Categories
FEATURED NATIONAL

లాక్ డౌన్ 4.0 రూల్స్ ఇవే

*న్యూఢిల్లీ*

దేశంలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు

*ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కేంద్రం మినహాయింపులు*

ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం

జోన్లలో అనుసరించాల్సిన విధివిధానాలపైనా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ

రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని, కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎంలు చేసిన ఫిర్యాదుతో వెసులుబాటు ఇచ్చిన కేంద్రం

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్రాలు కఠినంగా ఉండాల్సిందేనన్న కేంద్రం

*కరోనా కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని కేంద్రం సంకేతం*

బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం

స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్న కేంద్రం!లాక్

Categories
FEATURED NATIONAL

మే 17వరకు లాక్ డౌన్ పొడిగింపు

లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడగింపు

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడగింపు..

మే 17 వరకు కొనసాగనున్న దేశ వ్యాప్త లాక్ డౌన్

ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు

లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు

దేశవ్యాప్తంగా మే 17వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌
గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపు
విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌
హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌
స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి
అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు
అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి

గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు
రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు
వారంకు ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన
కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు
గ్రీన్‌, ఆరేంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం

గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి
ఆరేంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి
ఆరేంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
ఆరేంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి
ఆరేంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు

Categories
ANDHRA PRADESH FEATURED NATIONAL

అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై!

వినియోగదారులకు ఊరట, అన్ని షాపులు తెరచుకోవచ్చు.. కండిషన్స్ అప్లై – కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అర్ధరాత్రి ఉత్తర్వులు

★ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

★ దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని తెలిపింది.

★ ఐతే… కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని కేంద్రం తెలిపింది.

★ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి మార్గదర్శనం చేసింది.

★ ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి… తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు.

★ అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు.

★ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు.

★ మరో ముఖ్య విషయమేంటంటే, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు.

★ ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది.

★ ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది.

★ ప్రజలు సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి.

★ లేకపోతే కరోనావైరస్ సామాజిక వ్యాప్తికి దోహదం అవుతుందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కో‌రుతున్నారు.

★ అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు.

★ ఐతే… రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే… ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు.

★ సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి.

★ అలాగే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి.

★ అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

Categories
FEATURED NATIONAL POLITICS

కరోనా ధనవంతుల వ్యాధి.. అంటించారు – సీఎం పళణి స్వామి సంచలన వ్యాఖ్యలు

ప్రపంచాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టేసిన కరోనా వైరస్‌‌ను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ‘ధనవంతుల వ్యాధి’గా అభివర్ణించారు. ధనవంతులే దానిని రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతోందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారానే వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని అన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని సీఎం పేర్కొన్నారు.

దమ్ముంటే ఆపరా , ఎన్నారై సవాల్ – క్లిక్

రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.
కాగా, తమిళనాడులో నిన్న కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

Categories
ANDHRA PRADESH CRIME NATIONAL

జూమ్ యాప్ తో భద్రతకు ముప్పు!

జూమ్ యాప్ తో వీడియో కాన్ఫరెన్స్ శ్రేయస్కరం కాదన్న కేంద్ర హోం శాఖ

లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూమ్ యాప్ ను వినియోగిస్తున్నారని, ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదని కేంద్ర హోం శాఖ సూచించింది.

భద్రతాపరంగా ఈ యాప్ ను వినియోగించవద్దని ప్రైవేట్ సంస్థలకు సూచిస్తూ ఓ ప్రకటన చేసింది. కాగా, లాక్ డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు భద్రత లేకుండా పోయిందని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి.

Categories
ANDHRA PRADESH NATIONAL TELANGANA

తెలుగు రాష్ట్రాల్లో రెడ్ జోన్లు ఇవే!

రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జాబితాను ప్రకటించిన కేంద్రం

రెడ్ జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో

రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువ ఉన్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు https://youtu.be/rAl8PmZe1_A

14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు – ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు

ఏపీలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్

తెలంగాణలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్

తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లాలు: నల్గొండ

తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట

Categories
FEATURED NATIONAL POLITICS

మే 3 వరకు లాక్‌డౌన్‌, కఠినంగా అమలు: ప్రధాని మోదీ

కరోనా (కొవిడ్‌ -19) వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్‌ వచ్చే నెల మూడు మే -3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నేటితో ముగస్తున్న నేపథ్యంలో మోదీ ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో అందరి ఆలోచనలు తీసుకున్న ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే-

🔸కరోనావైరస్ మహమ్మారిపై భారత్ పోరాటం బలంగా కొనసాగుతోంది.

🔸మీరు కష్టాలకు ఓర్చుకుని, దేశాన్ని కాపాడారు.

🔸మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు.

🔸ఓ సైనికుడిలా మీరు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు

🔸మన రాజ్యాంగంలో ‘వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా’ అన్నదానికి అర్థం ఇదే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున మన సామూహిక శక్తిని చాటుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నాం.

🔸రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున మన సామూహిక శక్తిని చాటుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నాం.

🔸లాక్‌డౌన్‌లో నియమనిబంధనలను పాటిస్తూ పండుగలను జరుపుకోవడం స్ఫూర్తిదాయకం.

🔸కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త సంవత్సరం పండుగ జరుపుకుంటున్నారు. వారికి నా శుభాకాంక్షలు.

🔸మిగతా దేశాలతో పోల్చితే భారత్ కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేసిన కృషిలో మీరు భాగస్వాములు, దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా.

🔸కరోనావైరస్ రోగుల సంఖ్య వందకు చేరుకోకముందు విదేశాల నుంచి వచ్చినవారికి 14 రోజుల ఐసోలేషన్‌ను భారత్ తప్పనిసరి చేసింది.

🔸550 కేసులున్నప్పుడు 21 రోజుల లాక్‌డౌన్ రూపంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాం.

🔸సమస్య తలెత్తగానే, త్వరగా నిర్ణయం తీసుకుని దాన్ని అరికట్టే ప్రయత్నం చేశాం.

🔸ఈ సమస్య విషయంలో ఏ దేశంతోనూ మనం పోల్చుకోవడం సరికాదు. కానీ, ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో పోల్చుకుని చూసుకుంటే, భారత్ ఇప్పుడు చాా మెరుగైన స్థితిలో ఉంది.

🔸నెలన్నర కిందట కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చాలా దేశాలు భారత్‌తో సమానంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాల్లో మన కన్నా 25 రెట్లు ఎక్కువగా కేసులు పెరిగాయి

🔸భారత్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేం.

🔸కొన్ని రోజులుగా జరుగుతున్నది చూస్తే, మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని అర్థం అవుతుంది.

🔸సామాజిక దూరం పాటించడం, లౌక్‌డౌన్ వల్ల దేశానికి చాలా లాభం జరిగింది.

🔸ఆర్థికపరంగా చూసుకుంటే దీని వల్ల మనకు బాగా నష్టం జరిగిందనిపించవచ్చు. కానీ, దేశ పౌరుల ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదు.

🔸మనం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు ప్రపంచవ్యాప్తంగా నిపుణులను, ప్రభుత్వాలను భయపెడుతోంది.

🔸కరోనావైరస్‌పై పోరాటం మనం ఎలా కొనసాగించాలి? నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రజల ఇబ్బందులను ఎలా తక్కువ చేసుకోవాలి? ఈ విషయాలన్నింటిపై రాష్ట్రాలతో చర్చించాం.

🔸లాక్‌డౌన్ పొడిగించాలని చాలా రాష్ట్రాలు కోరాయి. కొన్ని అమలు చేశాయి కూడా.

🔸భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం.కొంత ప్రాంతాల్లో మనం ఇక కరోనావైరస్ వ్యాపించనీయకూడదు.

🔸మనం ముందుకున్నా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి.

🔸హాట్‌స్పాట్లుగా మారే అవకాశమున్న ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టాలి. కొత్త హాట్‌స్పాట్లతో మనకు మరిన్ని ఇబ్బందులు వస్తాయి.

🔸ఏప్రిల్ 20 వరకూ అన్ని చోట్లా కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసుకోవాలి.

🔸హాట్‌స్పాట్లు పెరగకుండా ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తాం.

🔸రేపు ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది.

🔸ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా పేదలకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

🔸రబీ కోతలు జరిగే సమయం ఇది. వారికి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలతో కలిసి అందరం ప్రయత్నిస్తున్నాం.మన దగ్గర ఆహారం, ఔషధాల నిల్వలు మెండుగా ఉన్నాయి.

🔸భారత్‌లో లక్ష పడకలకు ఏర్పాట్లు చేశాం. కోవిడ్-19 చికిత్స కోసం ఉన్న ఆసుపత్రులే 6 వేలకుపైగా ఉన్నాయి.

🔸మనం ధైర్యంగా, నిబంధనలను పాటిస్తూ పోతే కరోనావైరస్‌ను ఓడించి తీరుతాం.

మీకు “సప్తపది” ఏడు ముఖ్య విషయాలు చెబుతున్నా.

  1. ఇళ్లలో ఉండే వృద్ధులు, ఇదివరకే ఆరోగ్య సమస్యలున్నవారి గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  2. లాక్‌డౌన్, సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.
  3. ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులను తప్పకుండా వాడండి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ చేసిన సూచనలను పాటించండి.
  4. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇతరులకు కూడా చెప్పండి.
  5. మీకు సాధ్యమైనంత పేద కుటుంబాలకు సాయపడండి. వారి ఆకలి తీర్చండి.
  6. మీ వ్యాపారం, పరిశ్రమల్లో పనిచేసేవారి పట్ల సానుభూతితో ఉండండి. ఎవరినీ ఉద్యోగం నుంచి తీసేయొద్దు.
  7. వైద్యులు, నర్సులు, పోలీసులు ఇలా ఈ సంక్షోభ సమయంలో మనకు సేవలందిస్తున్నవారందరినీ గౌరవించండి.

మే 3 వరకూ లాక్‌డౌన్ నిబంధనలను పాటించండి. ఎక్కడున్నవారే అక్కడే ఉండండి. సురక్షితంగా ఉండండి.

Categories
FEATURED NATIONAL WORLD

WHO : స్వైన్‌ ఫ్లూ కంటే పదిరెట్లు ప్రమాదకారి!


డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ స్వైన్‌ ఫ్లూ కంటే పది రెట్లు ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కరోనా వైరస్ ఎంతో ప్రమాదకారి అని, వేగంగా వ్యాప్తి చెందుతుందని మనందరికీ తెలుసు. అయితే, ఇది స్వైన్‌ ఫ్లూ కంటే పదిరెట్లు వేగంగా వ్యాపిస్తుందని, జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ వైరస్‌ సోకిన వారిని నిర్భందంలో ఉంచడం ఎంతో ముఖ్యమని సూచించింది. వైరస్‌ బాధితులకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించడం సవాలుతో కూడుకున్న పని అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్ అధానోమ్‌ తెలిపారు.

https://youtu.be/tEWiO6fzK44

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించాలని ప్రపంచ దేశాలను యునైటెడ్ నేషన్స్‌ ఆరోగ్య సంస్థ కోరిన నేపథ్యంలో తాజాగా డబ్ల్యూహెచ్‌వో చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది. ‘‘మనకు ఏం తెలుసో అది మాత్రమే చెప్తాం. మనకు తెలిసిన దాని గురించే పని చేయగలం. వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది, దాని తీవ్రత ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కొవాలనే అనేదానికి ఇప్పటికే పలు దేశాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. అలానే కొన్ని దేశాల్లో ప్రతి మూడు నాలుగు రోజులకు కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. అయితే, వైరస్‌ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంత నెమ్మదిగా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.’’ అని టెడ్రస్ అన్నారు.