎన్నో మనసుల్ని కరిగించింది. మారుతీరావు చివరగా కోరుకున్నది ఇదే.. చిన్న అడుగు పడింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో బాధితురాలు అమృత.. తన తల్లి గిరిజను ఈ రోజు కలిసింది. కొన్ని రోజుల క్రితం ఆమె తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి అంతిమచూపు కోసం అంత్యక్రియల వద్దకు వెళ్లిన ఆమెను కొందరు కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వెనుదిరిగింది. ఇప్పుడు తన బిడ్డతో కలసి పుట్టింటికి వెళ్లి తల్లిని పరామర్శించింది. అమృతను చూడగానే గిరిజ భావోద్వేగానికి గురైనట్టు తెలిసింది. సుమారు 25 నిమిషాల పాటు పుట్టింట్లో గడిపిన అమృత అనంతరం తన కుమారుడితో కలసి వెనుదిరిగింది. అమృత బాబాయ్ శ్రవణ్ ఇంట్లో లేని సమయంలో ఆమె తల్లి వద్దకు వెళ్లి పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది.

Categories
CRIME FEATURED TELANGANA

అమృతకి చిల్లిగవ్వ కూడా రాయలేదు.. మారుతీరావు ఆస్తులు ఇన్ని వందల కోట్లా!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ ప్రేమ వివాహం ఆపై ప్రణయ్ ని అమృత తండ్రి మారుతీరావు అంతమొందించడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మారుతీరావు ఆత్మహత్య కూడా అంతే సంచలనం. ఈ పరిస్థితుల్లో మారుతీరావు ఆస్తుల వివరాలను పోలీసులు కోర్టు ముందుంచారు

రావు భార్య, తమ్ముడి పేరు మీదనే వీలునామా రాసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం మారుతీరావు ఆస్తుల విలువ రూ.200 కోట్లుగా లెక్క ఉందట. మొదట కిరోసిన్ డీలర్‌గా వ్యాపారం చేసిన మారుతీరావు.. తర్వాత రైస్ మిల్లుల బిజినెస్ మొదలు పెట్టారు. అనంతరం రైస్ మిల్లులు అమ్మి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. అలాగే.. మారుతీరావుకి బినామీలు కూడా ఉన్నట్లు అమృత కూడా చెప్పింది. మరి బినామీల లెక్కన ఇంకెంత ఆస్తి ఉందో తెలియాలి.

చార్జ్ షీట్‌లో మారుతీరావు ఆస్తుల వివరాలు:

1. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో వంద విల్లాలు విక్రయం
2. అమృత ఆస్పత్రి పేరుతో వంద పడకల ఆస్పత్రి
3. భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి
4. హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం
5. హైదరాబాద్‌లో పలు చోట్ల 5 ఫ్లాట్లు
6. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్
7. ఈదులగూడెం క్రాస్ రోడ్‌లో మరో షాపింగ్ మాల్
8. మారుతీ రావు తల్లి పేరుతో రెండంతస్తుల భవనం
9. మిర్యాల గూడ బైపాస్ రోడ్‌లో 22 గుంటల భూమి