Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై ! పోస్ట్ డిలీట్..

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే… వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి కారణం ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన పోస్ట్. ‘పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ వంశీ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

దమ్ముంటే రా తేల్చుకుందాం ..సవాల్

వైసీపీలో కూడా వల్లభనేని వంశీ ఇమడలేకపోతున్నారా? రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వాస్తవానికి వైసీపీలో అధికారికంగా వంశీ చేరపోయినప్పటికీ… ముఖ్యమంత్రి జగన్ కు మద్దతిస్తున్నారు. అసెంబ్లీలో సైతం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీలపై ఆయన చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో వంశీ చేసిన కామెంట్ తో మళ్లీ చర్చ మొదలైంది. వైసీపీ శిబిరంలో వంశీ ఇమడలేకపోతున్నారా? సొంత నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత దక్కలేదా? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు, ఈ పోస్టు వైరల్ అయిన నేపథ్యంలో… దాన్ని వంశీ తొలగించారు.

Categories
FEATURED NATIONAL POLITICS

కరోనా ధనవంతుల వ్యాధి.. అంటించారు – సీఎం పళణి స్వామి సంచలన వ్యాఖ్యలు

ప్రపంచాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టేసిన కరోనా వైరస్‌‌ను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ‘ధనవంతుల వ్యాధి’గా అభివర్ణించారు. ధనవంతులే దానిని రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతోందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారానే వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని అన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని సీఎం పేర్కొన్నారు.

దమ్ముంటే ఆపరా , ఎన్నారై సవాల్ – క్లిక్

రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.
కాగా, తమిళనాడులో నిన్న కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

Categories
FEATURED NATIONAL POLITICS

మే 3 వరకు లాక్‌డౌన్‌, కఠినంగా అమలు: ప్రధాని మోదీ

కరోనా (కొవిడ్‌ -19) వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్‌ వచ్చే నెల మూడు మే -3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నేటితో ముగస్తున్న నేపథ్యంలో మోదీ ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో అందరి ఆలోచనలు తీసుకున్న ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే-

🔸కరోనావైరస్ మహమ్మారిపై భారత్ పోరాటం బలంగా కొనసాగుతోంది.

🔸మీరు కష్టాలకు ఓర్చుకుని, దేశాన్ని కాపాడారు.

🔸మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు.

🔸ఓ సైనికుడిలా మీరు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు

🔸మన రాజ్యాంగంలో ‘వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా’ అన్నదానికి అర్థం ఇదే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున మన సామూహిక శక్తిని చాటుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నాం.

🔸రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున మన సామూహిక శక్తిని చాటుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నాం.

🔸లాక్‌డౌన్‌లో నియమనిబంధనలను పాటిస్తూ పండుగలను జరుపుకోవడం స్ఫూర్తిదాయకం.

🔸కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త సంవత్సరం పండుగ జరుపుకుంటున్నారు. వారికి నా శుభాకాంక్షలు.

🔸మిగతా దేశాలతో పోల్చితే భారత్ కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేసిన కృషిలో మీరు భాగస్వాములు, దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా.

🔸కరోనావైరస్ రోగుల సంఖ్య వందకు చేరుకోకముందు విదేశాల నుంచి వచ్చినవారికి 14 రోజుల ఐసోలేషన్‌ను భారత్ తప్పనిసరి చేసింది.

🔸550 కేసులున్నప్పుడు 21 రోజుల లాక్‌డౌన్ రూపంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాం.

🔸సమస్య తలెత్తగానే, త్వరగా నిర్ణయం తీసుకుని దాన్ని అరికట్టే ప్రయత్నం చేశాం.

🔸ఈ సమస్య విషయంలో ఏ దేశంతోనూ మనం పోల్చుకోవడం సరికాదు. కానీ, ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో పోల్చుకుని చూసుకుంటే, భారత్ ఇప్పుడు చాా మెరుగైన స్థితిలో ఉంది.

🔸నెలన్నర కిందట కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చాలా దేశాలు భారత్‌తో సమానంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాల్లో మన కన్నా 25 రెట్లు ఎక్కువగా కేసులు పెరిగాయి

🔸భారత్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేం.

🔸కొన్ని రోజులుగా జరుగుతున్నది చూస్తే, మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని అర్థం అవుతుంది.

🔸సామాజిక దూరం పాటించడం, లౌక్‌డౌన్ వల్ల దేశానికి చాలా లాభం జరిగింది.

🔸ఆర్థికపరంగా చూసుకుంటే దీని వల్ల మనకు బాగా నష్టం జరిగిందనిపించవచ్చు. కానీ, దేశ పౌరుల ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదు.

🔸మనం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు ప్రపంచవ్యాప్తంగా నిపుణులను, ప్రభుత్వాలను భయపెడుతోంది.

🔸కరోనావైరస్‌పై పోరాటం మనం ఎలా కొనసాగించాలి? నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రజల ఇబ్బందులను ఎలా తక్కువ చేసుకోవాలి? ఈ విషయాలన్నింటిపై రాష్ట్రాలతో చర్చించాం.

🔸లాక్‌డౌన్ పొడిగించాలని చాలా రాష్ట్రాలు కోరాయి. కొన్ని అమలు చేశాయి కూడా.

🔸భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం.కొంత ప్రాంతాల్లో మనం ఇక కరోనావైరస్ వ్యాపించనీయకూడదు.

🔸మనం ముందుకున్నా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి.

🔸హాట్‌స్పాట్లుగా మారే అవకాశమున్న ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టాలి. కొత్త హాట్‌స్పాట్లతో మనకు మరిన్ని ఇబ్బందులు వస్తాయి.

🔸ఏప్రిల్ 20 వరకూ అన్ని చోట్లా కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసుకోవాలి.

🔸హాట్‌స్పాట్లు పెరగకుండా ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తాం.

🔸రేపు ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది.

🔸ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా పేదలకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

🔸రబీ కోతలు జరిగే సమయం ఇది. వారికి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలతో కలిసి అందరం ప్రయత్నిస్తున్నాం.మన దగ్గర ఆహారం, ఔషధాల నిల్వలు మెండుగా ఉన్నాయి.

🔸భారత్‌లో లక్ష పడకలకు ఏర్పాట్లు చేశాం. కోవిడ్-19 చికిత్స కోసం ఉన్న ఆసుపత్రులే 6 వేలకుపైగా ఉన్నాయి.

🔸మనం ధైర్యంగా, నిబంధనలను పాటిస్తూ పోతే కరోనావైరస్‌ను ఓడించి తీరుతాం.

మీకు “సప్తపది” ఏడు ముఖ్య విషయాలు చెబుతున్నా.

  1. ఇళ్లలో ఉండే వృద్ధులు, ఇదివరకే ఆరోగ్య సమస్యలున్నవారి గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  2. లాక్‌డౌన్, సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.
  3. ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులను తప్పకుండా వాడండి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ చేసిన సూచనలను పాటించండి.
  4. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇతరులకు కూడా చెప్పండి.
  5. మీకు సాధ్యమైనంత పేద కుటుంబాలకు సాయపడండి. వారి ఆకలి తీర్చండి.
  6. మీ వ్యాపారం, పరిశ్రమల్లో పనిచేసేవారి పట్ల సానుభూతితో ఉండండి. ఎవరినీ ఉద్యోగం నుంచి తీసేయొద్దు.
  7. వైద్యులు, నర్సులు, పోలీసులు ఇలా ఈ సంక్షోభ సమయంలో మనకు సేవలందిస్తున్నవారందరినీ గౌరవించండి.

మే 3 వరకూ లాక్‌డౌన్ నిబంధనలను పాటించండి. ఎక్కడున్నవారే అక్కడే ఉండండి. సురక్షితంగా ఉండండి.

Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

కరోనాతో అల్లాడుతుంటే ఎన్నికలా? – సీపీఐ నారాయణ

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధంకావాలని నూతన ఎన్నికల కమిషనర్ చెప్పటం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.

కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే హడావుడిగా జస్టిస్ కనగ రాజ్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం అనైతికం కాక మరేంటని ప్రశ్నించారు.

ఎలాగోలా స్థానిక ఎన్నికలు జరిపే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనా విధానానికి, బాధ్యతా రాహిత్యానికి ఇది అద్దం పడుతున్నదని విమర్శించారు.

Categories
ADHYATMIKA SAKTHI POLITICS

రాశి ఫలం 20.03.2020

తిథి: బహుళ ఏకాదశి ఉ.7.37, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941

నక్షత్రం: శ్రవణం సా.6.19

వర్జ్యం: రా.10.35 నుండి 12.17 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 1.12 వరకు

రాహు కాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు ,విశేషాలు: సర్వేషాం ఏకాదశి

మేషం: 

(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

వృషభం: 

(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మిథునం: 

(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

కర్కాటకం: 

(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.

సింహం: 

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య: 

(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వున్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు.

తుల: 

(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళన తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.

వృశ్చికం: 

(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.

ధనుస్సు: 

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.

మకరం: 

(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.

కుంభం: 

(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) మనస్సు చంచలంగా వుంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి.

మీనం: 

(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.

Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

కలెక్టర్లను తప్పించే అధికారం ఎవరిచ్చారు?చంద్రబాబు పదవి ఇస్తే మాత్రం ఇంత వివక్షా? ఎన్నికల కమిషనర్ చర్యలపై సీఎం ఆగ్రహం!

కరోనా వైరస్ పేరుతో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని సీఎం వైఎస్ జగన్ తప్పుపట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్యల పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు.

ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని.. ఇటువంటి పరిస్థితి వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చింతించాల్సిన అవసరం ఉంది సీఎం జగన్ అన్నారు. మరోవైపు చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు సీఎం. చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఎన్నికల కమిషనర్ ఇంత వివక్ష చూపడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, కులాలు మతాలకు అతీతంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించాలని ఆయన కోరారు.

ఒకవైపు కరోనా ఎఫెక్టుతో ఎన్నికలు వాయిదా అంటూనే అధికారులను తప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు ఎన్నికల కమిషనర్.మరోవైపు కలెక్టర్లు అధికారులను బదిలీ చేయటం ఎంతవరకు సబబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ” రమేష్ కుమార్ కు ఇలా వ్యవహరించే అధికారం ఎక్కడిది..అధికారం ముఖ్యమంత్రిదా?.. ఈసీదా..? ఎవరో రాస్తున్నారు ఎవరో ఆర్డర్ ఇస్తున్నారు ఆ ఆర్డర్ను ఈయన చదువుతున్నారు. ఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా అడిగారా..? కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రెటరీ ని పిలిచి ఎందుకు అడగలేదు. చివరకు పేదలకు ఇళ్ల పట్టాల ప్రక్రియను కూడా ఆపేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారుప్రజలు ఓట్లు వేసి 151 స్థానాలు ఇస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇంత వివక్ష చూపటం ధర్మమేనా, ఇది సరైందేనా” – సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

కరోనా వైరస్ పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి.” కరోనా మన దేశంలో పుట్టింది కాదు. కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది .కరోనా భయానకం ఏమి కాదు . కేవలం రెండు మూడు వారాల్లో పరిస్థితి మారిపోదు నిరంతర ప్రక్రియగా ఏడాది పాటు జరగాల్సి ఉంది. జాగ్రత్తలు తీసుకుంటూనే దైనందిన జీవితం కొనసాగాలి .విశాఖపట్నంలో 200, విజయవాడలో 50 పడకల వార్డులు సిద్ధంగా ఉన్నాయి. గ్రామ వాలంటీర్లతో ప్రతి ఇల్లు సర్వే చేస్తున్నాం .విచక్షణ కోల్పోయి ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు.” – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.

Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా

ఏపీలో అరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా.

ఏపీ లో పంచాయతీ ఎన్నికలు వాయిదా

పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం.

సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన

ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు.

ఇప్పటవరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదు.

అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడి

ఈ ఆరు వారాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది..

ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఆ పదవుల్లో కొనసాగుతారు..

Zptc, mptc, పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ ఆరు వరాల తర్వాత కూడా యధాతధం..

పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను మాత్రం కొత్తగా విడుదల చేయడం జరుగుతుంది..

ఎన్నికలు వాయిదా మాత్రమే..రద్దు కాదు..కావునా కోడ్ of కాండక్ట్ ఈ ఆరు వారాలు అమల్లో ఉంటుంది..
👉👉 రాష్ట్ర ఎన్నికల కమిషన్

Categories
ANDHRA PRADESH FEATURED POLITICS

పిరికి సమాజానికి ధైర్యం పోసేందుకు వచ్చాను – పవన్ కల్యాణ్

పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పవన్​ కల్యాణ్​ పాల్గొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాజకీయాల్లోకి క్రిమినల్స్‌ వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.

చిన్నప్పటి నుంచి ఇలాంటి ఘటనలన్నీ చూసే పార్టీ పెట్టాల్సి వచ్చిందన్నారు.

భయపెట్టే పరిస్థితులను ఎదిరించి ముందుకెళ్తున్నానని తెలిపారు.

ఓటమిని ఎదుర్కొని ముందుకెళ్తేనే గెలుపు సాధ్యమని పవన్‌కల్యాణ్‌ అన్నారు. నిలబడి పోరాటం చేయాలంటే ధైర్యం ఉండాలన్నారు.

పిరికివాళ్లు తనకు అవసరం లేదని.. గుండె ధైర్యం ఉన్నవాళ్లే కావాలన్నారు.

కత్తులు తీసుకుని తిరగటం కాదని…ధైర్యంగా మనోభావాలను వ్యక్తీకరించాలని సూచించారు